Latest

అజయ్ కుమార్‌కు కీలక బాధ్యతలు
AP: విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన పి. అజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రిఫరీ బోర్డు చీఫ్ రిఫరీగా నియమితులయ్యారు. బొద్దాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ నిర్దేశకుడిగా పనిచేస్తున్న అజయ్ కుమార్‌ను చీఫ్ రిఫరీగా నియమిస్తూ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. 1990లో రాష్ట్రస్థాయి, 1993లో జాతీయస్థాయి రిఫరీగా ఎంపికైన ఆయన 33 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ఇప్పటివరకు 55 జాతీయస్థాయి పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.

భారీగా తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. Goodreturns వెబ్‌సైట్ అప్‌డేట్ ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ₹2,070 తగ్గి ₹1,52,020 వద్ద ట్రేడ్ అవుతోంది. అలానే 22 క్యారెట్లపై ₹1,900 తగ్గి ₹1,39,350 వద్ద, 18 క్యారెట్లపై ₹1,550 తగ్గి ₹1,14,020 దగ్గర ఉంది. మార్కెట్లో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి షాపింగ్ ప్లాన్ చేసేముందు లైవ్ ప్రైసెస్ చెక్ చేసుకోండి

సైబర్ మోసాలపై అవగాహన
TG: ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బజార్‌హత్నూర్ పోలీసులు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలంలో పోలీసులు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మొబైల్ ద్వారా జరిగే సైబర్ మోసాలపై ప్రజలకు వివరించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపించే ఓటీపీలు, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బ్యాంకు, వ్యక్తిగత వివరాలతో కూడిన ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు చెప్పకూడదని తెలిపారు. గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు.

ఊరు ఒక్కటే.. మండలాలు మాత్రం మూడు
TG: హనుమకొండ జిల్లా వెంకటేశ్వర్లపల్లి గ్రామస్థులు మూడు మండలాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాల పునర్విభజనకు ముందు వరంగల్ జిల్లా పరకాల మండలంలో ఉన్న ఈ గ్రామాన్ని అనంతరం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో చేర్చారు. కొత్తగా నడికుడ మండలం ఏర్పడిన తర్వాత గ్రామాన్ని ఆ మండలంలో విలీనం చేశారు. దీంతో రెవెన్యూ పనులకు నడికుడ, పరిపాలనా అవసరాలకు కమలాపూర్, శాంతిభద్రతల వ్యవహారాలకు పరకాల మండలాలను ఆశ్రయించాల్సి వస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో సమయం, డబ్బు వృథా అవుతున్నాయని అన్నారు.

వైఎస్సాఆర్‌కు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఘన నివాళి
TG: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నాయకులు గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపాల్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ మినాజ్, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని వైఎస్సార్‌కు ఘన నివాళులు అర్పించారు.

TTD ఆఫీసర్ ఇంట్లో సడన్ రైడ్స్!
తిరుమల తిరుపతి దేవస్థానం Deputy EO మొండు లోకనాథం ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ACB ఆఫీసర్స్ సడన్ రైడ్స్ చేశారు. బుధవారం 6AM నుంచి తిరుపతి పెదకాపు లేఅవుట్‌లోని ఆయన ఇల్లు, బంధువుల ఇళ్లు, తిరుమలలోని గెస్ట్‌హౌస్‌లో ACB DSP శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 7 స్పెషల్ టీమ్స్ ఒకేసారి సెర్చ్ ఆపరేషన్ చేసింది. తిరుపతి SBI బ్రాంచ్ లాకర్లను కూడా ఆఫీసర్స్ వెరిఫై చేస్తున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత TTD హిస్టరీలో ఒక Deputy EO స్థాయిలో ఉన్న ఆఫీసర్ ఇంట్లో ACB ఆఫీసర్స్ రైడ్స్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్.

పోస్టుమాస్టర్ నిర్లక్ష్యం.. బాధితుడికి ఆర్థిక నష్టం
AP: రికరింగ్ డిపాజిట్ (RD) వ్యవహారంలో పోస్టుమాస్టర్ నిర్లక్ష్యంతో ఆర్థికంగా, మానసికంగా నష్టపోయానని అంబేడ్కర్ కోనసీమ జిల్లా లక్కవరం గ్రామానికి చెందిన జిల్లెల్ల శ్రీనివాస్ ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం గతంలో పోస్టుమాస్టర్ సుబ్రహ్మణ్యాన్ని సంప్రదించినా ఫలితం లేకపోవడంతో వినియోగదారుల సంక్షేమ సంఘాన్ని ఆశ్రయించారు. తనకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ పోస్టుమాస్టర్‌కు సంఘం ఆధ్వర్యంలో రిజిస్టర్డ్ లేఖ పంపించారు. లేఖ అందిన 15 రోజుల్లోగా బాధితుడికి నష్టపరిహారం అందించాలని వారు సూచించారు.

Today Political Updates..
1. ICUలో అన్నా హజారే 2. పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేళ జనసేన యువజన విభాగం ఏర్పాటు. 3. ఢిల్లీ YSR అవార్డుల ఈవెంట్‌కు CM రేవంత్ హాజరు. 4. మంత్రివర్గ విస్తరణ చర్చల కోసం ఢిల్లీకి TPCC చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ CM భట్టి. 5. YS జగన్ పులివెందుల టూర్ కొనసాగింపు. 6. KCR రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్ బైక్ ర్యాలీలు. 7. రేవంత్ 1000 రోజుల పాలనపై చార్జ్ షీట్ రిలీజ్ చేస్తూ BRS నిరసనలు. 8. పాయకరావుపేటలో గోదావరి జలాలకు CM చంద్రబాబు జల హారతి.

పెంకుటింటికి లక్షల్లో కరెంట్ బిల్లు
TG: ములుగు జిల్లా ప్రేమ్‌నగర్‌లో ఓ పెంకుటింటికి ఏకంగా రూ.1.43 లక్షల విద్యుత్ బిల్లు రావడం కలకలం రేపింది. కొమ్మినేని ప్రసాద్ దంపతులు తమ ఇంటికి ఇంత భారీ బిల్లు రావడంతో ఆందోళన వ్యక్తం చేశారు. 2024 నుంచి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వినియోగానికి జీరో బిల్లులు వచ్చేవని తెలిపారు. కొంతకాలంగా బిల్లులు ఇవ్వలేదని, తాజాగా ఆగస్టు నెలకు రూ.1,43,136 బిల్లు ఇచ్చారని చెప్పారు. బిల్లు చెల్లించలేదని విద్యుత్ అధికారులు ఇంటి కరెంట్ కనెక్షన్ తొలగించారని ఆరోపించారు. అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.

ఇరాన్ వార్ ఎఫెక్ట్.. ట్రంప్ కెరీర్‌లోనే రికార్డ్!
ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ రికార్డు స్థాయిలో పడిపోయింది. రాయిటర్స్-ఇప్సోస్ సర్వే ప్రకారం కేవలం 33% అమెరికన్లు మాత్రమే ఆయనను సపోర్ట్ చేస్తుండగా, 64% మంది వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ కెరీర్‌లోనే ఇది అతి తక్కువ రేటింగ్. ఇరాన్ వార్, పెరిగిన లివింగ్ కాస్ట్ వల్ల ప్రజల్లో అసంతృప్తి బాగా పెరిగిందని సర్వే తెలిపింది. కేవలం 31% మాత్రమే మిలిటరీ యాక్షన్‌కు మద్దతు ఇచ్చారు. ఈ ప్రభావం నవంబర్‌లో జరిగే అమెరికా మిడ్‌టర్మ్ ఎలక్షన్స్‌పై గట్టిగా పడే ఛాన్స్ ఉంది.

నేషనల్ హైవే అయినా.. ప్రయాణం నరకం
TG: పేరుకే నేషనల్ హైవే, గుంతలతో ప్రయాణికులకు నరకయాతన తప్పడం లేదు. నిర్మల్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుష్టి నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వరకు రహదారి అధ్వానంగా మారడంతో ప్రయాణ సమయం భారీగా పెరిగింది. గతంలో గంట పది నిమిషాల్లో చేరే మార్గంలో ప్రస్తుతం రెండుగంటల వరకు పడుతోంది. నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుష్టి గ్రామం వద్ద వంతెనపై భారీ గుంత ఏర్పడటంతో ఒకవైపు మాత్రమే వాహనాలు సాగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య పెరిగింది.

స్కూల్‌లో టాబ్లెట్స్ వేసుకొని 54 మందికి అస్వస్థత!
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక స్కూల్‌లో మలేరియా టాబ్లెట్స్ (క్లోరోక్విన్) వికటించి 54 మంది స్టూడెంట్స్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మడివి జమున అనే 7 ఏళ్ల పాప చనిపోయింది. మిగతా స్టూడెంట్స్‌ని భద్రాచలం హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం అందరి హెల్త్ కండిషన్ సేఫ్‌గానే ఉందని కలెక్టర్ చెప్పారు. ఈ ఇన్సిడెంట్‌పై సీఎం చంద్రబాబు స్పందిస్తూ ఎంక్వైరీకి ఆర్డర్ వేశారు.

40 ఏళ్ల నుంచే ఈ చేంజెస్ మస్ట్!
70 ఏళ్ల వయసులో జ్ఞాపకశక్తి చెడిపోకుండా డిమెన్షియా నుండి కాపాడుకోవాలంటే 40 ఏళ్ల నుంచే బ్రెయిన్ హెల్త్ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు. 40s మరియు 50s లో ఉండే బిపి, కొలెస్ట్రాల్, షుగర్, ఒబెసిటీ, డిప్రెషన్ వల్ల మెదడు కణాలు దెబ్బతింటాయి. వీటిని అదుపు చేయడానికి వారానికి కనీసం 150 నిమిషాల ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేయాలి. హెల్తీ ఫుడ్ తినడం, మంచి నిద్ర, స్మోకింగ్ మానడం, రీడింగ్ లేదా పజిల్స్ ద్వారా కొత్త స్కిల్స్ నేర్చుకోవడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ activeగా ఉండి జ్ఞాపకశక్తి సరిగ్గా ఉంటుంది.

యువతి కుటుంబానికి అండగా ఉంటాం: సీతక్క
TG: గిరిజన యువతుల భద్రత కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న ఆదివాసీ యువతులకు అండగా ఉండేలా ఈ కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో అత్యాచారం, హత్యకు గురైన భద్రాద్రికొత్తగూడెం జిల్లా యువతి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు. బాధిత కుటుంబానికి వ్యవసాయ భూమి, ఇందిరమ్మ ఇల్లు, ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం, ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఒత్తిడిని జయించాలంటే క్రీడలు అవసరం: DGP
AP: పోలీసు విధుల్లో ఫిట్నెస్‌తో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని DGP హరీష్‌కుమార్ గుప్తా సూచించారు. మంగళగిరిలోని APSP 6వ బెటాలియన్ మైదానంలో ఏపీ పోలీస్ శాఖ తొలిసారిగా నిర్వహిస్తున్న ‘స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026’ను ఆయన ప్రారంభించారు. క్రీడల ద్వారా ఒత్తిడిని అధిగమించడం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, సమన్వయంతో పనిచేయడం వంటి లక్షణాలు మెరుగుపడతాయని డీజీపీ పేర్కొన్నారు. ఈ నెల 4 వరకు జరిగే పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,900 మంది పోలీసు క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు.

Gen-Zకి FOMO కంటే JOMO ఎందుకు అవసరం?
ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్తుంటే మనం కూడా వెళ్లాలి, అందరూ ఏదో ట్రెండ్ ఫాలో అవుతుంటే మనం కూడా చేయాలి.. ఈ ఫీలింగ్‌నే FOMO(Fear Of Missing Out) అంటాం. కానీ Gen-Zలో దీనికి విరుద్ధంగా JOMO అంటే Joy of Missing Out అనే ఆలోచన పెరుగుతోంది. అంటే ప్రతి ప్లాన్‌లో ఉండాల్సిన అవసరం లేదని, సోషల్ మీడియాలో ప్రతి అప్‌డేట్ తెలుసుకోవాల్సిన పనిలేదని. ఇలా మన టైమ్‌ను మనకు నచ్చిన పనులకు కేటాయిస్తే డిజిటల్ డిస్ట్రాక్షన్ తగ్గి, ఫోకస్, ప్రశాంతత పెరుగుతాయి. అందరినీ ఫాలో అవ్వడం కంటే.. మనకు నచ్చినట్టుగా ఉండటమే మంచి ఛాయిస్.

నిర్మల్‌లో నాగర్‌కర్నూల్ క్రీడాకారుల ఘన విజయం
TG: రాష్ట్రస్థాయి ఆత్యాపాత్య క్రీడల్లో నాగర్‌కర్నూల్ జిల్లా జట్టు సత్తా చాటింది. నిర్మల్ జిల్లా NTR మినీ స్టేడియంలో నిర్వహించిన జూనియర్ రాష్ట్రస్థాయి ఆత్యాపాత్య టోర్నమెంట్‌లో నాగర్‌కర్నూల్ బాలికల జట్టు అద్భుత ప్రతిభ కనబరిచింది. ఫైనల్‌లో నిర్మల్ జట్టును ఓడించి ప్రథమ బహుమతి సాధించింది. బాలుర జట్టు కూడా రాణించి తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ వివరాలను వ్యాయామ ఉపాధ్యాయులు అంజి తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను, కోచ్‌లను పలువురు అభినందించారు.

భూముల పేరుతో బురద రాజకీయాలు: పొంగులేటి
TG: 22ఏ భూములపై ప్రతిపక్షాల ఆరోపణలు బురదచల్లే ప్రయత్నమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నిషేధిత భూముల జాబితాలో సమస్యలను పరిష్కరించిన తర్వాత కూడా విమర్శలు చేయడం సరికాదన్నారు. హైదరాబాద్ సచివాలయంలోని తన ఛాంబర్‌లో మీడియాతో మంత్రి మాట్లాడారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో 22ఏ భూములపై వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. సమగ్ర భూసర్వేతో ఆబాదీ, పట్టా, ప్రభుత్వ భూముల సమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న జాబితానే అధికారులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారన్నారు.

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?
వందమంది మనల్ని మెచ్చుకున్నా.. ఒక్కరు “బాగా చేయలేదు” అంటే ఆ మాటే రోజంతా మన తలలో తిరుగుతుంది. ఇది మనలో ఏదో లోపం ఉందని కాదు.. మెదడు నెగెటివ్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా పనిచేయడమే కారణం. ప్రమాదాలు, విమర్శలు, తిరస్కరణలు గుర్తుపెట్టుకోవడం మనుగడకు ఉపయోగపడేది. అందుకే మంచి అనుభవాల కంటే చెడు మాటలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. అయితే ప్రతి కామెంట్ నిజం కాదు. ఒక్కరి అభిప్రాయాన్ని మన విలువకు కొలమానంగా మార్చుకుంటే.. వంద నిజమైన ప్రశంసల విలువను మనమే తగ్గించినట్టే. అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే.

మనిషి మారిపోయాడా.. లేక పరిస్థితులే మార్చాయా?
ఒకప్పుడు ఎంతో క్లోజ్‌గా ఉన్న వ్యక్తి.. ఇప్పుడు ఎందుకు పూర్తిగా మారిపోయినట్టు అనిపిస్తాడు? నిజానికి మనిషి ఒక్కసారిగా మారిపోడు. ఎదురైన అనుభవాలు, బాధలు, బాధ్యతలు, కొత్త పరిచయాలు.. ఇవన్నీ అతని ఆలోచనల్ని, ప్రవర్తనని నెమ్మదిగా మార్చుతాయి. కొన్నిసార్లు పరిస్థితులకు తగ్గట్టు మారడం అవసరం కూడా. అందుకే ఎవరో మారిపోయారని అనుకునే ముందు.. వాళ్లను మార్చిన పరిస్థితులేంటో కూడా ఒక్కసారి ఆలోచించాలి. మనిషిని అర్థం చేసుకోవాలంటే.. అతని ప్రవర్తన మాత్రమే కాదు, అతను దాటిన దారిని కూడా చూడాలి.

Gen Z Instagram గ్రిడ్‌ను ఎందుకు ‘Ghost’ చేస్తోంది?
ఒకప్పుడు Instagramలో ఏ చిన్న విషయం జరిగినా పోస్ట్ చేయడం కామన్.. కానీ ఇప్పుడు Gen Zలో ఆ ట్రెండ్ మెల్లగా మారుతోంది. చాలామంది పబ్లిక్ గ్రిడ్‌లో పోస్టులు పెట్టడం తగ్గించి, Stories, Close Friends, DMs, ప్రైవేట్ గ్రూపుల్లోనే ఎక్కువగా షేర్ చేస్తున్నారు. దీనినే “Ghost-posting” అని పిలుస్తున్నారు. కారణం కూడా ఆసక్తికరమే.. ప్రతి పోస్ట్‌కు లైక్స్, వ్యూస్, ఇతరుల అభిప్రాయాల గురించి ఆలోచించడం, సోషల్ మీడియా ఫాటిగ్ పెరగడం. అందరికీ కనిపించకుండా తమకు నచ్చిన వాళ్లతో మాత్రమే షేర్ చేయడం కొత్త ట్రెండ్‌గా మారుతోంది.