Latest

ఢిల్లీలో సీఎం రేవంత్‌ను కలిసిన మాధవరెడ్డి
TG: ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డితో వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. మంత్రివర్గ విస్తరణలో మాధవరెడ్డికి అవకాశం దక్కుతుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. మాధవరెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న చర్చ నియోజకవర్గంలోనూ జోరుగా సాగుతోంది.

ప్రజల ఇబ్బందులు చూసి సొంత నిధులతో రోడ్డు
TG: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం చౌలపల్లి గ్రామంలో ప్రజలు, భక్తుల రాకపోకల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్ సొంత నిధులతో మట్టి రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కోట మైసమ్మ దేవాలయం నుంచి హనుమాన్ దేవాలయం వరకు చేపట్టిన రోడ్డు పనులను గురువారం గ్రామస్థుల సమక్షంలో ప్రారంభించారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తనవంతు సహకారం కొనసాగిస్తానని రవీందర్ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసన
TG: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్‌లో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. దేగామ గ్రామం నుంచి బజార్హత్నూర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పెండింగ్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

400 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
TG: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట నుంచి సిద్దిపేటకు అక్రమంగా తరలిస్తున్న 400 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. నిఘా ఏర్పాటు చేసిన అధికారులు డీసీఎంను వెంబడించి సిద్దిపేటలోని మహాలక్ష్మి రైస్‌మిల్ వద్ద అడ్డుకున్నారు. తనిఖీల్లో వాహనంలో 120 క్వింటాళ్ల బియ్యం లభించగా, మిల్ పరిసరాల్లో మరో 280 క్వింటాళ్లు గుర్తించారు. డ్రైవర్ శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని వాహనాన్ని పోలీసులకు అప్పగించారు. రైస్‌మిల్ యజమాని నాగరాజును విచారణ చేపట్టారు.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టి వ్యక్తి మృతి
TG: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని జయప్రకాష్ నగర్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. చారకొండ మండలం కమాల్‌పూర్ తండాకు చెందిన చంద్రశేఖర్ (41) బైక్ పై కల్వకుర్తి వైపు వెళ్తుండగా లారీని ఢీకొట్టాడు. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కల్వకుర్తి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

రేపు చికెన్, మటన్ షాపులు బంద్.. రీజన్ ఇదే!
శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగన సందర్బంగా రేపు హైదరాబాద్ (GHMC) పరిధిలోని అన్ని మాంసం దుకాణాలను క్లోజ్ చేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. నగరంలోని రిటైల్ చికెన్, మటన్, బీఫ్ షాపులతో పాటు GHMC గుర్తింపు పొందిన పశువధశాలలన్నీ కచ్చితంగా బంద్ పాటించాలని కమిషనర్ చెప్పారు. ఒకవేళ రూల్స్ బ్రేక్ చేసి ఆ రోజు సీక్రెట్‌గా మాంసం అమ్మినా, జంతువులను చంపినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వెటర్నరీ టీమ్స్ ఆ రోజు అన్ని చోట్లా స్పెషల్ తనిఖీలు చేయనున్నాయి.

స్వచ్ఛ భారత్ లక్ష్యం నీరుగారుతోంది
TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ లక్ష్యం నీరుగారుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన వాహనాన్ని సక్రమంగా వినియోగించకపోవడంతో పారిశుద్ధ్య సమస్యలు నెలకొంటున్నాయని తెలిపారు. చెత్తను క్రమం తప్పకుండా సేకరించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన వాహనం నిరుపయోగంగా ఉండటంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి చెత్త సేకరణ వాహనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.

అత్తామామలు నన్ను బేబీలా చూసుకుంటున్నారు- రష్మిక
విజయ్ దేవరకొండతో మ్యారేజ్ తర్వాత రష్మిక తన లైఫ్ అప్‌డేట్స్‌ను ఒక ఇంటర్వ్యూలో షేర్ చేశారు. ఫిబ్రవరిలో వీరి వెడ్డింగ్ జరగ్గా, రీసెంట్ ఇంజూరీ బ్రేక్ వల్ల ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసే ఛాన్స్ దొరికిందని రష్మిక తెలిపారు. విజయ్ వల్ల తాను బెటర్ పర్సన్‌గా మారుతున్నానని, అత్తామామలు, ఆనంద్ తనను బేబీలా చూసుకుంటున్నారని చెప్పారు. త్వరలోనే విజయ్‌తో కలిసి 'రణబాలి' మూవీ షూటింగ్‌లో జాయిన్ అవ్వబోతున్నట్లు రష్మిక క్లారిటీ ఇచ్చారు. ఫ్యాన్స్ వీళ్ళను 'ViRosh' అని పిలుస్తున్నారు.

దాచేపల్లిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
AP: పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని ముత్యాలంపాడు రోడ్డు వద్ద అర్ధరాత్రి రెండు లారీలు ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు వైపు నుంచి పట్టణంలోకి వస్తున్న రెండు లారీలు మలుపు వద్ద ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ లారీ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, మరో లారీ స్వల్పంగా దెబ్బతింది. లారీల్లో ఉన్న డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దాచేపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

లా స్టూడెంట్‌పై తప్పుడు కేసు..
నోయిడా ప్రొటెస్ట్ కేసులో ఢిల్లీ యూనివర్సిటీ లా స్టూడెంట్ ఆకృతి చౌదరిపై పెట్టిన NSA డిటెన్షన్‌ను అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది. శాలరీ పెంపు కోసం జరిగిన కార్మికుల నిరసనల్లో 25 ఏళ్ల ఆకృతిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఐదు నెలలుగా ఆమె కస్టడీలో ఉంది. పోలీసులు చూపించిన అరెస్ట్ టైమింగ్స్, ఆధారాల్లో అవకతవకలు ఉన్నాయని జస్టిస్ అతుల్ శ్రీధరన్ బెంచ్ గుర్తించింది. ఈ కేసు మొత్తం ప్రభుత్వం అల్లిన కల్పిత కథ అని మండిపడుతూ, తప్పుడు అరెస్ట్‌కు నోయిడా అడ్మినిస్ట్రేషన్ ఆమెకు రూ.5 లక్షలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం భారీ నిరసన
TG: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 5న హైదరాబాద్‌లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం Journalists Co-operative Housing Society ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. హైదరాబాద్‌లోని గన్‌పార్క్ నుంచి మీడియా అకాడమీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన కొనసాగనుంది. ఇళ్ల స్థలాల కేటాయింపులో జాప్యానికి కారణం ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. జర్నలిస్టులంతా ఐక్యంగా ఉద్యమించి తమ హక్కును సాధించుకోవాలని పిలుపునిచ్చింది.

SBI కస్టమర్స్‌కి బ్యాడ్ న్యూస్..
SBI సాలరీ అకౌంట్ హోల్డర్స్ మంత్లీ ATM విత్‌డ్రా రూల్స్‌ను మార్చింది. ఇకపై ఇతర బ్యాంకుల ATMలలో జరిగే ఉచిత ట్రాన్సాక్షన్ల నెంబర్ ను నెలకి 10 నుండి 5కి తగ్గించింది. ఈ ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత చేసే ప్రతి విత్‌డ్రాపై రూ.20 ప్లస్ GST ఛార్జీ పడుతుంది. అలాగే నాన్-క్యాష్ ట్రాన్సాక్షన్స్‌పై రూ.10 ప్లస్ GST అదనంగా విధిస్తారు. అక్టోబర్ 1 నుండి అమల్లోకి రానున్న ఈ కొత్త రూల్స్‌ను కస్టమర్స్ తప్పక గమనించాలి.

గ్రామంలో మురుగు నీటి కష్టాలు.. పట్టించుకోని అధికారులు
TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఏక్‌మై గ్రామంలోని 10వ వార్డులో డ్రైనేజీ పూడుకుపోవడంతో మురుగు నీరు రోడ్డుపై నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కాల్వలో గడ్డి, చెత్త పేరుకుపోవడంతో డ్రైనేజీ నీరు సక్రమంగా ప్రవహించక దుర్వాసన వెదజల్లుతోంది. నీరు నిలిచిపోవడంతో దోమల బెడద కూడా పెరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామపంచాయతీ అధికారులను కోరారు.

గురజాల మండలానికి 22 పశువుల షెడ్లు మంజూరు
AP: పల్నాడు జిల్లా పశువుల షెడ్ల నిర్మాణానికి అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి సూచించారు. పల్లె పండగ 3.0లో భాగంగా గురజాల మండలానికి 22 పశువుల షెడ్లు మంజూరైనట్లు తెలిపారు. గురజాల పట్టణంలోని ఉపాధి హామీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒక్కో పశువుల షెడ్డుకు రూ.2 లక్షలు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పశువుల షెడ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

కోటప్పకొండలో మంత్రి లోకేష్ ప్రత్యేక పూజలు
AP: కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని మంత్రి నారా లోకేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం నర్సరావుపేట సమీపంలోని కోటప్పకొండ దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అర్చకులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు మంత్రిని ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని క్యాండిల్ నిరసన
TG: నర్సు అత్యాచారం, హత్య ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఖమ్మంలో నాయకులు డిమాండ్ చేశారు. కొవ్వొత్తులతో క్యాండిల్ నిరసన నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వామపక్ష, ఆదివాసీ సంఘాలతో పాటు AIYF, AISF, PDSU, ABVP నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాధితురాలి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. న్యాయం జరిగే వరకు ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

UPని ముంచెత్తిన వరదలు.. 16 వేల మందికి పైగా తరలింపు!
UPలో వరద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 35 జిల్లాల్లో వరద ప్రభావం కనిపించగా, 23 జిల్లాల్లో పరిస్థితి కొనసాగుతోంది. అధికారులు 16,784 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు; బుధవారం 3,042 మందిని రక్షించారు. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. సహాయక చర్యల కోసం 1,499 పడవలు, మోటార్ బోట్లు, 1,067 వైద్య బృందాలను రంగంలోకి దించారు. చిట్రకూట్‌లో మందాకిని నది ఉప్పొంగడంతో 36 గ్రామాల్లో సుమారు 14 వేల మంది ప్రభావితమయ్యారు. ఇళ్లలోకి నీరు చేరడంతో పడవలతో ప్రజలను బయటకు తీసుకొస్తున్నారు.

వీఆర్ఓ ఆరోగ్యంపై తహసీల్దార్ ప్రత్యేక పర్యవేక్షణ
AP: కర్నూలు జిల్లా హొలగుంద మండలం లింగంపల్లిలో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఓ రామచంద్ర ఆకస్మికంగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. బస్సులో ప్రయాణిస్తుండగా అస్వస్థతకు గురైన ఆయనను విషయం తెలుసుకున్న హొలగుంద తహసీల్దార్ లక్ష్మీరాజు వెంటనే చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. చికిత్స పూర్తయ్యే వరకు రామచంద్ర ఆరోగ్య పరిస్థితిని తహసీల్దార్ పర్యవేక్షిస్తూ వివరాలు తెలుసుకున్నారు. వీఆర్వో ప్రాణాలను కాపాడేందుకు కృషిచేసిన అధికారులకు అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటరమణ ధన్యవాదాలు తెలిపారు.

ఆలయం కూల్చివేతపై పాకిస్థాన్‌కు ఇండియా వార్నింగ్!
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ నరోవాల్ జిల్లాలో 100 ఏళ్లకు పైబడిన హిందూ ఆలయం ఆగస్టు 21న కూల్చివేతకు గురైంది. ఆలయ స్థలాన్ని పక్కనే ఉన్న మదరసా కోసం ఉపయోగించేందుకు కావాలనే కూల్చేశారని హిందూ సంఘాలు, మైనారిటీ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగానే ఆలయం కూలిపోయిందని పాకిస్థాన్ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఇండియా తీవ్రంగా స్పందిస్తూ దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆలయాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేసింది. మైనారిటీల భద్రతపైనా పాకిస్థాన్‌ను హెచ్చరించింది.

AI ఎంట్రీ-లెవల్ Jobs తీసేస్తే.. రేపటి Experts ఎక్కడి నుంచి?
కాలేజీ పూర్తయ్యాక మొదటి ఉద్యోగం దొరకడం, కెరీర్‌కు తొలి మెట్టు. కానీ AI కారణంగా ఈ మెట్టే తగ్గిపోతే భవిష్యత్‌లో నిపుణులు ఎక్కడి నుంచి వస్తారు? ఇదే ఇప్పుడు టాలెంట్ మార్కెట్‌లో కీలక ప్రశ్న. ఎంట్రీ-లెవల్ ఉద్యోగాల్లోని పునరావృత పనులను AI సులభంగా ఆటోమేట్ చేయగలదు. దీంతో సంస్థలకు వెంటనే ఖర్చు, సమయం తగ్గొచ్చు. కానీ జూనియర్లకు నేర్చుకునే అవకాశం తగ్గితే, రేపటి సీనియర్ నిపుణుల కొరత రావచ్చు. ఈ సమస్యను తగ్గించేందుకు కంపెనీలు AIతో పాటు శిక్షణ, అప్రెంటిస్‌షిప్ అవకాశాలపై పెట్టుబడి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

AI వల్ల Gen-Zలో క్రియేటివ్ థింకింగ్ తగ్గుతుందా?
ఒకప్పుడు ఏదైనా కొత్త ఐడియా రావాలంటే మనమే ఆలోచించేవాళ్లం, ఇప్పుడు రెండు మాటలు టైప్ చేస్తే AI వెంటనే సమాధానం, ఐడియాలు, డిజైన్ కూడా ఇచ్చేస్తుంది! ఇదే Gen-Zలో క్రియేటివ్ థింకింగ్ తగ్గిస్తుందా అనే ప్రశ్నకు కారణం. కొన్ని అధ్యయనాలు AIతో పని చేసినప్పుడు ఆలోచనల నాణ్యత పెరగొచ్చని చెబుతున్నాయి.. కానీ సొంతంగా ఆలోచించే ప్రయత్నం తగ్గితే ఆలోచించే సామర్థ్యం బలహీనపడే అవకాశం ఉంది. సమస్య AIలో కాదు.. మనం దాన్ని ఆలోచనకు సహాయకంగా వాడుతున్నామా, లేక మన బదులు ఆలోచించనిస్తున్నామా అన్నదే విషయం. ముందు మన ఆలోచన.. తర్వాత AI.