Latest

హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
Local· 1d ago

హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

AP: గుంటూరు జిల్లా మంగళగిరిలోని అరవింద హైస్కూల్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, విద్యార్థినీలు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు. కృష్ణుడు–గోపికల నృత్యాలు, ముత్యాల కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేలా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు.

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన
Local· 1d ago

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

TG: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి ఏఈఓ క్రిసోలైట్‌ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే కషాయాలు, బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, దశపర్ణి తయారీ విధానాలపై రైతులకు వీడియోల ద్వారా అవగాహన కల్పించారు.

వరల్డ్ వైడ్ మోస్ట్ ఎవైటెడ్ కంబ్యాక్!
Entertainment· 1d ago

వరల్డ్ వైడ్ మోస్ట్ ఎవైటెడ్ కంబ్యాక్!

నటి మీనాకుమారి క్లాసిక్ మూవీ 'పాకీజా' 54 ఏళ్ల తర్వాత సరికొత్త లుక్‌తో రీ-రిలీజ్‌కు రెడీ అయింది. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ (FHF) రెండేళ్లపాటు శ్రమించి, పాడైపోయిన ఒరిజినల్ ప్రింట్లను అద్భుతంగా రీస్టోర్ చేసింది. 15 ఏళ్లపాటు షూటింగ్ జరుపుకుని 1972లో రిలీజైన ఈ ఇండియన్ మాస్టర్‌పీస్ వరల్డ్ ప్రీమియర్ అక్టోబర్‌లో ఫ్రాన్స్‌లోని 'ఫెస్టివల్ లూమియర్', లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్ కానుంది. త్వరలోనే 153 నిమిషాల ఈ ఐకానిక్ సినిమా మళ్లీ థియేటర్లలో బిగ్ స్క్రీన్‌పై రాబోతుంది.

మండపాల ఏర్పాట్లలో భద్రతా ప్రమాణాలు పాటించాలి
Local· 1d ago

మండపాల ఏర్పాట్లలో భద్రతా ప్రమాణాలు పాటించాలి

TG: వరంగల్ జిల్లా ఖానాపూర్‌లో గణేష్‌ మండపాల నిర్వాహకులు విద్యుత్‌ ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని విద్యుత్‌ శాఖ అదనపు సహాయ ఇంజినీర్‌ ఎ. మంగమ్మ సూచించారు. లైసెన్స్‌ పొందిన ఎలక్ట్రీషియన్‌తోనే వైరింగ్‌ పనులు చేయించాలని, మండపాల్లో ఈఎల్‌సీబీ, నాణ్యమైన ఎంసీబీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. వైర్లకు ఎలాంటి జాయింట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తడి చేతులతో విద్యుత్‌ పరికరాలను తాకరాదని సూచించారు. విద్యుత్‌ స్తంభాలకు ఫ్లెక్సీలు కట్టకూడదని స్పష్టం చేశారు.

తెలంగాణ సచివాలయం దగ్గర హైటెన్షన్.. ముట్టడి!
TG· 1d ago

తెలంగాణ సచివాలయం దగ్గర హైటెన్షన్.. ముట్టడి!

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ BJP నేతలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ తోపులాట జరిగింది. BJP చీఫ్ రామచందర్ రావు, కొందరు MPలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో పెట్టి స్టూడెంట్స్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రామచందర్ రావు ఫైర్ అయ్యారు. CM రేవంత్ విద్యావ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై మాట్లాడేందుకు CM అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు.

ఓటర్ లిస్ట్‌లో 40% ముస్లింల పేర్లు మాయం..
Current Affairs· 1d ago

ఓటర్ లిస్ట్‌లో 40% ముస్లింల పేర్లు మాయం..

హైదరాబాద్‌లోని 15 అసెంబ్లీ స్థానాల్లో SIR డ్రాఫ్ట్ ఓటర్ల లిస్ట్ నుండి ఏకంగా 19.4 లక్షల ఓటర్ల పేర్లను డిలీట్ చేశారు. శబార్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ ప్రకారం, తొలగించిన వారిలో 40.7% ముస్లిం పేర్లు ఉన్నవారే ఉన్నారు. ముఖ్యంగా మలక్‌పేట్, యాకూత్‌పురాలో 2023 ఎలక్షన్స్ పోలింగ్ కౌంట్ కంటే ఎక్కువ ఓట్లు డిలీట్ అవ్వడం గమనార్హం. ఇందులో 69.3% పర్మనెంట్ షిఫ్ట్ అయిన వారు కాగా, మహిళలు, ట్రాన్స్‌జెండర్ల ఓట్లు కూడా భారీగా పోయాయి. దీంతో ఈ ప్రాసెస్ వల్ల ఎలాంటి అర్హులైన ఓటర్లు నష్టపోకూడదని CM రేవంత్ ECకు లెటర్ రాశారు.

కొత్త పింఛన్లు, లోకల్ ఎన్నికలపై లోకేశ్ ఫోకస్!
AP· 1d ago

కొత్త పింఛన్లు, లోకల్ ఎన్నికలపై లోకేశ్ ఫోకస్!

AP: TDP మంత్రులతో మంత్రి నారా లోకేశ్ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. కొత్త పింఛన్లు, లోకల్ ఎలక్షన్స్ పై మాట్లాడారు. అర్హులైన వారికి అక్టోబర్ నుంచి ఫేజ్‌ల వారీగా కొత్త పింఛన్లు ఇవ్వాలని మంత్రులతో అన్నారు. పెండింగ్ అప్లికేషన్లను ఫాస్ట్‌గా క్లియర్ చేయాలని చెప్పారు. అక్టోబర్‌లోగా ఎన్నికల ప్రాసెస్ పూర్తి చేస్తామని, వాయిదా ఛాన్స్ లేదని క్లారిటీ ఇచ్చారు. ముందుగా మున్సిపల్, MPTC, ZPTC, చివరగా పంచాయతీ ఎన్నికలు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

నాగులేరుకు నీళ్లు విడుదల చేయాలి: జక్కా అశోక్‌
Local· 1d ago

నాగులేరుకు నీళ్లు విడుదల చేయాలి: జక్కా అశోక్‌

AP: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో నాగులేరుకు వెంటనే నీటిని విడుదల చేయాలని వైసీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు జక్కా అశోక్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ... దాచేపల్లి పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు లేక గ్రామాల్లో బోర్లు ఎండిపోతున్నాయని తెలిపారు. మరో 10–15 రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే తాగునీటి సమస్య మరింత తీవ్రతరం అవుతుందని అన్నారు.

కల్వకుర్తిలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
Local· 1d ago

కల్వకుర్తిలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

TG: నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్‌ కార్యాలయంలో సంస్థ 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పట్టణంలోని 13 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో పాల్గొని వివిధ అంశాలపై వ్యాసాలు రాశారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, రచనా నైపుణ్యాలను ప్రోత్సహించేలా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎల్‌ఐసీ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో బ్రాంచ్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ కుమార్‌, లక్ష్మణాచారి, వినయ్‌ కుమార్‌, ఎల్‌ఐసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

విధులకు డుమ్మా కొట్టని టీచర్‌.. అభినందించిన హెచ్‌ఎం
Local· 1d ago

విధులకు డుమ్మా కొట్టని టీచర్‌.. అభినందించిన హెచ్‌ఎం

TG: వరంగల్‌ జిల్లా నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆగస్టు నెలలో ఒక్కరోజూ సెలవు పెట్టకుండా 100 శాతం హాజరుతో విధులు నిర్వహించిన బయలాజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయుడు రామకృష్ణను ప్రధానోపాధ్యాయుడు ఐ. రామకృష్ణ అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రోత్సాహం అందించారు. ఉపాధ్యాయులు క్రమశిక్షణతో విధులకు హాజరవుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేయాలని ప్రధానోపాధ్యాయుడు సూచించారు. 100 శాతం హాజరు సాధించిన ఉపాధ్యాయుడు రామకృష్ణను ఇతర ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. కొన్ని జిల్లాలకు ఎల్లో Alert!
Infotainment· 1d ago

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. కొన్ని జిల్లాలకు ఎల్లో Alert!

తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. హైదరాబాద్‌, జగిత్యాల, కామారెడ్డిలోనూ వర్షాలు పడొచ్చని సూచించింది. APలో కోస్తాంధ్ర, రాయలసీమలో ఈరోజు నుంచి 5 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని చెప్పింది. వర్షాల టైమ్‌లో గాలులు బలంగా వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని, కరెంట్ పోల్స్, భారీ హోర్డింగ్స్‌ దగ్గర ఉండొద్దని అలర్ట్ చేసింది.

లింగారెడ్డిగూడెంలో స్మార్ట్‌ కార్డుల పంపిణీ
Local· 1d ago

లింగారెడ్డిగూడెంలో స్మార్ట్‌ కార్డుల పంపిణీ

TG: రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలం లింగారెడ్డిగూడెంలో స్మార్ట్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ నిర్వహించారు. పేదల ఆకలి తీర్చేందుకు గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రేషన్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చిందని, ఇప్పుడు స్మార్ట్‌ కార్డుల ద్వారా మరో అడుగు ముందుకు వేసిందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ కార్డుల ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు, గ్రామ సర్పంచ్‌ ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు!
Current Affairs· 1d ago

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు!

గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నేడు (సెప్టెంబర్ 3) 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఏకంగా రూ.3,333 పెరిగి రూ.1,55,350కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.3,020 పెరిగి రూ.1,42,400 వద్ద ట్రేడ్ అవుతోంది. గోల్డ్‌తో పాటు వెండి ధర కూడా కిలోపై రూ.5,000 పెరిగి రూ.2.5 లక్షల రికార్డు మార్క్‌కు చేరుకుంది. గోల్డ్, సిల్వర్ కొనేముందు లైవ్ రేట్స్ చెక్ చేసుకోవడం బెటర్.

సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించాలి
Local· 1d ago

సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించాలి

TG: వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం మైల్వార్‌ గ్రామంలోని ఎస్సీ వార్డులో మౌలిక వసతుల కొరతపై కేవీపీఎస్‌ మండల అధ్యక్షుడు కర్నె వెంకట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డులో సరైన రోడ్లు, మురుగు కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మురుగునీరు నిలిచిపోవడంతో దోమల బెడద పెరిగి చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సీసీ రోడ్లు నిర్మించడంతో పాటు మురుగు కాలువలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

మంత్రి కొండా సురేఖ.. రాజీనామా చేయాల్సిందేనా?
TG· 1d ago

మంత్రి కొండా సురేఖ.. రాజీనామా చేయాల్సిందేనా?

TG: మంత్రి కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఖర్గే సూచించినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రాజీనామాకు నో చెబితే భర్తరప్ చేసే అవకాశం ఉంది. భర్తరప్ నిర్ణయం తీసుకుంటే సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్‌కు సిఫార్సు పంపనున్నారు. సాయంత్రంలోగా రాజీనామా, భర్తరప్ పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందన్న అంశం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మరోవైపు సురేఖ మాత్రం రాజీనామా చేయనని ఇప్పటికే స్పష్టం చేశారు.

డిటర్జెంట్ బాక్సుల్లో గంజాయి డబ్బులు..
Current Affairs· 1d ago

డిటర్జెంట్ బాక్సుల్లో గంజాయి డబ్బులు..

హైదరాబాద్‌లోని ‘గంజాయి లేడి’ నీతూ భాయి టార్గెట్‌గా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మనీలాండరింగ్ యాక్ట్ కింద భారీ రైడ్స్ చేశారు. నానక్‌రామ్‌గూడలోని తన నివాసంలో ఫ్యామిలీతో కలిసి ఈమె గంజాయి దందా నడుపుతున్నట్లు EAGLE టీమ్ గుర్తించింది. కాలేజ్ స్టూడెంట్స్, ఐటీ ఎంప్లాయీస్‌కు డ్రగ్స్ సేల్ చేస్తూ, వచ్చిన మనీని సర్ఫెక్సెల్ బాక్సుల్లో దాచినట్లు రైడ్స్‌లో తేలింది. ఈమెపై ఇప్పటికే పలు కేసులు ఉన్నా పరారీలో ఉండటంతో, మనీ లాండరింగ్ యాంగిల్‌లో ED ఇప్పుడు పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తోంది.

గురుకుల విద్యార్థిని మృతిపై ఆందోళన
Local· 1d ago

గురుకుల విద్యార్థిని మృతిపై ఆందోళన

TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మండలం కమ్మదనం గురుకుల పాఠశాలలో గిరిజన విద్యార్థిని ముడావత్‌ అశ్విని అనుమానాస్పద మృతిపై గురువారం ఆందోళన చేపట్టారు. LHPS, SFI నాయకులు గురుకుల పాఠశాల వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. అశ్విని మృతిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని ఎల్‌హెచ్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్‌ నాయక్‌ కోరారు.

హైదరాబాద్‌ ఓటర్లకు బిగ్ అలర్ట్..
Local· 1d ago

హైదరాబాద్‌ ఓటర్లకు బిగ్ అలర్ట్..

హైదరాబాద్‌లోని 15 అసెంబ్లీ స్థానాల్లో 2023 మెజారిటీల కంటే తొలగించిన ఓట్లే ఎక్కువ ఉన్నాయని సబీర్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ తెలిపింది. 42.15 లక్షల మందిలో 19.41 లక్షల ఓట్లు డిలీట్ చేయడానికి ప్రాసెస్ మొదలైంది. యాకుత్‌పురా, మలక్‌పేట్‌లో ఈ ఎఫెక్ట్ మరీ ఎక్కువగా ఉంది. జుక్కల్ MLA తండ్రి వయసు 27గా తప్పుగా పడటం, మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఆఫీస్‌కు రాంగ్ నోటీస్ వెళ్లడం వంటి టెక్నికల్ లోపాలు బయటపడ్డాయి. టైట్ పోటీ ఉండే చోట ఇది రిజల్ట్స్‌ను డిసైడ్ చేసే ఛాన్స్ ఉండటంతో గడువు పెంచాలని లీడర్స్ డిమాండ్ చేస్తున్నారు.

సత్తెనపల్లిలో పేకాట క్లబ్‌పై దాడి
Local· 1d ago

సత్తెనపల్లిలో పేకాట క్లబ్‌పై దాడి

AP: పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో అనధికారంగా నిర్వహిస్తున్న పేకాట క్లబ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. క్లబ్‌లోని అద్దాలు, ఫర్నీచర్‌, బీరువా, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బందిపై కూడా దాడి చేశారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇటీవల పేకాట ఆడేందుకు వచ్చిన వారిని వీడియో తీస్తున్నారనే కారణంతో క్లబ్‌ నిర్వాహకులు కొందరిపై దాడిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

దాచేపల్లిలో మ్యాజిక్ డ్రైన్‌ నిర్మాణానికి శ్రీకారం
Local· 1d ago

దాచేపల్లిలో మ్యాజిక్ డ్రైన్‌ నిర్మాణానికి శ్రీకారం

AP: పల్నాడు జిల్లా దాచేపల్లి పంచాయతీ పరిధిలో జనసేన సీనియర్‌ నాయకుడు నల్లబోతుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మ్యాజిక్ డ్రైన్‌ నిర్మాణం చేపట్టారు. వర్షపాతం తగ్గిపోవడం, భూగర్భజలాలు పడిపోతున్న పరిస్థితుల్లో పవన్‌ కళ్యాణ్‌ సూచించిన విధానంలో మ్యాజిక్ డ్రైన్‌ నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. దాచేపల్లిలో తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. వర్షపునీటిని భూమిలోకి ఇంకింపజేయడం ద్వారా భూగర్భ జలాలను పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు. ప్రతిఇంటి వద్ద ఇలాంటి డ్రైన్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు.

డ్రైనేజీ లీకేజీతో రోడ్డుపై మురుగునీరు
Local· 1d ago

డ్రైనేజీ లీకేజీతో రోడ్డుపై మురుగునీరు

AP: గుంటూరు పట్టణంలోని డొంక రోడ్డు మూడు వంతెనల కింద గత నాలుగైదు రోజులుగా డ్రైనేజీ లీకేజీతో మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వల్ప వర్షం కురిసినా వంతెనల కింద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. దుర్వాసనతో పాటు పారిశుద్ధ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని స్థానికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు స్పందించి డ్రైనేజీ లీకేజీని అరికట్టి, నీరు నిలిచిపోకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.