Latest

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయండి: మంత్రులకు ప్రధాని సూచన
ఢిల్లీలో యువత, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో యంగ్ జనరేషన్ తో మంచి రిలేషన్స్ పెంచుకోవాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచించారు. క్యాబినెట్ మీట్ లో మాట్లా డుతూ... కోట్ల మంది యువకులు ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో మంత్రులందరూ యాక్టివ్ గా ఉండాలని, రీల్స్ చేస్తూ ఇంటరాక్టివ్ సెషన్స్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను యువతకు వివరించాలని మోదీ చెప్పారు.

ధర్మేంద్ర తప్పుకోవాల్సిన అవసరం లేదు: కేంద్రం
NEET పేపర్ లీకేజీ కలకలంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఆయన రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయని ఎన్డీటీవీ మీడియా సోర్సులు తెలియచేస్తున్నాయి. "రాజీనామా చేయడం అత్యంత తేలికైన నిర్ణయం" అని, ప్రభుత్వం మంత్రికి పూర్తి అండగా నిలుస్తుందని కేంద్ర వర్గాలు అన్నాయి. NTA లోపాలను సవరించి లీకేజీ గ్యాంగ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపాయి.

కోర్టు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు: సుప్రీం కోర్టు
ఇకపై కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు షేర్ చేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. కోర్టు పర్మిషన్ లేకుండా వీడియోలు పోస్ట్ చేసినా, మోనెటైజ్ చేసినా యాక్షన్ తప్పదని వార్నింగ్ ఇచ్చింది. కోర్టులేమీ 24 గంటలు నడిచే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ కావని జడ్జీలు గట్టిగా కామెంట్ చేశారు. ఈ విషయాన్నే తీవ్రంగా పరిగణించిన కోర్టు.. మెటా, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు నోటీసులు జారీ చేసింది. అయితే, నార్మల్ న్యూస్ రిపోర్టింగ్‌కి మాత్రం ఈ రూల్ వర్తించదని క్లారిటీ ఇచ్చింది.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరొకరి బలి!
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మళ్లీ ఊహించని యాక్సిడెంట్ జరిగింది. కోక్ ఓవెన్ బ్యాటరీ వద్ద రెండేళ్లుగా పనిచేయని ఎలక్ట్రికల్ బస్ బార్ మీద పడటంతో అనంత బార్వే (52) అనే కార్మికుడు సీరియస్‌గా ఇంజ్యూర్ అయ్యాడు. వెంటనే ప్రైవేట్ హాస్పిటల్‌కి షిఫ్ట్ చేసినా, ట్రీట్‌మెంట్ పొందుతూ చనిపోయాడు. రీసెంట్‌గా లాడర్ పేలి తొమ్మిది మంది చనిపోయిన ఇన్సిడెంట్ మరువకముందే ఈ ఘోరం జరిగింది. ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడమే కారణమని, కార్మికుల సేఫ్టీపై ప్లాంట్ మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టాలని యూనియన్ లీడర్స్ డిమాండ్ చేస్తున్నారు.
KCRతో కలిసి KTR బర్త్‌డే సెలబ్రేషన్స్..
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తన బర్త్‌డే వేడుకలను ఎర్రవల్లిలోని అగ్రికల్చరల్ ఫీల్డ్స్‌లో ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి జరుపుకున్నారు. తండ్రి KCR, భార్య శైలిమ, పిల్లలు హిమాన్షు, అలేఖ్యలతో కలిసి మొక్క నాటి నీళ్లు పోశారు. అనంతరం కుటుంబ సభ్యులందరూ కలిసి అక్కడ ఫోటోలు దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోస్ అండ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్- వేణుస్వామి
CJP పార్టీ ఫ్యూచర్ పై వేణుస్వామి షాకింగ్ అనాలిసిస్ చేశారు. ఈ పార్టీ జాతకంలో బుధాదిత్య, కాలసర్ప రాజయోగాలు ఉండటం వల్ల ఫ్యూచర్ లో క్రేజ్, పబ్లిసిటీ విపరీతంగా పెరుగుతాయని చెప్పారు. దీని ప్రభావంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 100% రాజీనామా చేసే చాన్స్ ఉందట. ఈ CJP వల్ల దాదాపు 90% నష్టం BJPకే జరుగుతుందని, భవిష్యత్తులో కేంద్రంలో ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా CJP కీ-రోల్ ప్లే చేస్తుందని చెప్పారు. అయితే ఈ పార్టీకి చెందిన ముగ్గురు లీడర్లు జైలుకి వెళ్లే సూచనలు కూడా ఉన్నాయని జోస్యం చెప్పారు.

రాత్రి భోజనం తర్వాత పండ్లు తింటున్నారా?
రాత్రి భోజనం చేసిన వెంటనే పండ్లు తింటే జీర్ణక్రియ మందగించి కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయని న్యూట్రిషియన్లు అంటున్నారు. కడుపులో ఆమ్లత్వం వల్ల పండ్లు పులియకపోయినా, ఆలస్యంగా జీర్ణమవ్వడం వల్ల అసౌకర్యం కలుగుతుంది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్(IBS), ఎసిడిటీ, అలసట, బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు రాత్రి భోజనం తర్వాత పండ్లకు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు. పండ్లను ఉదయం పూట ఖాళీ కడుపుతో లేదా భోజనానికి మధ్య సమయంలో తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

జంతర్ మంతర్ వద్ద ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్
జంతర్ మంతర్ వద్ద నీట్ నిరసన ప్రాంతంలో దిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. పాత నేరస్థులు, పరారీలో ఉన్నవారిని గుర్తించడానికి వీటిని కీలక మార్గాల్లో పెట్టారు. ఇవి నేరుగా పోలీసు డేటాబేస్‌తో అనుసంధానమై పనిచేస్తాయి. నిరసనకారులకు కాకుండా, అల్లర్లు సృష్టించే నేరస్థులను పట్టుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమని అధికారులు చెప్పారు. ఈ కెమెరాలు తీసిన ముఖాలను వెంటనే డేటాబేస్‌తో పోల్చి తగిన చర్యలు తీసుకుంటారు.

తలకిందులో ఇల్లు
బిహార్‌లోని ముజఫర్‌పుర్‌లో ఉన్న ఒక ఇల్లు అందరినీ ఆకట్టుకుంటోంది. పూర్తిగా తలకిందులుగా ఉండటమే దీని ప్రత్యేకత. అక్కడ ఉన్న బసంత్ ప్యాలెస్ హోటల్ దగ్గర ఈ వింతైన భవనాన్ని కట్టారు. సందర్శకులను పెంచుకునేందుకు హోటల్ యజమాని దీనిని ప్రత్యేకంగా నిర్మించారు. విదేశాల్లో ఉండే ఇలాంటి భవనం తమ ఊళ్లోనే ఉండటంతో జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సరదాగా ఫోటోలు, వీడియోలు తీస్తూ రీల్స్ చేస్తున్నారు.

వాట్సాప్ అకౌంట్ భద్రతకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
సైబర్ మోసాల నేపథ్యంలో వాట్సాప్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అకౌంట్‌ను భద్రంగా ఉంచేందుకు టూ-స్టెప్ వెరిఫికేషన్‌ను తప్పనిసరిగా ప్రారంభించాలి. తెలియని లింకులు, OTPలు, వెరిఫికేషన్ కోడ్‌లను ఎవరికీ పంచుకోకూడదు. అనుమానాస్పద సందేశాలు, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండడంతో పాటు యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

వామ్మో దయ్యం పక్షి
ప్రకృతి సృష్టిలో వింత జీవుల్లో ‘పొటూ’ పక్షి ఒకటి. దీన్నే ఘోస్ట్ బర్డ్ అంటే ‘దయ్యం పక్షి’ అని పిలుస్తారు. పెద్ద పసుపు రంగు కళ్ళు, విచిత్రమైన ఆకారంతో ఉండే ఈ పక్షి రాత్రివేళల్లో చేసే ఏడుపులాంటి అరుపులు వింటే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఇది కనీసం గూడు కూడా కట్టుకోదు. రక్షణ కోసం చెట్టు కొమ్మపై వాలి, కళ్ళు మూసుకుని ఎండిపోయిన కర్ర ముక్కలా మారిపోతుంది. ఎంత వెతికినా కంటికి దొరకనంతగా చెట్టులో లీనమైపోయే ఈ పక్షి ఎక్కువగా సెంట్రల్, సౌత్ అమెరికా అడవుల్లో కనిపిస్తుంది.
భార్య హత్య.. భర్తపై ఆరోపణలు
AP: అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం కొత్తపల్లిలో పద్మావతి అనే మహిళ హత్యకు గురైంది. ఈ ఘటనలో ఆమె భర్త సురేష్‌పై కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. 'తల్లికి వందనం' పథకం కింద వచ్చిన డబ్బు విషయంలో జరిగిన వివాదమే హత్యకు కారణమని మృతురాలి తల్లి కళావతి ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
2 ఇయర్స్ అయినా మారలేదు! వైరల్ వీడియో!
ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో 2024 జూన్ 24న పార్లమెంట్‌లో ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు విపక్షాలు "NEET.. Shame Shame" అని గట్టిగా నిరసన తెలిపాయి. కానీ రెండేళ్లు గడిచినా, ఈ రోజు (24 జులై 2026) వరకు ఆయన పేపర్ లీక్స్‌ని అసలు ఆపలేకపోయారు. ఆయన పూర్తిగా ఫెయిల్ అయ్యారని, అందుకే ఆయన రాజీనామా చేయాలని ఇప్పుడు దేశం మొత్తం డిమాండ్ చేస్తోంది.

రేషన్ కార్డు e-KYCకి ఈనెల 31 లాస్ట్ డేట్!
TG : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ చేసుకోవడానికి ఈనెల 31ని ప్రభుత్వం లాస్ట్ డేట్‌గా నిర్ణయించింది. వేలిముద్రలు పడక, సాంకేతిక సమస్యలతో కేవైసీ అవ్వక, ఒక్కో మండలంలో ఇంకా 1,000 నుంచి 2,000 వరకు రేషన్ కార్డులకు ఈ-కేవైసీ కాలేదు. ప్రభుత్వం రూల్స్ పేరుతో రేషన్ కార్డులను తొలగించే కుట్ర చేస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గడువులోగా పూర్తి చేయకపోతే రేషన్ సరుకులు నిలిపివేసే అవకాశం ఉండటంతో కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు.
847 పుష్‌అప్స్‌తో గిన్నిస్ రికార్డు
హర్యానాకు చెందిన 41 ఏళ్ల రోహ్‌తాష్ చౌదరీ నడుముపై 27 కిలోల బరువు పెట్టుకుని గంటలో 847 పుష్‌అప్స్ తీసి గిన్నిస్ రికార్డు సృష్టించాడు. గతంలో ఒక యాక్సిడెంట్ వల్ల రెండేళ్లు మంచానికే పరిమితమైన పట్టుదలతో కోలుకుని, పట్టుదలతో ప్రాక్టీస్ చేసి 'పుష్‌అప్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా సిరియా వ్యక్తి రికార్డును దాటి ప్రపంచ రికార్డు సాధించాడు. అతడి ప్రతిభకు గిన్నిస్ సంస్థ ప్రత్యేక సర్టిఫికెట్ అందించింది.

ఇందిరమ్మ ఇండ్లు జనావాసాల పరిధిలోనే ఉండాలి: రేవంత్ రెడ్డి
TG: హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్(CURE) పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్మించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పేదలకు ఊరికి దూరంగా కాకుండా అన్ని సదుపాయాలు ఉండేలా ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. ORR లోపల వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను తక్షణమే గుర్తించాలని అధికారులకు సూచించారు. ఆ స్థలాలను పేదల ఇళ్ల నిర్మాణానికి వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.

వృద్ధాప్యానికి చెక్ పెట్టాలన్న బిలియనీర్
అమెరికన్ టెక్ బిలియనీర్ బ్రయాన్ జాన్సన్ తాను ల్యాబ్‌లో తన సొంత 'బేబీ క్లోన్'ను సృష్టించినట్లు ప్రకటించారు. తన శరీర కణాలను పిండ దశకు మార్చి, భవిష్యత్తులో కొత్త అవయవాల తయారీ, ఔషధాల పరీక్షలు, యవ్వన కణాల చికిత్స కోసం ఉపయోగించాలనే లక్ష్యంతో ఈ ప్రయోగం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు మానవ క్లోనింగ్ విజయవంతమైందని శాస్త్రీయ ఆధారాలు లేవు. దీంతో బ్రయాన్ చేసిన ఈ ప్రకటనపై శాస్త్రవేత్తలు, నెటిజన్లలో తీవ్ర చర్చ సాగుతోంది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రేపే నిర్ణయం!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే తమ డిమాండ్‌పై ప్రభుత్వంతో చర్చలు జరిగాయని, దీనిపై రేపు మధ్యాహ్నం వరకు ప్రభుత్వం సమయం అడిగిందని CJP స్పోక్స్ పర్సన్ అశుతోష్ రంకా తెలిపారు. విద్యాశాఖ మంత్రిని త్వరలోనే తొలగిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే నీట్ వల్ల ఆత్మహత్యలకు పాల్పడిన అభ్యర్థుల కుటుంబాలకు పరిహారం అందించడం, విద్యార్థులపై నమోదైన FIRలు, కేసులను ఉపసంహరించుకోవడం అనే రెండు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిందని ఆయన స్పష్టం చేశారు.
జంతర్ మంతర్ వద్ద పోలీస్ రాజీనామా!
స్టూడెంట్స్ ప్రొటెస్ట్‌కు మద్దతుగా ఉత్తరాఖండ్ పోలీస్ కానిస్టేబుల్ షేర్ సింగ్ వినూత్నంగా నిరసన తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ స్టేజ్ పై యూనిఫామ్‌లోనే ప్రసంగిస్తూ, ఎగ్జామ్ పేపర్ లీకేజీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కుల కోసం పోరాడటం తిరుగుబాటు అయితే, తాను తిరుగుబాటుదారుడినేనని ప్రకటిస్తూ.. తన రాజీనామా లేఖను CJP ఫౌండర్ అభిజీత్ దీప్కేకు నేరుగా అందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

స్ట్రెస్ కంట్రోల్‌కు కొత్త మార్గం ‘ఫ్రిజ్ సిగరెట్’
ఒత్తిడి తగ్గించుకోవడానికి నేటితరం GEN-Z కొత్త అలవాటును ఎంచుకుంటోంది. సిగరెట్‌కు బదులుగా చల్లటి కూల్‌డ్రింక్స్ తాగి రిలీఫ్ పొందే ఈ పద్ధతిని 'ఫ్రిజ్ సిగరెట్' అంటున్నారు. మానసిక అలసట నుంచి బయటపడేందుకు మెదడు ఎంచుకునే మార్గం ఇదని నిపుణులు చెప్తున్నారు. అయితే తరచూ తాగుతుంటే శరీరంలో షుగర్, కెమికల్స్ ఎక్కువై ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనికి బదులుగా కొబ్బరినీళ్లు, హెర్బల్ టీ తాగడం లేదా కొద్దిసేపు నడవడం, స్నేహితులతో మాట్లాడటం ఇంకా మంచి మార్గాలు.

మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ లో చంద్రబాబు
AP: పోలవరం జిల్లా రంపచోడవరం ప్రభుత్వ హైస్కూల్లో ఈరోజు మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు తరగతి గదిలో విద్యార్ధులు, వారి తల్లితండ్రులు, టీచర్లతో మాట్లాడారు. విద్యార్థుల చదువు పురోగతి, ప్రోగ్రెస్ రిపోర్టు కార్డును స్వయంగా పరిశీలించారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 ఫొటోఫ్రేమ్ వద్ద విద్యార్థులు, వారి తల్లితండ్రులతో ఫోటోలు దిగారు. కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు.