జార్ఖండ్‌లో పోటీ పరీక్షల అక్రమాలు..ఇద్దరు అరెస్ట్

14వ JPSC Prelims exam అక్రమాలకు సంబంధించి జార్ఖండ్ రాజధాని రాంచీలో ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సంజీత్ కుమార్‌ను జార్ఖండ్ CID అధికారులు అరెస్ట్ చేశారు. అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని పరీక్షలో క్వాలిఫై అవ్వడానికి సాయం చేస్తానని చెప్పినట్టు ఆరోపణలున్నాయి. మరో కేసులో JSSC CGL పరీక్షలో అభ్యర్థులకు అక్రమంగా సాయం చేసిన ఆరోపణలపై దిలీప్ కుమార్ పాస్వాన్‌ను వెస్ట్ బర్ద్వాన్‌లో అరెస్ట్ చేశారు. అతణ్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.



