Latest

తెలంగాణ అథ్లెటిక్స్‌లో గెలుపు.. నేషనల్స్‌లో ఎంట్రీ
Sports· 28 Aug 2026

తెలంగాణ అథ్లెటిక్స్‌లో గెలుపు.. నేషనల్స్‌లో ఎంట్రీ

TG: పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌కి చెందిన నల్లవెల్లి ఆనంది హనుమకొండలో జరిగిన తెలంగాణ స్టేట్ మీట్ అథ్లెటిక్స్ కాంపిటీషన్‌లో అదరగొట్టింది. అండర్-18 కేటగిరీలో 200, 400 మీటర్ల రన్నింగ్ రేస్‌లలో రెండు గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది. ఈ గెలుపుతో ఆనంది సెప్టెంబరులో పుదుచ్చేరిలో జరిగే సౌత్ జోన్ నేషనల్ మీట్‌కు సెలెక్ట్ అయింది. ఈ సక్సెస్ సాధించిన ఆనందికి తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ మెంబర్స్, కోచ్ సుబ్బారావు విష్ చేశారు. నేషనల్స్‌లో కూడా పతకాలు గెలవాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు.

విదేశీ రెస్క్యు టీంలకు నేపాల్ నో
Current Affairs· 28 Aug 2026

విదేశీ రెస్క్యు టీంలకు నేపాల్ నో

భారత్ (NDRF బృందాలు), చైనా, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు తమ సొంత డిజాస్టర్ రెస్క్యూ టీమ్‌లను నేరుగా రంగంలోకి దించుతామని ప్రతిపాదించాయి. కానీ నేపాల్ విదేశాంగ శాఖ ఈ ప్రపోజల్‌ను తిరస్కరించింది. తమ ఆర్మీ, పోలీస్ బలగాలు అన్వేషణ, రెస్క్యూ చర్యలను సమర్థవంతంగా నిర్వహించగలవని తెలిపింది. 2015లో భారీ భూకంపం వచ్చినప్పుడు అనేక దేశాల నుండి వందలాది రెస్క్యూ బృందాలు ఒకేసారి రావడం వల్ల క్షేత్రస్థాయిలో సమన్వయం లోపించి పెద్ద గందరగోళం నెలకొంది. ఈసారి ఆ తప్పు జరగకూడదని నేపాల్ భావిస్తోంది.

24 ఏళ్ల తర్వాత కొడుకుతో ఇంటి ముందు మహిళ ధర్నా
Local· 28 Aug 2026

24 ఏళ్ల తర్వాత కొడుకుతో ఇంటి ముందు మహిళ ధర్నా

గద్వాల పట్టణంలోని భీమ్‌నగర్ కాలనీలో ఓ మహిళ ధర్నా చేపట్టింది. 24 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో పని చేసే టైంలో యజమాని కుమారుడు తనపై లైంగికదాడి చేశారని, దాంతో తనకు కొడుకు పుట్టాడని వివరించింది. అతడే తన కొడుకుకు తండ్రి అని ఆరోపిస్తూ కొడుకుతో కలిసి ధర్నాకు దిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మాత్రం తను ఎలాంటి తప్పు చేయలేదని, నిజానిజాలు తేలడానికి డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధమేనని ప్రకటించడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.

మటన్ కావాలన్న కొడుకు..చంపేసిన తండ్రి
Crime· 28 Aug 2026

మటన్ కావాలన్న కొడుకు..చంపేసిన తండ్రి

పూణేలో ఘోరమైన ఘటన జరిగింది. 30 ఏళ్ల యువకుడు మహేష్ గైక్వాడ్‌ను అతని తండ్రే కొట్టి చంపేశాడు. దీనికి కారణం మటన్. శ్రావణమాసంలో కొన్ని కుటుంబాలు నాన్ వెజ్ తినరు. మహేష్ కుటుంబం కూడా అలాగే తినడం లేదు. కానీ ఇంట్లోనే మటన్ వండాలని అతను బలవంతం చేశాడు. ఈ విషయమై తండ్రీకొడుకుల మధ్య వాదన జరిగింది. దీంతో కోపంతో కొడుకును బాగా కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ మహేష్ చనిపోయాడు.

ఫ్రీడమ్ ఫైటర్స్ కథతో వెబ్ సిరీస్
Entertainment· 28 Aug 2026

ఫ్రీడమ్ ఫైటర్స్ కథతో వెబ్ సిరీస్

బ్రిటిష్ వాళ్లని ఎదిరించి ఆయుధాలు పట్టిన మన విప్లవ వీరుల రియల్ లైఫ్ స్టోరీతో వస్తున్న ‘The Revolution’ అనే వెబ్ సిరీస్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. సంజీవ్ సన్యాల్ రాసిన బుక్ ఆధారంగా డైరెక్టర్ నిఖిల్ అద్వానీ దీన్ని తెరకెక్కించారు. ఇందులో భువన్ బామ్, రోహిత్ సరాఫ్, ప్రతిభా రంతా, గుర్ఫతే పిర్జాదా మెయిన్ రోల్స్ చేశారు. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

తెలుగు స్టేట్స్ నుంచి బెంగళూరుకు కొత్త డైలీ ట్రైన్‌!
National· 28 Aug 2026

తెలుగు స్టేట్స్ నుంచి బెంగళూరుకు కొత్త డైలీ ట్రైన్‌!

వరంగల్‌, విజయవాడ ప్రయాణికులకు రైల్వే గుడ్‌న్యూస్‌ చెప్పింది. దానాపూర్‌–బెంగళూర్‌ స్పెషల్‌ ట్రైన్లను ఇకపై డెయిలీ ఎక్స్‌ప్రెస్‌లుగా నడపనున్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి వరంగల్‌, విజయవాడ నుంచి దానాపూర్‌, బెంగళూరుకు డైలీ ట్రైన్‌ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుంది. దానాపూర్‌–బెంగళూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (22365) వరంగల్‌కు రాత్రి 7.00, విజయవాడ 11.35 గం. చేరుతుంది. బెంగళూర్‌–దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (22366) విజయవాడకు సా. 2.55, వరంగల్‌కు 6.18 గం. చేరుతుంది. ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు ఈ మార్పు చేశారు.

APకి భారీ డిజిటల్ బూస్ట్.. విశాఖకు కొత్త కనెక్టివిటీ!
AP· 28 Aug 2026

APకి భారీ డిజిటల్ బూస్ట్.. విశాఖకు కొత్త కనెక్టివిటీ!

AP: రాష్ట్రానికి మరో భారీ డిజిటల్ ప్రాజెక్ట్ దక్కింది. ముంబై, చెన్నై తర్వాత దేశంలో మూడో అతిపెద్ద డిజిటల్ ల్యాండింగ్ హబ్‌గా ఏపీ ఎదగనుంది. విశాఖపట్నం కేంద్రంగా గూగుల్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, AI ఫెసిలిటీ రానున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా టెక్ దిగ్గజాలు సముద్రం కింద ఇంటర్నెట్ కేబుల్స్ ఏర్పాటు చేయనున్నాయి. ఆల్మోస్ట్ 3,600 కి.మీ I-2SEA కేబుల్‌తో విశాఖకు సింగపూర్, సౌత్‌ఈస్ట్ ఏషియాతో నేరుగా కనెక్టివిటీ వస్తుంది. 2029 చివరి నాటికి నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

అక్రమ బ్లాస్టింగ్‌ను నిలిపివేయాలి: గొంగళ్ల రంజిత్
Local· 28 Aug 2026

అక్రమ బ్లాస్టింగ్‌ను నిలిపివేయాలి: గొంగళ్ల రంజిత్

TG: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురంలో అక్రమ బ్లాస్టింగ్‌తో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీఆర్‌ఎస్ గద్వాల ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ మండిపడ్డారు. శుక్రవారం రైతులతో కలిసి బ్లాస్టింగ్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. క్రషర్ మిషన్, పేలుళ్ల కారణంగా ఇళ్లు బీటలు వారడంతో పాటు పంటలు, బోర్లు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ బ్లాస్టింగ్‌ను వెంటనే నిలిపివేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

రాఖీ పౌర్ణమి వేళ బీజేపీ నేతలతో ఆత్మీయ కలయిక
Local· 28 Aug 2026

రాఖీ పౌర్ణమి వేళ బీజేపీ నేతలతో ఆత్మీయ కలయిక

TG: రంగారెడ్డి జిల్లా హఫీజ్‌పేట్ డివిజన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఆత్మీయంగా జరిగాయి. హఫీజ్‌పేట్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనుషా మహేశ్ యాదవ్ శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాఖీ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని అనుషా మహేశ్ యాదవ్ పేర్కొన్నారు.

8 ఏళ్ల తెలుగు అమ్మాయి చెస్‌లో వరల్డ్ రికార్డ్
Sports· 28 Aug 2026

8 ఏళ్ల తెలుగు అమ్మాయి చెస్‌లో వరల్డ్ రికార్డ్

డల్లాస్‌లో ఉండే తెలుగు చిన్నారి సరయు తలపనేని చెస్‌లో హిస్టరీ క్రియేట్ చేసింది. 3వ తరగతి చదువుతున్న ఈ 8 ఏళ్ల పాప, కొలంబియాలో జరిగిన ‘పాన్-అమెరికన్’ చెస్ కాంపిటీషన్‌లో 9కి 9 రౌండ్లు గెలిచి కాంటినెంటల్ ఛాంపియన్‌గా నిలిచింది. ఏడు దేశాల ప్లేయర్లతో ఆడి ఒక్క గేమ్ కూడా ఓడిపోకుండా పర్ఫెక్ట్ స్కోర్ సాధించింది. వరల్డ్ కప్‌కు క్వాలిఫై అవ్వడమే కాక, ఫిడే విమెన్‌ క్యాండిడేట్‌ మాస్టర్‌ (WCM) టైటిల్ రేసులో నిలిచిన యంగెస్ట్ ప్లేయర్లలో ఒకరిగా నిలిచింది.

డ్యూటీలోనే రాఖీ పండుగ
TG· 28 Aug 2026

డ్యూటీలోనే రాఖీ పండుగ

TG: నల్గొండ ఆర్టీసీ డిపోలో రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్కాతమ్ముళ్ల అనురాగంతో పాటు ప్రజా సేవకు అంకితభావం చాటిచెప్పే ముచ్చటైన దృశ్యం కనిపించింది. అదే డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న ప్రవీల, డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న తన తమ్ముడు శ్రీనుకు డిపో ప్రాంగణంలోనే రాఖీ కట్టారు. పండుగ రోజైనా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యతతో ఇద్దరూ విధులకు హాజరయ్యారు. అక్క ప్రవీల తమ్ముడికి రాఖీ కట్టి, మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇద్దరూ తమ తమ విధుల్లో నిమగ్నమయ్యారు.

సైబర్ మోసాల్లో మహిళ బ్యాంక్ అకౌంట్..భయంతో ఆత్మహత్య
Crime· 28 Aug 2026

సైబర్ మోసాల్లో మహిళ బ్యాంక్ అకౌంట్..భయంతో ఆత్మహత్య

థానే జిల్లా డొంబివలి(తూర్పు) సైరామ్ సొసైటీలో దేవికా అర్ముగం పండరం(38) సూసైడ్ చేసుకున్నారు. ఆమె బ్యాంక్ అకౌంట్‌ను సైబర్ మోసాల్లో వాడారని రాజస్థాన్‌లోని చురు పోలీసులు ఆగస్టు 8న ఆమె ఇంటికి వచ్చి నోటీసు ఇచ్చారు. దీనిపై క్లారిటీ కోసం ఆమె థానే పోలీస్ కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ విభాగానికి వెళ్లారు. అక్కడ హర్యానా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, తమిళనాడు వంటి అనేక రాష్ట్రాల్లో ఆమెపై సైబర్ మోసం కేసులున్నాయని చెప్పారు. దీంతో భయపడ్డ ఆమె బ్లేడ్‌తో చేయి, గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

అదే మా అన్న నాకిచ్చే అతిపెద్ద సపోర్ట్: సుప్రియ
Entertainment· 28 Aug 2026

అదే మా అన్న నాకిచ్చే అతిపెద్ద సపోర్ట్: సుప్రియ

రాఖీ పండుగ సందర్భంగా హీరో సుమంత్ చెల్లెలు సుప్రియ అన్నతో తన బాండింగ్‌ని పంచుకున్నారు. "చిన్నప్పుడు సుమంత్ చాలా సైలెంట్‌గా ఉంటే, నేను మాత్రం బాగా అల్లరి చేసేదాన్ని. స్కూల్ రోజుల్లో విడివిడిగానే ఉన్నా, పెద్దయ్యే కొద్దీ మా మధ్య బాండింగ్ బాగా పెరిగింది" అని సుప్రియ తెలిపారు. తనకు పెద్ద పెద్ద గిఫ్ట్‌లు ఇచ్చే అలవాటు లేదని, రాఖీ కట్టి ఒక్కరికొక్కరు తోడుగా ఉన్నామని చెప్పుకోవడమే అసలైన పండుగ అని సుప్రియ అన్నారు. సుమంత్ తప్పొప్పులను సూటిగా చెబుతాడని, ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాడని ఆమె చెప్పింది.

చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త అంబులెన్స్
Local· 28 Aug 2026

చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త అంబులెన్స్

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ ప్రజలకు అత్యవసర వైద్య సేవలను మరింత వేగంగా అందించేందుకు కొత్త అంబులెన్స్ అందుబాటులోకి వచ్చింది. అరకు ఎంపీ తనూజారాణి తన ఎంపీ ల్యాడ్స్ నిధులతో చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌ను సమకూర్చారు. ఈ సేవలు నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి శుభం నోఖ్వాల్ మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని మారుమూల గిరిజన ప్రాంత ప్రజలకు అత్యవసర సమయాలలో ఈ అంబులెన్స్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

ఇండియా పోస్ట్‌లో 25 వేలకుపైగా GDS ఉద్యోగాలు
Jobs· 28 Aug 2026

ఇండియా పోస్ట్‌లో 25 వేలకుపైగా GDS ఉద్యోగాలు

ఇండియా పోస్ట్‌లో GDS, BPM, ABPM పోస్టులకు 25,000+ ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 10th క్లాస్ పాస్ అయినవారు అప్లై చేయొచ్చు. ఏజ్ 18–40 ఏళ్లు మధ్య ఉండాలి. రిజిస్ట్రేషన్ ఆగస్ట్ 31-సెప్టెంబర్ 19 లోపు చేసుకోవాలి. అప్లికేషన్ సెప్టెంబర్ 2 నుంచి 21 వరకు ఉంటుంది. జనరల్/OBC/EWS అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది. SC/ST/PwD, మహిళలకు ఎటువంటి ఫీజు లేదు. సెలెక్షన్ 10th మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉంటుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ <a href="https://www.indiapost.gov.in/gdsonlineengagement">Click</a> చేయండి.

వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: ఎమ్మార్పీఎస్
Local· 28 Aug 2026

వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: ఎమ్మార్పీఎస్

TG: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్‌లో వికలాంగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి బుర్రి సతీష్ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేయవద్దని సూచించారు.

రాఖీ వేడుకల్లో గంప గోవర్ధన్
Local· 28 Aug 2026

రాఖీ వేడుకల్లో గంప గోవర్ధన్

TG: కామారెడ్డి జిల్లా మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ రాఖీ పౌర్ణమి వేడుకలను తన అక్కలతో కలిసి ఆత్మీయంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అక్కలు సుగుణ, ప్రమీల, విమల గంప గోవర్ధన్‌కు రాఖీలు కట్టారు. అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలను పంచుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా రాఖీ వేడుకలు నిర్వహించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్కల నుంచి రాఖీలు కట్టించుకున్న గంప గోవర్ధన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

నీళ్లు విడుదలైనా పొలాలకు చేరడం లేదు.. రైతుల ఆవేదన
Local· 28 Aug 2026

నీళ్లు విడుదలైనా పొలాలకు చేరడం లేదు.. రైతుల ఆవేదన

TG: జోగులాంబగద్వాల జిల్లాలో RDS (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) కెనాల్‌ దుస్థితి రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కెనాల్‌కు సాగునీరు విడుదల చేసినా కాలువలో నీరు సక్రమంగా ప్రవహించి పొలాలకు చేరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెనాల్‌ కంపచెట్లు, ముళ్లపొదలతో నిండిపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు. పలుచోట్ల లైనింగ్‌ దెబ్బతిని పెచ్చులూడిపోవడంతో నీరు లీకై వృథాగా పోయే ప్రమాదం ఉందన్నారు. సాగు సమయంలో నీరు సక్రమంగా అందకపోతే పంటలకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రాఖీ కట్టి రోడ్డు భద్రతపై అవగాహన
Local· 28 Aug 2026

రాఖీ కట్టి రోడ్డు భద్రతపై అవగాహన

TG: “అన్నా.. హెల్మెట్ పెట్టుకో.. నీ కుటుంబం నీ కోసం ఎదురుచూస్తోంది” అంటూ మహిళా ట్రాఫిక్ పోలీసులు రాఖీలు కట్టి చెప్పిన మాటలు కామారెడ్డిలో వాహనదారులను ఆలోచింపజేశాయి. రాఖీ పౌర్ణమి సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీసులు హెల్మెట్ వినియోగంపై వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై వచ్చిన వారిని మహిళా ట్రాఫిక్ పోలీసులు ఆపి రాఖీలు కట్టి రోడ్డు భద్రతపై సూచనలు చేశారు. చలానాలు విధించడం కంటే ప్రజల్లో బాధ్యత, భద్రతపై చైతన్యం కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమం చేపట్టారు.

బురద రోడ్డుపై రాకపోకలు
AP· 28 Aug 2026

బురద రోడ్డుపై రాకపోకలు

AP: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం పాత పూచిరాల గ్రామంలో రెండుకిలోమీటర్ల మట్టి రోడ్డుతో 150 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రేపాకగొమ్ము పంచాయతీ పరిధిలోని ఈ రహదారి కొద్దిపాటి వర్షానికే బురదమయంగా మారడంతో రాకపోకలు దుర్భరంగా మారుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం ఉందని, అత్యవసర సమయాల్లో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

అంగన్‌వాడీలో 231 టీచర్, ఆయా పోస్టులు
TG· 28 Aug 2026

అంగన్‌వాడీలో 231 టీచర్, ఆయా పోస్టులు

TG: మహబూబాబాద్ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 231 పోస్టులున్నాయి. అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు మినిమమ్ Intermediate పాస్ అయ్యుండాలి. హెల్పర్ పోస్టులకు ఇంటర్ లేదా 10వ తరగతి పాస్ కావాలి. ఏజ్ 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. సెప్టెంబర్ 3 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్ చేసి, అకాడెమిక్ మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం <a href="https://wdcw.tg.nic.in/">వెబ్‌సైట్‌</a>ను చుడండి.