Latest

ధవళేశ్వరం వద్ద రెడ్ అలర్ట్
AP: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం స్వల్పంగా తగ్గి 54.3 అడుగులకు చేరినా, ఆ వరద నీరు దిగువకు చేరుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజి వద్ద 13.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో నమోదైంది. ప్రవాహం 15 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, కాజ్‌వేలు దాటవద్దని హెచ్చరించారు.

డాక్టర్ నంబర్ కోసం వెతికితే.. డబ్బు మాయం
TG: హైదరాబాద్‌లోని నాగోల్ వాణీనగర్‌కు చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి శెట్టి వేణుగోపాల్ కిమ్స్ ఆస్పత్రి డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో ఫోన్ నంబర్ వెతికారు. నకిలీ నంబర్‌కు కాల్ చేయగా, సైబర్ మోసగాళ్లు రూ.5 చెల్లించాలని చెప్పి వాట్సాప్‌లో APK ఫైల్ పంపించారు. దానిని ఇన్‌స్టాల్ చేయగానే మొబైల్ స్తంభించిపోయి, బ్యాంకు ఖాతా నుంచి రూ.1.96 లక్షలు కాజేశారు. బాధితుడు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నీళ్లు తాగిన స్టూడెంట్స్‌కు అస్వస్థత.. స్కూల్‌లో టెన్షన్
AP: అన్నమయ్య జిల్లా KV పల్లి మండలం చిన్నకంపల్లి ప్రభుత్వ పాఠశాలలో తాగునీరు తాగిన అనంతరం ముగ్గురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కలకలం రేపింది. వాంతులు, అనారోగ్య లక్షణాలు కనిపించడంతో ఉపాధ్యాయులు వెంటనే వారిని మహల్ క్రాస్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. తాగునీటిలో గుర్తుతెలియని విషపదార్థం కలిసిందనే అనుమానంతో పోలీసులు పాఠశాలకు చేరుకుని విచారణ ప్రారంభించారు. నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపేందుకు చర్యలు చేపట్టారు.

భూభారతితో అక్రమాలకు చెక్
TG: ధరణి పోర్టల్ వేదికగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలపై ఫాస్ట్‌ట్రాక్ విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ధరణి నుంచి భూభారతి వరకు జరిగిన ప్రతి భూలావాదేవీని సమగ్రంగా పరిశీలిస్తామని, పేదల భూములను ఆక్రమించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో 276 గ్రామాల్లో రీ సర్వే పూర్తైందని, ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక 'భూధార్' సంఖ్య కేటాయిస్తామని తెలిపారు.

వరద విలయం.. వంద గ్రామాలకు రాకపోకలు బంద్
AP: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం బ్యారేజీలో నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంతో చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లోని సుమారు 100 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోనసీమ జిల్లాలో లంక గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అందరూ భాగస్వాములైతేనే రైజింగ్ తెలంగాణ
తెలంగాణ రైజింగ్-2047 కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, సమాజంలోని ప్రతి వర్గం భాగస్వామ్యంతో సాకారమయ్యే అభివృద్ధి విజన్ అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన '50వ సదరన్ ఇండియా రీజినల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్' సదస్సులో ఆయన మాట్లాడారు. ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక పురోగతి, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాల పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. రాష్ట్రాన్ని 2047 నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

విమానాశ్రయంతో కొత్త అధ్యాయం: CM
AP: ఉత్తరాంధ్ర ఇక వెనుకబడిన ప్రాంతం కాదు.. దేశానికే ఆదర్శంగా నిలిచే అభివృద్ధి కేంద్రంగా మారుతుందని CM చంద్రబాబు నాయుడు అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతం ఇక వలసల ప్రాంతం కాదని, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలసలు వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. ప్రధాని మోదీ సహకారంతో రూ.6.13 లక్షల కోట్ల పెట్టుబడులు, 189 ప్రాజెక్టులు వచ్చాయని, 5.57 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

చెరువులే భావితరాల భవిష్యత్తు: CM
TG: హైదరాబాద్‌లోని ఉప్పల్ <a href="https://x.com/revanth_anumula/status/2083539813488304532">నల్లచెరువు </a>పునరుజ్జీవం కావడంపై CM రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. <br>చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడటం మాత్రమే కాదని, భావితరాల భవిష్యత్తును భద్రపరచడమేనని పేర్కొన్నారు. హైడ్రా చేపట్టిన చర్యలతో ఆక్రమణలు తొలగించి చెరువు విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు పూడిక తొలగింపు, కట్ట నిర్మాణం, మురుగునీటి శుద్ధి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో నల్లచెరువు పూర్తిస్థాయిలో నిండిపోయి జలకళను సంతరించుకుంది.

Toiletకి Phone తీసుకెళ్తున్నారా?
టాయిలెట్‌కి వెళ్లేటప్పుడు ఫోన్ లేకపోతే ఏదో మర్చిపోయిన ఫీలింగ్ వస్తుందా..? 5 మినిట్స్ పని 30 మినిట్స్ అవుతోందా? 😂 రీల్స్ చూస్తూ ఎక్కువసేపు టాయిలెట్‌లో కూర్చోవడం మాత్రం మంచి హ్యాబిట్ కాదు బ్రో. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కింద భాగంలోని వెయిన్స్‌పై ప్రెజర్ పెరిగి హెమరాయిడ్స్ (పైల్స్) వచ్చే రిస్క్ పెరగొచ్చు. మరోవైపు ఫోన్‌పై జెర్మ్స్ చేరి, తర్వాత చేతులు కడిగినా ఫోన్ క్లీన్ చేయకపోతే అవి మళ్లీ చేతులకు రావచ్చు. అందుకే టాయిలెట్‌ని రీల్స్ థియేటర్ చేయకుండా... పని అయిపోయాక బయటకు రావడం బెటర్!

Coffee ఎప్పుడు తాగాలి?
నిద్ర లేవగానే కళ్లు కూడా పూర్తిగా తెరవకముందే కాఫీ కప్పు చేతిలోకి వచ్చేస్తుందా..? ☕😂 అయితే కొంచెం వెయిట్ చేయడం బెటర్ అంటున్నారు న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్స్. లేచిన వెంటనే మన బాడీలో కార్టిసోల్ లెవల్స్ ఎక్కువగా ఉండి సహజంగానే అలర్ట్‌గా ఉంచుతాయి. అందుకే లేచిన 60–90 నిమిషాల తర్వాత, సాధారణంగా ఉదయం 9–11 మధ్య కాఫీ తాగితే బెటర్ అని చెబుతున్నారు. అలాగే రోజుకు 400mg కెఫిన్ దాటకుండా చూసుకోవాలి. రాత్రి మంచి నిద్ర కావాలంటే బెడ్‌టైమ్‌కు 6–8 గంటల ముందే కాఫీకి బ్రేక్ ఇవ్వడం మంచిదట.

ఆకట్టుకుంటున్న భోగాపురం ఎయిర్ పోర్ట్ డ్రోన్ విజువల్స్
AP: భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ డ్రోన్ విజువల్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. మోడ్రన్ టెక్నాలజీతో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా మారనుంది. ప్రధాని నరేంద్ర మోదీకి వెల్కమ్ పలికేందుకు ఎయిర్ పోర్టులో వేలాది మంది గిరిజన సంప్రదాయ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. ఒకే డ్రెస్ కోడ్‌తో వేలాది మంది కళాకారులు పాల్గొన్న ఈ థింసా నృత్యం ఇప్పటికే గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది.

రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులను వర్చువల్‌గా లాంచ్ చేసిన మోదీ
AP: భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం తరువాత ప్రధాని నరేంద్ర మోదీ వేదిక నుంచి రాష్ట్రంలోని కొన్ని డెవలప్‌మెంట్ ప్రాజెక్టులను వర్చువల్‌గా లాంచ్ చేశారు. విశాఖపట్నం తర్లువాడలోని ASIP టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్–టెస్టింగ్ యూనిట్, కర్నూలులోని విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను ఇనాగరేట్ చేశారు. అనంతపురంలో 2,500 మెగావాట్లు, కర్నూలులో 1,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ జోన్‌ను వర్చువల్‌గా వర్చువల్‌గా లాంచ్ చేశారు.

ఓటీటీలో ఉన్నా థియేటర్లకే క్యూ
'ది ఇన్వైట్', 'అబ్సెషన్', 'మటీరియలిస్ట్స్' లాంటి హాలీవుడ్ సినిమాలు ఇప్పటి డేటింగ్స్, పెళ్లిళ్లలోని అసలు నిజాలను, రిలేషన్‌షిప్‌లలో ఉండే సమస్యలను చాలా నేచురల్‌గా చూపిస్తూ హిట్లుగా నిలుస్తున్నాయి. ఓటీటీలో అందుబాటులో ఉన్నప్పటికీ, మనసుకి హత్తుకునేలా ఉండే ఇలాంటి కథలను పెద్ద తెరపైనే చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. భారతదేశంలో 'ది ఇన్వైట్' లాంటి చిన్న హాలీవుడ్ మూవీ రూ.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

AI స్మార్ట్ అవుతోంది సరే... కంట్రోల్‌లో ఉందా? 👀
OpenAI తన AI ఏజెంట్స్‌పై చేస్తున్న ఇన్వెస్టిగేషన్‌లో మరికొన్ని ఏజెంట్లు టెస్టింగ్ కోసం పెట్టిన హద్దులను దాటిన సందర్భాలు గుర్తించినట్లు రిపోర్ట్ చెబుతోంది. అయితే అవి OpenAI నెట్‌వర్క్‌ను వదిలి బయటకు వెళ్లినట్లు ఆధారాలు లేవని, ఘటనలు కూడా లిమిటెడ్‌గానే ఉన్నాయని సమాచారం. ఇటీవల Hugging Face సిస్టమ్‌లోకి ఒక OpenAI ఏజెంట్ వెళ్లిన ఘటన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఇప్పుడు పాత లాగ్స్‌ను కూడా చెక్ చేస్తూ అసలు ఎన్ని సార్లు ఇలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది.

ఈ అరుదైన పెళ్లి చూశారా!
కేరళలో అత్యంత అరుదైన, ఆసక్తికరమైన వివాహం జరిగింది. అఖిల్ థామస్, నిఖిల్ థామస్ అనే కవల సోదరులు... మ్యాగీ మేరీ, మరియా మేరీ అనే కవల అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిలో అసలైన ట్విస్ట్ ఏంటంటే... ఈ వివాహ వేడుకను జరిపించిన ప్రీస్ట్స్ ఆంటో, అజోలు కూడా కవలలే కావడం విశేషం! అంతేకాకుండా ఈ వెడ్డింగ్‌లో వారికి హెల్ప్ చేసిన అసిస్టెంట్లు కూడా కవల సోదరులే కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

లీక్ అనుకుంటే పొరపాటే.. వెలుగులోకి 'హైటెక్' మోసం!
పంజాబ్ ఫార్మసీ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ వివాదం పేపర్ లీక్ కాదని, అదొక హైటెక్ మోసమని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్‌జ్యోత్ సింగ్ బైన్స్ స్పష్టం చేశారు. హర్యానాలోని భివానీ కేంద్రంగా నడుస్తున్న ఒక ముఠా ఈ స్కామ్ వెనుక ఉందని తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 10 మంది మెయిన్ నిందితులు, 25 మంది కాండిడేట్స్, 8 మంది హ్యాండ్లర్లతో సహా మొత్తం 43 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా పరారీలో ఉన్న ఐదుగురి కోసం పోలీసులు సెర్చ్ చేస్తున్నారు.

మేమొచ్చాకా మహనీయుల పేర్లు పెట్టాం: ప్రధాని మోదీ
AP: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఏవియేషన్ రంగ అభివృద్ధిపై మాట్లాడారు. గతంలో నిర్మించిన ఎయిర్ పోర్టులకు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల పేర్లు పెట్టేవారని, తమ ప్రభుత్వం వచ్చాక దేశ మహనీయుల పేర్లను పెడుతోందని అన్నారు. అయోధ్య ఎయిర్ పోర్టుకి వాల్మీకి, పంజాబ్‌లో సంత్ రవిదాస్ పేర్లు పెట్టామని గుర్తుచేశారు. ఇప్పుడు ఈ ఎయిర్ పోర్టుకి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామని తెలిపారు.
నాన్న హెల్ప్ చేస్తారు కానీ!
తమిళనాడు CM విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తన కెరీర్, డైరెక్షన్ పై ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, లెగసీ వల్ల ఎక్స్‌ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంటుందని, అందుకే చాలా కేర్‌ఫుల్‌గా ఉంటానని చెప్పారు. సొంతంగా నేమ్, ఐడెంటిటీ బిల్డ్ చేసుకోవాలని నాన్న చెప్పారని, హెల్ప్ కావాలంటే ఎప్పుడైనా అడగొచ్చని, కానీ స్పూన్ ఫీడింగ్ చేయనని విజయ్ స్పష్టం చేసినట్లు చెప్పారు. సొంత టాలెంట్ తో ఎక్స్‌పీరియన్స్ సాధిస్తూ ముందుకు వెళ్లడమే తన గోల్ అని సంజయ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఓటీటీలోకి అఖిల్ బ్లాక్‌బస్టర్ 'లెనిన్'..
మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం 'లెనిన్' థియేటర్లలో సాలిడ్ సక్సెస్ సాధించింది. ఈ మూవీ ఆగస్టు రెండో వారం నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయినవారు త్వరలోనే ఓటీటీలో ఎంజాయ్ చేయవచ్చు.

Protection ఇస్తానని... Pocket ఖాళీ చేశాడా?
“ఫ్యూచర్ చెబుతానని... చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ ఫ్యూచర్‌నే మార్చేశాడా?” 😳💸 కెనడాలో గంగాధర్ బాబు అనే 29 ఏళ్ల వ్యక్తి సైకిక్, స్పిరిచువల్ హీలర్‌గా చెప్పుకుంటూ ఓ వ్యక్తి నుంచి $800,000కు పైగా తీసుకున్నట్లు టొరంటో పోలీసులు చెబుతున్నారు. మీకు, మీ ఫ్యామిలీకి పెద్ద ప్రమాదం జరుగుతుందని భయపెట్టి, స్పిరిచువల్ ప్రొటెక్షన్ పేరుతో పదే పదే డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అతడిపై కెనడా-వైడ్ వారెంట్ జారీ కాగా, అతడు భారత్‌కు వెళ్లిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అప్పు ఎగ్గొట్టేందుకు MDపై కాల్పులు
మహారాష్ట్రలో GSM ఫాయిల్స్ కంపెనీ MD మోహన్‌సింగ్‌ను చంపడానికి ఆయన బిజినెస్ పార్ట్‌నర్ 'సాగర్' ప్లాన్ చేశాడు. సాగర్ షేర్ మార్కెట్‌లో నష్టపోయి మోహన్‌సింగ్ దగ్గర 32 కోట్లు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బులు ఎగ్గొట్టి, కంపెనీ మొత్తాన్ని లాక్కోవడానికే ఇద్దరు వ్యక్తులతో కాల్పులు జరిపించాడు. ఒక బుల్లెట్ మోహన్‌సింగ్ భుజానికి తగిలినా అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాలతో బయటపడి హాస్పిటల్ లో ఉన్నాడు. CCTV కెమెరాల ఆధారంగా పోలీసులు సాగర్‌ను అతనికి సాయం చేసిన వాళ్లందరినీ అరెస్టు చేశారు.