← Back to news

కాల్ వస్తే టెన్షన్.. మెసేజ్ వస్తే మాత్రం ఈజీ!

By Nani Garikina· 6h ago
కాల్ వస్తే టెన్షన్.. మెసేజ్ వస్తే మాత్రం ఈజీ!

ఫోన్ మోగగానే ఎత్తేయాలంటే చాలామందికి చిన్న టెన్షన్.. కానీ అదే విషయం మెసేజ్‌లో వస్తే ఈజీగా అనిపిస్తుంది! టెక్స్ట్‌లో సమాధానం ఆలోచించుకునే టైమ్ ఉంటుంది; వెంటనే స్పందించాల్సిన ఒత్తిడి ఉండదు. ఎదుటివారి గొంతు టోన్, మౌనం, ఇబ్బందికరమైన సైలెన్స్‌ను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. రోజంతా నోటిఫికేషన్స్, రీల్స్, మెసేజెస్‌తో ఉండే Gen-Zకి సంభాషణ తమ కంట్రోల్‌లో ఉండటం కంఫర్ట్‌గా అనిపించొచ్చు. అందుకే కాల్ చేయడం కంటే టెక్స్ట్ పంపడం సేఫ్‌గా ఫీల్ అవుతుంది. ఇది కాల్స్ అంటే భయమని కాదు.. కమ్యూనికేషన్ విధానం మారింది.

More in Gen Z