సెప్టెంబర్‌లో అన్ని లెక్కలు చెప్తా: CM

TG : వెయ్యిమంది KCRలు ఏకమై వచ్చినా నన్నేం చేయలేరని CM రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ కుటుంబం, BRS రాజకీయ వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. KCR పాలన ఫ్యామిలీ జస్టిస్ అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ జస్టిస్ కోసం పనిచేస్తోందన్నారు. యువత, నిరుద్యోగులు రాజకీయ ప్రచారాలకు ప్రభావితం కావొద్దని సూచించారు. గత ప్రభుత్వ పాలన, తమ ప్రభుత్వ పనితీరుపై రాబోయే సెప్టెంబర్ అసెంబ్లీ సమావేశాల్లో అన్ని లెక్కలు ప్రజల ముందు పెడతామని స్పష్టం చేశారు.



