← Back to news

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

By ANUMALA NITHISH· 19 Aug 2026· Narsampet (Ct), Narsampet, Warangal
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

TG: వరంగల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం శివారులోని బాలు తండాకు చెందిన తేజావత్‌ వెంకటేష్‌ బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది పైలట్‌ వైనాల నాగరాజు, ఈఎంటీ పాషా హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడికి అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

More in Local