Latest

ఫైవ్‌స్టార్ హోటళ్లలో Expire అయిన ఫుడ్ ప్రొడక్ట్స్‌
News· 8 Aug 2026

ఫైవ్‌స్టార్ హోటళ్లలో Expire అయిన ఫుడ్ ప్రొడక్ట్స్‌

బెంగళూరులోని ఆరు ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ రూల్స్ ఉల్లంఘనలు బయటపడ్డాయి. దీంతో కర్ణాటక ఫుడ్ సేఫ్టీ (FSDA) అధికారులు ఇన్‌స్పెక్షన్స్‌ చేసి ఫుడ్ ప్రొడక్ట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్స్‌పైరైనా ఫుడ్‌ను స్టోర్ చేయడం, స్టాండర్డ్ లేని స్టోరేజ్‌ను వాడడం గుర్తించారు. మొత్తం 250 కిలోల మీట్, 207 కిలోల వెజిటబుల్స్, 32 లీటర్ల ఎక్స్‌పైరైనా మిల్క్, 3 కిలోల బేకరీ ప్రొడక్ట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. లలిత్ అశోక్, షాంగ్రి-లా, ఫోర్ సీజన్స్, రాడిసన్ బ్లూ వంటి హోటళ్లలో అధికారులు వీటిని గుర్తించారు.

బోనం ఎత్తిన నిహారిక కొణిదెల!
News· 8 Aug 2026

బోనం ఎత్తిన నిహారిక కొణిదెల!

హైదరాబాద్ లో బోనాల పండుగ వేడుకల్లో నటి, నిర్మాత నిహారిక కొణిదెల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాతబస్తీలోని మీరాలంమండి శ్రీ మహంకాళేశ్వర ఆలయాన్ని సందర్శించిన ఆమె, సంప్రదాయ దుస్తుల్లో అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీస్సులు అందించారు. బోనం ఎత్తుకున్న నిహారిక ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాశీ ఖన్నా అసలు ప్లాన్ ఇదే!
Cinema· 8 Aug 2026

రాశీ ఖన్నా అసలు ప్లాన్ ఇదే!

ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న హీరోయిన్ రాశీ ఖన్నా తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నటించే ఛాన్స్ రావడంతోనే 'ధర్మన్' సినిమాకు వెంటనే 'ఓకే' చెప్పానని తెలిపారు. కథలో ప్రతి పాత్రకూ ప్రాముఖ్యత ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అందుకే తక్కువ సినిమాలు చేసినా మంచి పాత్రలనే ఎంచుకుంటున్నట్లు తెలిపారు. కేవలం నటిగానే కాకుండా, రాబోయే రోజుల్లో సినిమాలు నిర్మించే (ప్రొడక్షన్) ఆలోచన కూడా ఉందన్నారు.

క్లాస్‌రూమ్‌లో విద్యార్థి డ్రగ్స్!
News· 8 Aug 2026

క్లాస్‌రూమ్‌లో విద్యార్థి డ్రగ్స్!

మహారాష్ట్రలోని ఠాణేలో స్కూల్ యూనిఫాంలో ఉన్న ఓ విద్యార్థి క్లాస్‌రూమ్‌లోనే డ్రగ్స్ తీసుకుంటున్న వీడియో వైరల్ అవ్వడంతో ఠాణే పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. వీడియో ఏ పాఠశాలకు చెందినదో, అందులో ఉన్న విద్యార్థి ఎవరో గుర్తించేందుకు విచారణ వేగవంతం చేశారు. వీడియో నిజమైనదేనా కాదా అనే చర్చ జరుగుతుండగా, మరోపక్క పాఠశాలల్లో పిల్లల భద్రత, పర్యవేక్షణ ఎంతవరకు ఉందో అని తల్లిదండ్రులు భయపడుతున్నారు.

మూసీ ప్రాజెక్టుపై మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌కు నోటీసులు
Legal· 8 Aug 2026

మూసీ ప్రాజెక్టుపై మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌కు నోటీసులు

TG: హైదరాబాద్ మూసీ రివర్ ప్రాజెక్టు కోసం మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను వెంటనే ఖాళీ చేయాలని రాజేంద్రనగర్ RDO ఆఫీసర్స్ నోటీసులిచ్చారు. అపార్ట్‌మెంట్‌ను తొలగించకుండానే మూసీ అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారని ఓనర్లు గుర్తుచేశారు. మళ్లీ నోటీసులు ఎందుకిస్తున్నారని ప్రశ్నించారు. హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశామని, తీర్పు వచ్చే వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని MROకు లీగల్ నోటీసులు పంపించామన్నారు. కాంపెన్సేషన్‌పై క్లారిటీ వచ్చే వరకు ఖాళీ చేయమని రెసిడెంట్స్ తేల్చిచెప్పారు.

పెళ్లైన నాలుగు నెలలకే విషాదం
AP· 8 Aug 2026

పెళ్లైన నాలుగు నెలలకే విషాదం

AP: విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌ PS పరిధిలోని అయోధ్యనగర్‌లో ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన చంద్రకళ(24)కు ఈ ఏడాది ఏప్రిల్‌లో దేవేంద్రతో వివాహం జరిగింది. భర్త పనికి వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్నేహితుడి ఫోన్‌తో ఇంటికి చేరుకున్న భర్త.. తలుపులు వేసి ఉండటాన్ని గమనించి, చూడగా ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సెక్షన్ 22Aతో భూయజమానులకు ఇబ్బంది
Infotainment· 8 Aug 2026

సెక్షన్ 22Aతో భూయజమానులకు ఇబ్బంది

రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A కింద ప్రభుత్వం, ఎండోమెంట్, వక్ఫ్, అసైన్డ్, సీలింగ్ సర్ప్లస్ భూములను నిషేధిత జాబితాలో పెట్టడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వేలాది ప్రైవేట్ భూయజమానులు ఇబ్బందులు పడుతున్నారు. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు ఈ జాబితాలోని సర్వే నంబర్లపై సేల్, గిఫ్ట్, తనఖా డాక్యుమెంట్లు రిజిస్టర్ చేయడం లేదు. చాలా చోట్ల మొత్తం సర్వే నంబర్‌ను జాబితాలో పెట్టడంతో లీగల్ పట్టా భూములు, లేఅవుట్ ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు ఈ జాబితాలో చేరిపోయాయి.

E20పై భారీ ఉద్యమం చేస్తాం: రాహుల్ గాంధీ
Politics· 8 Aug 2026

E20పై భారీ ఉద్యమం చేస్తాం: రాహుల్ గాంధీ

E20 ఫ్యూయల్ అంశంపై భారీ స్థాయిలో పోరాటం చేస్తామని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. ప్రస్తుతం దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, తాము ప్రస్తావించాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. E20 ఫ్యూయల్ ప్రజల కార్లు, స్కూటర్లను డ్యామేజ్ చేయడంతో పాటు వారి జీవితాలపై ప్రభావం చూపుతోందని ఆరోపించారు. ప్రజల నుంచి నేరుగా డబ్బులు దోచుకుంటున్నట్లుగా పరిస్థితి ఉందని అన్నారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ 'X'లో స్పష్టం చేశారు.

ఆస్కార్ విన్నర్‌తో భారీ ఆఫర్!
Cinema· 8 Aug 2026

ఆస్కార్ విన్నర్‌తో భారీ ఆఫర్!

ప్రియాంక చోప్రా మరో భారీ హాలీవుడ్ ప్రాజెక్టును దక్కించుకున్నారు. ఆస్కార్ అవార్డు విజేత రస్సెల్ క్రోతో కలిసి 'బ్లూఫ్లై' అనే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటించనున్నారు. ఓర్లాండో వోన్ ఐన్సీడెల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రాబోయే టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే పెద్ద సినిమా డిస్ట్రిబ్యూటర్లకు పరిచయం చేయనున్నారు. ఇటీవల 'హెడ్స్ ఆఫ్ స్టేట్'తో అలరించిన ప్రియాంక ఖాతాలో ఇది మరో క్రేజీ ఇంటర్నేషనల్ మూవీ కానుంది.

ప్రియాంక కేసులో పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
AP· 8 Aug 2026

ప్రియాంక కేసులో పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

AP: మెడికో ప్రియాంక ఘటనపై డిప్యూటీ CM పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏలూరు రేంజ్ DIGతో ఫోన్‌లో మాట్లాడి ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ నెల 3న రాజమండ్రిలో సినిమా థియేటర్ వద్ద ప్రియాంక, ఆమె స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఇద్దరు యువకులు కారుతో బైక్‌ను <a href="https://www.theclearcutnews.com/n/BNi4iQK">ఢీకొట్టారు</a>. అనంతరం మరోసారి ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

రూల్స్‌ బ్రేక్.. ఫైన్‌కు బదులు అవగాహన
TG· 8 Aug 2026

రూల్స్‌ బ్రేక్.. ఫైన్‌కు బదులు అవగాహన

TG: ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సూర్యాపేట జిల్లా కోదాడ ట్రాఫిక్ SI బైరెడ్డి అంజిరెడ్డి వినూత్నంగా స్పందించారు. కోదాడ పట్టణంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రిజిస్ట్రేషన్ నంబర్ స్పష్టంగా లేని ఓ ఆటోను గుర్తించారు. వాహనదారుడికి నిబంధనలు వివరించడంతో పాటు, అక్కడికక్కడే ఆటోపై రిజిస్ట్రేషన్ నంబర్‌ను స్వయంగా రాశారు. వాహనాలపై రిజిస్ట్రేషన్ నంబర్ స్పష్టంగా కనిపించేలా ఉంచడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నంబర్లు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

SBIలో 1,538 వేకెన్సీస్.. వెంటనే అప్లై చేసుకోండి
Jobs· 8 Aug 2026

SBIలో 1,538 వేకెన్సీస్.. వెంటనే అప్లై చేసుకోండి

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) జూనియర్‌ అసోసియేట్స్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. SC, SC ,OBC బ్యాక్‌లాగ్‌ వేకెన్సీస్ కోసం స్పెషల్‌గా 1,538 పోస్టులను ఫిల్ చేయనుంది. <a href="https://ibpsreg.ibps.in/sbijasrdjl26/">ఆన్‌లైన్‌ అప్లికేషన్స్ </a>ఆగస్ట్ 7 మొదలవగా, ఆగస్ట్ 27తో ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో 88 పోస్టులు ఉన్నాయి. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ కంప్లీట్ చేసిన 20-28 ఏళ్ల కాండిడేట్లు అప్లై చేసుకోవచ్చు. SC, ST కేటగిరీ కాండిడేట్స్‌కు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు. OBC కేటగిరీ వారు రూ.750 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

గ్యాస్ సిలిండర్లకు గుడ్‌బై..
Infotainment· 8 Aug 2026

గ్యాస్ సిలిండర్లకు గుడ్‌బై..

దేశంలో LPG గ్యాస్ కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోబోతుంది. కరెంట్ తో పనిచేసే ఇన్డక్షన్ స్టవ్‌ల వాడకాన్ని పెంచేందుకు సబ్సిడీలు ఇవ్వడంతో పాటు, వాటి స్పేర్ పార్ట్స్‌పై ఉండే GST ని తగ్గించాలని చూస్తుంది. గ్యాస్ సిలిండర్‌తో పోలిస్తే ఇండక్షన్ స్టవ్ వంట ఖర్చు దాదాపు మూడో వంతు (1/3) వరకు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు.

ఫుడ్ కొరియర్ చేయొచ్చు..అనుభూతిని కాదు!
Health· 8 Aug 2026

ఫుడ్ కొరియర్ చేయొచ్చు..అనుభూతిని కాదు!

ఆన్‌లైన్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా మనకు నచ్చిన ఫుడ్, స్వీట్స్ క్షణాల్లో ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. కానీ,అవి ఉన్న ప్రాంతానికి వెళ్లి అక్కడ తిన్న అనుభూతి, అందించే జ్ఞాపకాలు మాత్రం ఆన్‌లైన్‌లో దొరకవని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్ కరాచీ బిస్కెట్లు, పుణె బకర్‌వాడి వంటివి ఎక్కడైనా దొరుకుతున్నప్పటికీ, అక్కడికి వెళ్లి కొనుక్కుని తిన్నప్పుడు కలిగే అనుభూతి వేరని, ప్రయాణమే ఆహారానికి అసలైన ప్రాణం పోస్తుందని చెబుతున్నారు.

హైడ్రా ఉద్యోగాలకు పోటెత్తిన నిరుద్యోగులు
Jobs· 8 Aug 2026

హైడ్రా ఉద్యోగాలకు పోటెత్తిన నిరుద్యోగులు

TG: హైడ్రాలో 150 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న ఎంపిక ప్రక్రియకు నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో ఆగస్టు 8, 9 తేదీల్లో ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. DRF అసిస్టెంట్ పోస్టులు 100, హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు 50 ఉన్నాయి. పదో తరగతి అర్హతగా నిర్ణయించగా, అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. ఫిజికల్ టెస్టులో 800 మీటర్ల పరుగును 2.50 నిమిషాల్లో, 100 మీటర్ల పరుగును 15 సెకన్లలో పూర్తి చేయడంతో పాటు లాంగ్‌జంప్, షాట్‌పుట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కాలు విరిగితే కార్డుబోర్డుతో కట్టు.. హాస్పిటల్‌పై విమర్శలు
Viral· 8 Aug 2026

కాలు విరిగితే కార్డుబోర్డుతో కట్టు.. హాస్పిటల్‌పై విమర్శలు

బిహార్‌లో గవర్నమెంట్ హాస్పిటల్ హెల్త్ ట్రీట్‌మెంట్‌పై విమర్శలు వస్తున్నాయి. రోడ్డు యాక్సిడెంట్‌లో గాయపడి కాలు విరిగిన కృష్ణకుమార్‌కు మంజ్‌హౌల్‌ డివిజనల్‌ హాస్పిటల్లో స్టాఫ్ కార్డుబోర్డు ముక్కలను కాలికి రెండువైపులా ఉంచి, బ్యాండేజీతో కట్టారు. ఆగస్టు 3న హర్సైన్‌ బ్రిడ్జి దగ్గర్లో ఆటో ఢీకొనడంతో కృష్ణకుమార్‌కు గాయాలవ్వడంతో పోలీసు వెహికల్‌లో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. తరువాత బెగుసరాయ్‌ సదర్‌ హాస్పిటల్‌కు రిఫర్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నెటిజన్స్ హాస్పిటల్ స్టాఫ్‌ పనితీరుపై కామెంట్స్ చేస్తున్నారు.

మిగిలిపోయిన చికెన్‌తో అదిరిపోయే కొత్త వంటకం!
Health· 8 Aug 2026

మిగిలిపోయిన చికెన్‌తో అదిరిపోయే కొత్త వంటకం!

మిగిలిపోయిన ఆహారాన్ని పారవేయకుండా దానికి మరో రుచిని కలిపి కొత్త డిష్‌గా మార్చడం ఒక ఆర్ట్. రచయిత సమర్ హలర్నాకర్ తన 'అవర్ డైలీ బ్రెడ్' కాలమ్‌లో అల్లం, ఉల్లికాడలు (స్ప్రింగ్ ఆనియన్స్), సోయా సాస్‌తో ఆవిరిపై ఉడికించే 'స్టీమ్‌డ్ చికెన్' రెసిపీని పంచుకున్నారు. ఆవిరిపై చికెన్ ఉడికేటప్పుడు వచ్చే చారు (Broth)ను సాస్‌లో కలిపి మరో డిష్‌కి వాడటం వల్ల మంచి రుచి వస్తుంది. తక్కువ సమయంలోనే పాత డిష్‌ను కొత్త రుచితో రీ-క్రియేట్ చేయవచ్చని తెలిపారు.

నకిలీ ఫైర్‌ సర్టిఫికెట్స్.. కాలేజీలకు భారీ షాక్
Education· 8 Aug 2026

నకిలీ ఫైర్‌ సర్టిఫికెట్స్.. కాలేజీలకు భారీ షాక్

TG: రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో నకిలీ ఫైర్ సేఫ్టీ NOCల వ్యవహారంపై ఇంటర్మీడియట్ విద్యా మండలి కఠిన చర్యలు తీసుకుంది. నకిలీ ఫైర్ NOCలు సమర్పించినట్లు గుర్తించిన సుమారు 45 కాలేజీలకు ఒక్కో కాలేజీపై రూ.8 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఇదే వ్యవహారంలో ఫేక్ సర్టిఫికెట్లతో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు పొందినట్లు గుర్తించిన 37 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. వారంలోగా తమ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. విద్యా సంస్థల్లో నిబంధనల ఉల్లంఘనను సహించబోమని స్పష్టం చేశారు.

కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టు సీరియస్
TG· 8 Aug 2026

కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టు సీరియస్

TG: హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడలోని సల్కం చెరువు భూమి వ్యవహారంలో హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం పలువురు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌, హైడ్రా కమిషనర్‌ AV రంగనాథ్‌తో పాటు విద్య, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులకు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.

బ్రోకోలీలో దాగున్న  ‘సీక్రెట్’
Health· 8 Aug 2026

బ్రోకోలీలో దాగున్న ‘సీక్రెట్’

బ్రోకోలీ, క్యాబేజీ లాంటి కూరగాయల్లో ఉండే 'సల్ఫోరాఫేన్' అనే పదార్థం 'కెరాటోకోనస్' అనే కంటి సమస్య చికిత్సకు సహాయపడుతుందని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ (LVPEI), న్యూయార్క్ వర్సిటీ పరిశోధనలో తేలింది. ఇది కంటి కణాలను దెబ్బతినకుండా రక్షించే 'NRF2' అనే ప్రొటీన్‌ను యాక్టివేట్ చేస్తుంది. దీని ఆధారంగా త్వరలోనే ఐ డ్రాప్స్ లేదా మందులు అందుబాటులోకి తెచ్చేలా సైంటిస్టులు పనిచేస్తున్నారు.

డూప్లెక్స్‌ ఇంట్లో మహిళ అస్థిపంజరం
Crime· 8 Aug 2026

డూప్లెక్స్‌ ఇంట్లో మహిళ అస్థిపంజరం

బెంగళూరులోని బగలగుంటె హవనూర్‌ లేఅవుట్‌లో ఓ డూప్లెక్స్‌ ఇంట్లో మహిళ (దాక్షాయిణి) అస్థిపంజరం లభ్యమైంది. ఆమె సంవత్సరం క్రితమే చనిపోయుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త ఉమేశ్‌ 10 ఏళ్ల క్రితం మృతి చెందగా, కుమారుడు కూడా క్యాన్సర్‌తో చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఒంటరిగా ఉంటూ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. సంవత్సరం నుంచి ఆమె కూతురు, అల్లుడు కూడా ఇంటికి రాలేదని తెలుస్తోంది. బగలగుంటె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతికి గల కారణాలుపై దర్యాప్తు చేస్తున్నారు.