Latest

19 ఏళ్ల స్టూడెంట్ దారుణ హత్య
TG· 22h ago

19 ఏళ్ల స్టూడెంట్ దారుణ హత్య

TG : జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లిలో తెల్లవారుజామున 19 ఏళ్ల బొంత సంతోష్‌ను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. సంతోష్ జనగామకు చెందిన వ్యక్తి కాగా, అతని కుటుంబం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి వలస వెళ్ళింది. అక్కడ సంతోష్‌ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మృతదేహాన్ని జగిత్యాల హాస్పిటల్‌కు తరలించారు. ఈ హత్యకు సంబందించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

బైక్ రైడర్స్ ఈ తప్పులు చేయకండి!
Current Affairs· 22h ago

బైక్ రైడర్స్ ఈ తప్పులు చేయకండి!

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే బైక్ రైడర్లు జర భద్రంగా ఉండాలి. హైదరాబాద్‌లో Sunday జరిగిన యాక్సిడెంట్స్ మనల్ని అలర్ట్ చేస్తున్నాయి. అతివేగం, అలసట, అజాగ్రత్తలతో మేజర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి. బస్సులు, ట్రైన్లలో సీట్లు దొరక్క చాలామంది బైక్‌లపై జర్నీలు చేస్తున్నారు. బైకర్స్ కచ్చితంగా హెల్మెట్ ధరించాలి. 40-50 కిలోమీటర్ల స్పీడ్ మెయింటైన్ చేస్తూ, టైర్డ్ అయినప్పుడు బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం. నైట్ టైమ్ ట్రావెలింగ్ తగ్గించుకోవడం సేఫ్.

లారెన్స్ బిష్ణోయ్‌కి సల్మాన్‌తో గొడవేంటి?
National· 22h ago

లారెన్స్ బిష్ణోయ్‌కి సల్మాన్‌తో గొడవేంటి?

1998లో రాజస్థాన్‌లో black buckని వేటాడాడు సల్మాన్ ఖాన్. బిష్ణోయ్ సొసైటీకి కృష్ణ జింక అనేది పవిత్రమైన ప్రాణి. అందువల్ల సల్మాన్ ఖాన్ క్షమాపణ చెప్పాలని లారెన్స్ బిష్ణోయ్ డిమాండ్ చేశాడు. సల్మాన్ ఆ పని చెయ్యకపోవడంతో.. 2018 నుంచి బెదిరించడం మొదలుపెట్టాడు. 2024లో సల్మాన్ ఇంటి ముందు కాల్పులు, సల్మాన్ సపోర్టర్ల హత్యలు, తాజాగా టైగర్ ష్రాఫ్‌పై దాడి వరకు నేరాల పరంపర సాగుతోంది. సల్మాన్‌ సన్నిహితులను కూడా లారెన్స్ టార్గెట్ చేస్తున్నాడు.

దసరాకు పల్లెబాట పట్టిన హైదరాబాదీలు
Current Affairs· 23h ago

దసరాకు పల్లెబాట పట్టిన హైదరాబాదీలు

దసరా పండుగ కోసం హైదరాబాద్‌లో ఉంటున్న ప్రజలు సొంతూళ్లకు బయలుదేరడంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, నేషనల్ హైవేస్ రద్దీగా మారాయి. ముఖ్యంగా హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి టోల్‌గేట్‌ వద్ద సాధారణంగా రోజుకు 38 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, నిన్న ఈ సంఖ్య 51 వేలు దాటింది. రద్దీతో వెయ్యికి పైగా ప్రత్యేక బస్సులు నడిపినా, పల్లెలకు సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

లారెన్స్ బిష్ణోయ్ ఎవరు?
National· 23h ago

లారెన్స్ బిష్ణోయ్ ఎవరు?

లారెన్స్ బిష్ణోయ్ అసలు పేరు బల్కరన్ బ్రార్. 1993లో పంజాబ్‌లో పుట్టాడు. బిష్ణోయ్ గ్యాంగ్ అనే ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్‌కు ఇతను హెడ్‌గా ఉన్నాడు. ప్రస్తుతం గుజరాత్ లోని సబర్మతి జైలులో ఉన్నాడు. అయినప్పటికీ 700 మంది షూటర్లతో.. బయట హత్యలు, ఎక్స్‌టార్షన్, డ్రగ్ ట్రాఫికింగ్ వంటి ఘోరమైన నేరాలు చేయిస్తున్నాడు. సిద్ధు మూసేవాలా, బాబా సిద్దికీ, కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యల వెనక లారెన్స్ బిషోయ్ ఉన్నాడనే ఆరోపణలున్నాయి. ఇతన్ని దావూద్ ఇబ్రహీంతో పోల్చుతున్నారు.

గ్రామంలో ప్రమాదకరంగా బావి
Local· 23h ago

గ్రామంలో ప్రమాదకరంగా బావి

నెల్లూరు జిల్లా దగదర్తి మండలం రంగసముద్రం గ్రామం నడిబొడ్డున ఉన్న బావి ప్రమాదకర స్థితిలో ఉండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుండటంతో చిన్నారులు, స్థానికులకు ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే బావి పరిస్థితిని పరిశీలించి, చుట్టూ పటిష్టమైన రక్షణ గోడ నిర్మించాలని, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

సుబ్లేడ్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు
Local· 23h ago

సుబ్లేడ్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడ్ గ్రామంలో శివ భక్తురాలు పోలేపొంగు సైదమ్మ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, ప్రకృతి సంప్రదాయాలు, బతుకమ్మ గొప్పతనాన్ని ప్రతిబింబించేలా సంబరాలు జరిపారు. మహిళలు, యువతులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ నృత్యాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కొండ్రు కవిత, టి. నాగమణి, ఉమ, కె. నాగేశ్వరి, ఉప్పమ్మ, రజిని, వినోద, రోహిణి తదితరులు పాల్గొన్నారు.

సద్దుల బతుకమ్మ వేడుకల్లో CPI నాయకులు
Local· 23h ago

సద్దుల బతుకమ్మ వేడుకల్లో CPI నాయకులు

భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని పలు ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ వేడుకల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, నగరపాలక సంస్థ మేయర్ మూడ్ గణేష్ పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి పాటలు పాడుతూ సంబరాలు చేసుకున్నారు. పలుచోట్ల సామూహికంగా బతుకమ్మ ఆడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు.

కబడ్డీలో విన్నర్‌గా అందవెల్లి టీమ్
Local· 23h ago

కబడ్డీలో విన్నర్‌గా అందవెల్లి టీమ్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా ఎక్స్ రోడ్ వద్ద జై భవానీ యూత్ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా కబడ్డీ టోర్నమెంట్ జరిగింది. చుట్టుపక్కల ఊళ్ల నుంచి చాలా జట్లు పార్టిసిపేట్ చేశాయి. ఫైనల్ మ్యాచ్‌లో అందవెల్లి, జై భవానీ జట్లు పోటీపడగా.. నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో అందవెల్లి టీమ్ విన్నర్‌గా నిలిచింది. జై భవానీ జట్టు రన్నరప్‌గా నిలవగా, గెలిచిన టీమ్స్‌కి ప్రైజెమ అందజేశారు.

భారీగా పెరిగిన గుమ్మడికాయ ధరలు
Current Affairs· 23h ago

భారీగా పెరిగిన గుమ్మడికాయ ధరలు

దసరా ఫెస్టివల్ రీజన్‌గా హైదరాబాద్ సిటీలోని హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో గుమ్మడికాయలకు సడెన్‌గా డిమాండ్ పెరిగింది. బోయిన్‌పల్లి, ఎర్రగడ్డ మార్కెట్లలో సండే రోజు భారీగా సేల్స్ జరిగాయి. బోయిన్‌పల్లి మార్కెట్లో బూడిద గుమ్మడికాయల హోల్‌సేల్ ప్రైస్ కేజీ ₹10.33 కాగా, నంబర్ వన్ క్వాలిటీ గుమ్మడికాయల ధర టన్నుకు ₹10,333 పలుకుతోంది. రిటైల్ మార్కెట్లో సైజ్‌ని బట్టి ఒక్కో కాయ ₹80 నుండి ₹200 వరకు సేల్ అవుతోంది.

మిడిల్ క్లాస్ ఫాదర్ మైండ్‌సెట్!
Parenting· 23h ago

మిడిల్ క్లాస్ ఫాదర్ మైండ్‌సెట్!

బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ రీసెంట్‌గా ఓ పాడ్‌కాస్ట్‌లో ఇండియన్ పేరెంట్స్ మైండ్‌సెట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తండ్రి జితేంద్ర మహారాష్ట్రలోని చావుల్‌లో పెరగడం వల్ల పిల్లల ఫ్యూచర్ కోసం మనీ సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని నమ్మేవారన్నారు. అనవసర ఖర్చులు తగ్గించి ఎఫ్‌డీలు, ల్యాండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారని, అయితే పిల్లల కోసం పేరెంట్స్ తమ హెల్త్ చెకప్స్ మరియు వెల్ బీయింగ్‌ని నెగ్లెక్ట్ చేయకూడదని చెప్పారు.

పిల్లలతో నిజం చెప్పడం ఎంతవరకు కరెక్ట్?
Parenting· 23h ago

పిల్లలతో నిజం చెప్పడం ఎంతవరకు కరెక్ట్?

అమెరికాకు చెందిన ఒక తల్లి 10 ఏళ్లుగా తన కూతురితో ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా పేరెంటింగ్ చేస్తోంది. సాధారణంగా పేరెంట్స్ పిల్లల కోసం శాంతా క్లాజ్, చావు విషయంలో చిన్న చిన్న అబద్ధాలు చెప్తారు. కానీ, ఈమె మాత్రం ఎప్పుడూ నిజాయితీగా ఉంటూ కూతురితో స్ట్రాంగ్ ట్రస్ట్ బాండింగ్ క్రియేట్ చేసుకుంది. అయితే నిజం చెప్పడం అంటే ప్రతి విషయం పూర్తిగా వివరించడం కాదని, వయసుకు తగ్గట్టుగా ఏజ్ అప్రాప్రియేట్ సమాధానాలు ఇస్తూ, కంఫర్ట్ కోసం అబద్ధాలు వాడకూడదని ఆమె చెబుతోంది.

ఫైరింగ్ తర్వాత.. టైగర్ ష్రాఫ్ ని చూడండి▶
Current Affairs· 23h ago

ఫైరింగ్ తర్వాత.. టైగర్ ష్రాఫ్ ని చూడండి

ముంబైలోని జుహులో బాలీవుడ్ యాక్టర్ టైగర్ ష్రాఫ్ కారుపై ఆదివారం రాత్రి ముగ్గురు వ్యక్తులు 5 రౌండ్ల కాల్పులు జరిపారు. ఫుట్‌బాల్ ఆడి కారులో రిటర్న్ అవుతుండగా ఈ అటాక్ జరిగింది. ఈ ప్రమాదంలో టైగర్‌కు స్వల్ప గాయాలవ్వగా, ఆయన డ్రైవర్, ఆటో డ్రైవర్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. సల్మాన్ ఖాన్‌తో ఉన్న క్లోజ్ రిలేషన్స్ వల్లే దాడి చేశామని లారెన్స్ బిష్ణోయ్ ఒప్పుకున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ CM ఏకనాథ్ షిండే ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి కఠిన చర్యలుంటామని హామీ ఇచ్చారు.

బతుకమ్మ వేడుకల్లో విజయ్ - రష్మిక▶
Entertainment· 23h ago

బతుకమ్మ వేడుకల్లో విజయ్ - రష్మిక

హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సద్దుల బతుకమ్మ ముగింపు వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సందడి చేశారు. పెళ్లి తర్వాత తొలిసారి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న రష్మిక, సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ఈ వేడుకల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క నూతన దంపతులను శాలువాలతో సత్కరించగా.. రంగురంగుల పూల బతుకమ్మలు, బాణసంచా ప్రదర్శనలతో ట్యాంక్ బండ్ పండుగ వాతావరణంతో నిండిపోయింది.

ముంబై సాంగ్.. తలసాని స్టెప్స్▶
TG· 23h ago

ముంబై సాంగ్.. తలసాని స్టెప్స్

TG: సద్దుల బతుకమ్మ వేడుకలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంగా జరిగాయి. ఈ వేడుకల్లో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని.. మరింత జోష్ తెచ్చారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్.. మహిళలతో కలిసి స్టెప్పులేశారు. ఐతే.. ఇందులో "రాను, ముంబైకి రాను" అనే సాంగ్ ఉర్రూతలూగించింది. తలసానితోపాటూ.. మహిళలు ఈ పాటకు స్టెప్స్ వేశారు. అది చూసి అక్కడున్నవారంతా.. ఆనందంతో కేరింతలు కొట్టారు. ఇలా బతుకమ్మ వేడుకలు అందరిలోనూ ఫుల్ జోష్ తెచ్చాయి.

హైదరాబాద్ వస్తుండగా RTC బస్సుకు ప్రమాదం!▶
TG· 23h ago

హైదరాబాద్ వస్తుండగా RTC బస్సుకు ప్రమాదం!

TG: ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తున్న RTC బస్సు ప్రమాదానికి గురైంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బాటసింగారం దగ్గర రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బస్సు ఢీ-కొట్టింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ట్రీట్మెంట్ కోసం వనస్థలిపురం గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించారు.

బతుకమ్మ వేడుకల్లో విషాదం.. మహిళ మృతి
Local· 23h ago

బతుకమ్మ వేడుకల్లో విషాదం.. మహిళ మృతి

ఖమ్మం జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న యలగాల భారతి (50) నృత్యం (డ్యాన్స్) చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందారు.అప్పల నరసింహపురం గ్రామానికి చెందిన ఆమె బంధువుల ఇంటికి వచ్చారు. వేడుకల్లో భాగంగా డీజే వద్ద నృత్యం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

గిరిజన ప్రాంతాల్లో అన్‌రిజర్వ్‌డ్ సీట్ల కలకలం
Local· 23h ago

గిరిజన ప్రాంతాల్లో అన్‌రిజర్వ్‌డ్ సీట్ల కలకలం

అల్లూరి జిల్లా కూనవరం మండలంలో ఉన్న 8 ఎంపీటీసీ స్థానాల్లో రొటేషన్ సిస్టమ్ వల్ల పెదార్కూరు, చూచిరేవులగూడెం, వెంకటాయపాలెం స్థానాలు ఈసారి అన్‌రిజర్వ్‌డ్‌గా మారాయి. విశేషమేమిటంటే.. ఈ మూడింట్లో గిరిజన ఓటర్లే మెజారిటీ. ఇక్కడ అన్‌రిజర్వ్‌డ్ అవ్వడంతో ఇతర కులాల కాండిడేట్లు పోటీకి క్యూ కడుతున్నారు. అయితే, అక్కడ ఎవరు పోటీ పడినా గెలుపోటములను డిసైడ్ చేసేది మాత్రం ఆదివాసీ ఓటర్లే.

కొత్తగూడెంలో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం
Local· 23h ago

కొత్తగూడెంలో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం

ఉమ్మడి నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని భద్రాద్రికొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ DCC జనరల్ సెక్రటరీ, 33వ డివిజన్ కార్పొరేటర్ బాలునాయక్ పిలుపునిచ్చారు. కొత్తగూడెంలోని నాలుగు డివిజన్ల ముఖ్య నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థికి మద్దతుగా నిలిచి, విజయం కోసం పనిచేయాలని సూచించారు.

టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. వీడియో▶
Current Affairs· 23h ago

టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. వీడియో

ముంబైలోని జుహూ దగ్గర నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఓ పార్క్ నుంచి బయటకు వస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయనపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ తరువాత అక్కడి నుంచి బైక్‌పై పారిపోయారు. ఈ ఘటనలో ఆయన డ్రైవర్ గాయపడటంతో, నటుడే స్వయంగా కారు నడుపుతూ అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం.

37వ డివిజన్‌లో బతుకమ్మ సంబరాలు
Local· 23h ago

37వ డివిజన్‌లో బతుకమ్మ సంబరాలు

పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీ 37వ డివిజన్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఎండీ మీర్జా ఫజల్ బేగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పండుగ విశిష్టతను చాటుతూ మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాల్లో పాల్గొన్నారు.