← Back to news

నిర్మల్‌లో నాగర్‌కర్నూల్ క్రీడాకారుల ఘన విజయం

By Srinivas· 2d ago
నిర్మల్‌లో నాగర్‌కర్నూల్ క్రీడాకారుల ఘన విజయం

TG: రాష్ట్రస్థాయి ఆత్యాపాత్య క్రీడల్లో నాగర్‌కర్నూల్ జిల్లా జట్టు సత్తా చాటింది. నిర్మల్ జిల్లా NTR మినీ స్టేడియంలో నిర్వహించిన జూనియర్ రాష్ట్రస్థాయి ఆత్యాపాత్య టోర్నమెంట్‌లో నాగర్‌కర్నూల్ బాలికల జట్టు అద్భుత ప్రతిభ కనబరిచింది. ఫైనల్‌లో నిర్మల్ జట్టును ఓడించి ప్రథమ బహుమతి సాధించింది. బాలుర జట్టు కూడా రాణించి తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ వివరాలను వ్యాయామ ఉపాధ్యాయులు అంజి తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను, కోచ్‌లను పలువురు అభినందించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 9h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.