Latest

సెప్టెంబర్‌లో అన్ని లెక్కలు చెప్తా: CM
TG· 17 Aug 2026

సెప్టెంబర్‌లో అన్ని లెక్కలు చెప్తా: CM

TG : వెయ్యిమంది KCRలు ఏకమై వచ్చినా నన్నేం చేయలేరని CM రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ కుటుంబం, BRS‌ రాజకీయ వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. KCR‌ పాలన ఫ్యామిలీ జస్టిస్‌ అయితే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం సోషల్‌ జస్టిస్‌ కోసం పనిచేస్తోందన్నారు. యువత, నిరుద్యోగులు రాజకీయ ప్రచారాలకు ప్రభావితం కావొద్దని సూచించారు. గత ప్రభుత్వ పాలన, తమ ప్రభుత్వ పనితీరుపై రాబోయే సెప్టెంబర్‌ అసెంబ్లీ సమావేశాల్లో అన్ని లెక్కలు ప్రజల ముందు పెడతామని స్పష్టం చేశారు.

GPS లేకుండానే దారి తెలుసుకునే తాబేళ్లు!
Education· 16 Aug 2026

GPS లేకుండానే దారి తెలుసుకునే తాబేళ్లు!

సముద్రంలో ఎటు వెళ్లాలో మ్యాప్ లేకుండానే తాబేళ్లు ఎలా తెలుసుకుంటాయో తెలుసా? వాటికి భూమి యొక్క మాగ్నెటిక్ ఫీల్డ్‌ను గుర్తించే ప్రత్యేక సామర్థ్యం ఉందని రీసెర్చ్ సూచిస్తోంది. ఈ మాగ్నెటిక్ సంకేతాలను ఉపయోగించి సముద్రంలో దిశను గుర్తించడంతో పాటు, దూరంగా ఉన్న ప్రాంతాల వైపు ప్రయాణించగలవు. కొన్ని రీసెర్చ్‌ల ప్రకారం, తాబేళ్లు తమ గమ్యస్థానానికి చేరువైనప్పుడు వాసన వంటి ఇతర సంకేతాలను కూడా ఉపయోగించవచ్చు. అంటే GPS లేకపోయినా.. ప్రకృతే వాటికి నావిగేషన్ సిస్టమ్‌లా పనిచేస్తుందన్నమాట అనుకోండి!

MNR ఫౌండేషన్ 9వ ఉచిత కంటి వైద్య శిబిరం
Local· 16 Aug 2026

MNR ఫౌండేషన్ 9వ ఉచిత కంటి వైద్య శిబిరం

AP: మైలవరం మండలం పుల్లూరు గ్రామంలో MNR ఫౌండేషన్ అధ్యక్షులు ముప్పిడి నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సహకారంతో 9వ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పుల్లూరు :ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ(PACS)లో నిర్వహించిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. 112 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 57 మంది పురుషులు, 55 మంది మహిళలు ఉన్నారు.

యాక్సిస్ బ్యాంక్ ఆధ్వర్యంలో పోటీలు
Local· 16 Aug 2026

యాక్సిస్ బ్యాంక్ ఆధ్వర్యంలో పోటీలు

TG: మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 'యాక్సిస్ బ్యాంక్' ఆధ్వర్యంలో సంగీతం, నాట్యం, పాటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ వేడుకకు మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్లు, ఉద్యోగులు, పిల్లల తల్లిదండ్రులు, డాన్స్ టీచర్లు పాల్గొన్నారు.

‘ఇంటికో మొక్క ప్రతి పౌరుని బాధ్యత’
Local· 16 Aug 2026

‘ఇంటికో మొక్క ప్రతి పౌరుని బాధ్యత’

AP: ఎన్టీఆర్ జిల్లా పెడన మండలంలో సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో Dr.రాళ్ళపల్లి లక్ష్మణ స్వామి(చిన్నాపురం డాక్టర్) సహకారంతో పెడన బొడ్డు నాగయ్య ప్రభుత్వ కళాశాలలో ‘ఇంటికో మొక్క ప్రతి పౌరుని బాధ్యత’ కార్యక్రమం చేపట్టారు. 12000 మందికి ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 1.6 లక్షల మొక్కలు పంచినట్టు సంస్థ అధ్యక్షుడు మొహమ్మద్ ఉస్మాన్ బాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ రామారావు, పేరిశెట్టి నాగరవి, ఇమ్మనేని కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మచిలీపట్నం డివిజన్ ఫోటోగ్రాఫర్ల సంఘ ఎన్నికలు
Local· 16 Aug 2026

మచిలీపట్నం డివిజన్ ఫోటోగ్రాఫర్ల సంఘ ఎన్నికలు

AP: మచిలీపట్నం డివిజన్ ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. కొత్త అధ్యక్షుడిగా గురిజాల సుధీర్, కార్యదర్శిగా వంక అనంత కుమార్, ట్రెజరర్‌గా బైత సత్యనారాయణని, గౌరవ అధ్యక్షులుగా చిలంకుర్తి నాగభూషణం(శేషు)ని మరో 21 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఫోటోగ్రఫీ డే పురస్కరించుకుని ఆగస్టు 19న నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం జరుగుతుందని చెప్పారు.

గ్రావెల్ లారీలను అడ్డుకున్న గ్రామస్తులు
Local· 16 Aug 2026

గ్రావెల్ లారీలను అడ్డుకున్న గ్రామస్తులు

AP: ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెల్లటూరులో ఉద్రిక్తత నెలకొంది. భీమవరప్పాడు నుండి నిత్యం వందల సంఖ్యలో గ్రావెల్ లారీలు గ్రామం మీదుగా వెళ్తుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. లారీల రాకపోకలతో రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, ఇళ్లపై దుమ్ము ధూళి పేరుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ఏకమై వెల్లటూటరు ప్రధాన రహదారిపై గ్రావెల్ లారీలను అడ్డుకున్నారు. అధికారులు వెంటనే స్పందించి లారీలను అడ్డుకోవాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. *

దిమాగీ నక్సల్ పార్టీ..మరో కొత్త మూమెంట్
Gen Z· 16 Aug 2026

దిమాగీ నక్సల్ పార్టీ..మరో కొత్త మూమెంట్

‘కాక్రోచ్ జనతా పార్టీ’ తరహాలో దేశంలో మరో కొత్త మూమెంట్ మొదలైంది. అదే ‘దిమాగీ నక్సల్ పార్టీ’. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పీఎం నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రసంగంలో ‘దిమాగీ నక్సల్’(Intellectual Naxals) అనే పదాన్ని ఉపయోగించారు. సమాజంలో ‘నక్సల్ మెంటాలిటీ’ ఉన్నవారిని గుర్తించాలని, యువతను వాళ్లకు దూరంగా ఉంచాలని అన్నారు. దీనికి రియాక్షన్‌గా ఈ పార్టీ మొదలైంది. అప్పుడే ఈ పార్టీ ఇన్‌స్టా ఖాతాకు 47 వేల మందికి పైగా ఫాలోవర్స్ వచ్చారు. ఈ పార్టీకి Think, Research, Resist అనే సిద్ధాంతాలు ఉన్నట్టు ప్రకటించారు.

పవిత్ర సంగమంలో కారు చీకట్లు
AP· 16 Aug 2026

పవిత్ర సంగమంలో కారు చీకట్లు

AP: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రమైన పవిత్ర సంగమంలో రాత్రి వేళల్లో లైట్లు వెలగకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా–గోదావరి నదుల పవిత్ర కలయిక వద్ద సౌకర్యాలు సరిగా లేకపోవడంతో పర్యాటకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పవిత్ర సంగమానికి ప్రతిరోజూ వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు, భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో వచ్చే వారికి లైట్లు వెలగకపోవడంతో చీకట్లోనే తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.

'వారణాసి షర్టు’లో మహేష్..
Entertainment· 16 Aug 2026

'వారణాసి షర్టు’లో మహేష్..

ఫారిన్ ట్రిప్ పూర్తి చేసుకుని తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు తిరిగొచ్చిన హీరో మహేష్ బాబు ఎయిర్‌పోర్ట్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన వేసుకున్న షర్ట్‌పై 'వారణాసి' అని రాసి ఉండటంతో పాటు శివుడి త్రిశూలం, సినిమాలో ధరించిన లాకెట్ లోగోలు కనిపిస్తుండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇది చూసిన అభిమానులు అప్పుడే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టేశారని అనుకుంటున్నారు.

జాతీయ గీతాన్ని మార్చాల్సిందే: ముఖేష్ ఖన్నా
National· 16 Aug 2026

జాతీయ గీతాన్ని మార్చాల్సిందే: ముఖేష్ ఖన్నా

దేశ జాతీయ గీతంగా ఉన్న 'జన గణ మన' స్థానంలో 'వందేమాతరం'ను తీసుకురావాలని ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటీష్ రాణిని పొగుడుతూ 'జన గణ మన' రాశారని, అది మన జాతీయ గీతం కాకూడదని ఆయన తెలిపారు. పూర్తిగా మనదైన 'వందేమాతరం'పై తాను ఏడు నిమిషాల ఐకానిక్ పాటను రికార్డ్ చేశానని, అది ఆరు నెలల్లో విడుదలవుతుందని చెప్పారు.

ఏపీలో జూనియర్ డాక్టర్ల ఎమర్జెన్సీ సేవలు బంద్
AP· 16 Aug 2026

ఏపీలో జూనియర్ డాక్టర్ల ఎమర్జెన్సీ సేవలు బంద్

AP: స్టైపెండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా సాధారణ విధులను బహిష్కరిస్తున్న ఏపీ జూనియర్ డాక్టర్లు రేపటి నుంచి ఎమర్జెన్సీ సేవలను కూడా బంద్ చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎమర్జెన్సీ, క్యాజువాల్టీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లలో వైద్య సేవల కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. వైద్య సిబ్బందికి మెడికల్ లీవులతోపాటు ఇతర అన్ని రకాల సెలవులను అధికారులు రద్దు చేశారు. అత్యవసర వైద్య సేవలు నిరంతరం కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

బాలీవుడ్ హీరోలకు షోకాజ్ నోటీసులు
Current Affairs· 16 Aug 2026

బాలీవుడ్ హీరోలకు షోకాజ్ నోటీసులు

బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర FDA(Food and Drug Administration) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విమల్ పాన్ మసాలా కంపెనీకి చెందిన యాలకుల యాడ్‌లో యాక్ట్ చేసి, నిషేధిత పాన్ మసాలాను ప్రోత్సహించారని తెలిపింది. ఆ యాడ్స్ ప్రచారం వెంటనే ఆపాలని, సోషల్ మీడియా నుంచి కంటెంట్ తొలగించాలని ఆదేశించారు. అగ్రిమెంట్లు, పారితోషిక వివరాలు సబ్‌మిట్ చేయాలని కోరారు.

రాబోయే 22 గంటల్లో వాయుగుండం..
AP· 16 Aug 2026

రాబోయే 22 గంటల్లో వాయుగుండం..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి 'స్పష్టమైన అల్పపీడనం'గా మారింది. ఇది రాబోయే 22 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయి. సముద్రం అలజడిగా ఉంటుంది కాబట్టి, మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు చెబుతున్నారు.

రౌడీ షీటర్లకు పల్నాడు పోలీసుల కౌన్సిలింగ్
Local· 16 Aug 2026

రౌడీ షీటర్లకు పల్నాడు పోలీసుల కౌన్సిలింగ్

AP: పల్నాడు జిల్లాలో నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగినవారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆదేశాల మేరకు అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలికి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

గౌతు లచ్చన్న సేవలు మరువలేనివి
Local· 16 Aug 2026

గౌతు లచ్చన్న సేవలు మరువలేనివి

AP: సర్దార్ గౌతు లచ్చన్న సేవలు మరువలేనివని మాజీ మంత్రి గౌతు శివాజీ అన్నారు. లచ్చన్న 117వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కిష్టపురం గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మందస మండలం మందస, బాలిగాం జంక్షన్ లలో మండల టిడిపి అధ్యక్షులు భావన దుర్యోధన ఆధ్వర్యంలో గౌతు లచ్చన్న జయంతి వేడుకలు నిర్వహించారు.

ఇండస్ట్రియల్ కెమికల్స్ దొంగల అరెస్ట్
Local· 16 Aug 2026

ఇండస్ట్రియల్ కెమికల్స్ దొంగల అరెస్ట్

TG: నల్గొండ జిల్లా చిట్యాల పరిధిలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్స్‌ను అక్రమంగా దారి మళ్లిస్తూ అమ్ముతున్న ముఠాను చిట్యాల పోలీసులు అరెస్టు చేశారు. వెలిమేడు రాజస్థాన్ దాబా వెనక లారీలలో ట్యాంకర్లలో అక్రమంగా కెమికల్స్‌ను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులు చేసి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పెళ్లి పీటలపై యువతి సంచలన నిర్ణయం.. వివాహం రద్దు
TG· 16 Aug 2026

పెళ్లి పీటలపై యువతి సంచలన నిర్ణయం.. వివాహం రద్దు

TG: పెళ్లి పీటలపైకి వచ్చిన యువతి పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో వివాహం రద్దయింది. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం క్యాంప్ రాయవరం గ్రామానికి చెందిన యువకుడికి, బిజినపల్లి మండలం సల్కర్‌పేట గ్రామానికి చెందిన యువతికి పెళ్లి కుదిర్చారు. పెళ్లి పీటలపైకి వచ్చిన యువతి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో అక్కడి వాతావరణం మారిపోయింది. అనంతరం పోలీసులు, సఖి కేంద్రం సిబ్బంది అక్కడికి చేరుకుని వారి పెద్దలకు నచ్చజెప్పారు.

పరకాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన
Local· 16 Aug 2026

పరకాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సాగింది. నియోజకవర్గ స్వరూపాన్ని మార్చేలా రూ.484.42 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 100 పడకల ఏరియా ఆసుపత్రి & డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, లక్ష్మణ్ ,పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, వరంగల్ ఎంపీ కడియం కావ్య ,ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

AIతో మాట్లాడుతున్నారా? జాగ్రత్త!
Technology· 16 Aug 2026

AIతో మాట్లాడుతున్నారా? జాగ్రత్త!

మన ఫోన్‌లోని AIతో మాట్లాడటం ఇప్పుడు చాలా సహజంగా మారిపోయింది. ఏదైనా అడిగితే సమాధానం, రిమైండర్లు, మెసేజ్‌లు, స్మార్ట్ పరికరాల కంట్రోల్.. ఇలా చాలా పనులు వాయిస్‌తోనే జరిగిపోతున్నాయి. అయితే మనం మాట్లాడే మాటలు ఎక్కడ ప్రాసెస్ అవుతున్నాయి? ఎంతకాలం స్టోర్ అవుతున్నాయి? వాటిని ఎవరు యాక్సెస్ చేయగలరు? కొన్ని AI సర్వీసులు మెరుగైన సేవల కోసం వాయిస్ డేటాను ప్రాసెస్ లేదా స్టోర్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే AI సౌకర్యాన్ని ఉపయోగిస్తూనే, మన వాయిస్ డేటా ఎలా ఉపయోగించబడుతుందో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.

జాబ్ పోతే PFలో ఎంత డబ్బు?
Jobs· 16 Aug 2026

జాబ్ పోతే PFలో ఎంత డబ్బు?

ఉద్యోగం పోయిన వారికి PF డబ్బులపై కొత్త నిబంధనలు వచ్చాయి. EPF స్కీమ్-2026 ప్రకారం, ఉద్యోగం పోయిన వెంటనే PFలోని 75శాతం వరకు డబ్బు తీసుకోవచ్చు. 12 నెలల్లోనూ కొత్త ఉద్యోగం రాకపోతే మిగిలిన 25శాతం డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగం వస్తే 25శాతం తీసుకునే అవకాశం ఉండదు.