యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

తిరుపతి రూరల్ మండలం ముండ్లపూడి గ్రామంలో ‘ఆపరేషన్ త్రిశూల్’పై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు SP ఏ.శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని డ్రగ్స్ నిర్మూలన, మహిళలు, బాలికల భద్రత, వేధింపుల నివారణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజలకు వివరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామంలో డ్రగ్స్ వినియోగం, విక్రయం లేదా అసాంఘిక కార్యకలాపాలు, బాలికలపై వేధింపులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

