← Back to news

మేమొచ్చాకా మహనీయుల పేర్లు పెట్టాం: ప్రధాని మోదీ

By Mahesh· 1 Aug 2026· భోగాపురం
మేమొచ్చాకా మహనీయుల పేర్లు పెట్టాం: ప్రధాని మోదీ

AP: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌ ప్రారంభోత్సవ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఏవియేషన్ రంగ అభివృద్ధిపై మాట్లాడారు. గతంలో నిర్మించిన ఎయిర్‌ పోర్టులకు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల పేర్లు పెట్టేవారని, తమ ప్రభుత్వం వచ్చాక దేశ మహనీయుల పేర్లను పెడుతోందని అన్నారు. అయోధ్య ఎయిర్‌ పోర్టుకి వాల్మీకి, పంజాబ్‌లో సంత్ రవిదాస్ పేర్లు పెట్టామని గుర్తుచేశారు. ఇప్పుడు ఈ ఎయిర్‌ పోర్టుకి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామని తెలిపారు.

More in Politics