చాకలి ఐలమ్మ జయంతి వేడుకలకు 10 లక్షల రూపాయలు

TG: సెప్టెంబర్ 26న జరిగే చాకలి ఐలమ్మ జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జయంతి సందర్భంగా రాష్ట్రస్థాయి వేడుకల నిర్వహణ కోసం ‘వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కమిటీ–2026’ని ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చింది. జయంతి వేడుకల నిర్వహణకు 10 లక్షల రూపాయలు మంజూరు చేసింది. వర్ధంతి(మరణ వార్షికోత్సవం) నిర్వహణకు 3 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు మెమోలో పేర్కొంది.

