← Back to news

అజయ్ కుమార్‌కు కీలక బాధ్యతలు

By Jaddu Udaykiran· 2d ago· Vizianagaram
అజయ్ కుమార్‌కు కీలక బాధ్యతలు

AP: విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన పి. అజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రిఫరీ బోర్డు చీఫ్ రిఫరీగా నియమితులయ్యారు. బొద్దాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ నిర్దేశకుడిగా పనిచేస్తున్న అజయ్ కుమార్‌ను చీఫ్ రిఫరీగా నియమిస్తూ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. 1990లో రాష్ట్రస్థాయి, 1993లో జాతీయస్థాయి రిఫరీగా ఎంపికైన ఆయన 33 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ఇప్పటివరకు 55 జాతీయస్థాయి పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.

అజయ్ కుమార్‌కు కీలక బాధ్యతలు
అజయ్ కుమార్‌కు కీలక బాధ్యతలు

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 9h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.