← Back to news

బెంగళూరులో నిరసన.. ధ్రువ్ రాఠీ స్పెషల్ వీడియో

By Vishi· 5h ago· X

CEC జ్ఞానేశ్ కుమార్ రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తూ బెంగళూరులో అక్టోబర్ 8న జరిగే నిరసన కోసం అభిజీత్ తన సర్‌ప్రైజ్ అతిథిగా యూట్యూబర్ ధ్రువ్ రాఠీని పరిచయం చేశారు. "ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న పోరాటం. బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌ వద్ద కలుద్దాం. అలాగే అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనలో పాల్గొనడం మర్చిపోవద్దు" అని ధ్రువ్ రాఠీ పిలుపునిచ్చారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ ‘జ్ఞాను...ఇప్పుడు నీ వంతు వచ్చింది’ అని మరాఠీలో చెప్పారు.

More in Current Affairs

అక్టోబర్‌ 7.. ప్రజాస్వామ్యానికి ‘బ్లాక్ డే’: కాంగ్రెస్
Current Affairs· 6h ago

అక్టోబర్‌ 7.. ప్రజాస్వామ్యానికి ‘బ్లాక్ డే’: కాంగ్రెస్

లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా ఇండి కూటమి ఎంపీలపై <a href="https://www.theclearcutnews.com/n/FSTNmBx">ఢిల్లీ పోలీసులు</a> చేసిన <a href="https://www.theclearcutnews.com/n/6sdrN3m">చర్య</a>ను కాంగ్రెస్ <a href="https://www.theclearcutnews.com/n/JWtPBGU">‘రాజ్యాంగంపై దాడి’</a>గా పేర్కొంది. అక్టోబర్ 7ను భారతీయ ప్రజాస్వామ్యానికి ‘బ్లాక్ డే’గా ప్రకటించింది. రేపు (అక్టోబర్ 8, 2026) రాష్ట్ర, జిల్లా, బ్లాక్/మండల స్థాయిల్లో భారీ నిరసనలు నిర్వహించాలని పార్టీ యూనిట్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(ఆర్గనైజేషన్) కె.సి.వేణుగోపాల్ అన్ని PCC అధ్యక్షులకు లేఖ రాశారు.