← Back to news

హైదరాబాద్‌లో యష్ 'టాక్సిక్' సందడి

By sahani· 23 Aug 2026· Eenadu· Hyderabad
హైదరాబాద్‌లో యష్ 'టాక్సిక్' సందడి

KGF ఫేమ్ యష్ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్‌లో కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ నిర్మించిన ఈ సినిమాలో కియారా, నయనతార లీడ్ రోల్స్ చేస్తున్నారు. నిజాయితీగా కష్టపడితే ప్రేక్షకులు ఆదరిస్తారని, ఈ మూవీ ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవల్‌లో నిలబెడుతుందని యష్ అన్నారు. ఇదొక బోల్డ్ డ్రీమ్ అని ప్రొడ్యూసర్ వెంకట్ చెప్పారు. ఈ నెల 26న టాక్సిక్ థియేటర్లలో రిలీజ్ కానుంది.

More in Entertainment