← Back to news

అయోధ్య ఆసుపత్రిలో దారుణం!

By Nani Eluri· 1h ago· News18

అయోధ్య జిల్లా ఆసుపత్రిలో తోడు ఎవరూ లేని పేషెంట్‌ను నేలపై లాగుతూ తీసుకెళ్లిన వీడియో వైరల్‌గా మారింది. అక్టోబర్ 5న సుమారు 45 ఏళ్ల పేషెంట్‌ను ఊపిరితిత్తుల సమస్యలు తెలుసుకునే టెస్ట్ కోసం ల్యాబ్‌కు తీసుకెళ్లారు. టెస్ట్ తర్వాత వార్డుకు తీసుకెళ్లేందుకు సిబ్బంది లేకపోవడంతో మరో పేషెంట్ అటెండెంట్ అతని రెండు చేతులు పట్టుకుని దాదాపు 200 మీటర్లు నేలపై లాగుతూ తీసుకెళ్లాడు. ఘటనపై విమర్శలు రావడంతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. అయితే పేషెంట్‌ను లాగిన వ్యక్తి ఆసుపత్రి సిబ్బంది కాదని అధికారులు తెలిపారు.

More in Viral