← Back to news

అప్పు ఎగ్గొట్టేందుకు MDపై కాల్పులు

By rk· 1 Aug 2026
అప్పు ఎగ్గొట్టేందుకు MDపై కాల్పులు

మహారాష్ట్రలో GSM ఫాయిల్స్ కంపెనీ MD మోహన్‌సింగ్‌ను చంపడానికి ఆయన బిజినెస్ పార్ట్‌నర్ 'సాగర్' ప్లాన్ చేశాడు. సాగర్ షేర్ మార్కెట్‌లో నష్టపోయి మోహన్‌సింగ్ దగ్గర 32 కోట్లు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బులు ఎగ్గొట్టి, కంపెనీ మొత్తాన్ని లాక్కోవడానికే ఇద్దరు వ్యక్తులతో కాల్పులు జరిపించాడు. ఒక బుల్లెట్ మోహన్‌సింగ్ భుజానికి తగిలినా అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాలతో బయటపడి హాస్పిటల్ లో ఉన్నాడు. CCTV కెమెరాల ఆధారంగా పోలీసులు సాగర్‌ను అతనికి సాయం చేసిన వాళ్లందరినీ అరెస్టు చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 9h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.