← Back to news

నేషనల్ హైవే అయినా.. ప్రయాణం నరకం

By DK· 2d ago
నేషనల్ హైవే అయినా.. ప్రయాణం నరకం

TG: పేరుకే నేషనల్ హైవే, గుంతలతో ప్రయాణికులకు నరకయాతన తప్పడం లేదు. నిర్మల్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుష్టి నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వరకు రహదారి అధ్వానంగా మారడంతో ప్రయాణ సమయం భారీగా పెరిగింది. గతంలో గంట పది నిమిషాల్లో చేరే మార్గంలో ప్రస్తుతం రెండుగంటల వరకు పడుతోంది. నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుష్టి గ్రామం వద్ద వంతెనపై భారీ గుంత ఏర్పడటంతో ఒకవైపు మాత్రమే వాహనాలు సాగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య పెరిగింది.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 9h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.