Latest

Singlesపై RGV క్రేజీ పోస్ట్!
డైరెక్టర్ RGV మళ్లీ ఓ ఇంట్రెస్టింగ్<a href="https://x.com/RGVzoomin/status/2093167410920689707/photo/1"> పోస్ట్</a> పెట్టారు. "ప్రతి సక్సెస్‌ఫుల్ అబ్బాయి వెనుక ఒక అమ్మాయి ఉంటుంది" అనే మాటను ఆయన అస్సలు ఒప్పుకోనని చెప్పారు. సింగిల్‌గా ఉంటూనే లైఫ్‌లో నెక్స్ట్ లెవెల్ సాధించిన వాళ్లు చాలామంది ఉన్నారని ట్వీట్ చేశారు. టాటా, బాటా, APJ అబ్దుల్ కలాం, సల్మాన్ ఖాన్, రాహుల్, యోగి, బాబా రాందేవ్ లను ఎగ్జాంపుల్స్‌గా చూపించారు. సక్సెస్‌కి పెళ్లితో సంబంధం లేదని, సింగిల్స్ కూడా గ్రేట్ అని ప్రూవ్ చేశారని తన పోస్ట్ ద్వారా తెలిపారు.

రూ.100 కోట్ల హిట్ మూవీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
మమితా బైజు, నివిన్ పౌలీ జంటగా నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ మూవీ మలయాళంలో రిలీజైన వారం రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ హిట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులోకి తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
కర్ణాటక మంత్రి రాజీనామా..ఆపై కన్నీళ్లు
కర్ణాటక ప్లానింగ్, గణాంకాల శాఖ మంత్రి బి.నాగేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అవినీతి ఆరోపణలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి చెడ్డపేరు తేకూడదని ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పారు. బీజేపీ మనువాద రాజకీయాలకు తను బలయ్యానని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.

బీఎస్పీ కర్నూలు జిల్లా కొత్త అధ్యక్షుడి నియామకం
బహుజన సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా కొత్త అధ్యక్షుడిగా ఆదోనికి చెందిన మలిగే రామలింగయ్యను నియమించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతం కుమార్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. గతంలో అధ్యక్షుడిగా ఉన్న సామేలును పార్లమెంటరీ ఇన్‌ఛార్జిగా నియమిస్తూ ఆదేశాలిచ్చారు.

భారీగా డ్రై గంజాయి పట్టివేత
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద పోలీసులు భారీగా డ్రై గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని చిత్రకొండ నుంచి గంజాయిని కారులో రాజమహేంద్రవరం మీదుగా ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, గంజాయి రవాణా వెనుక ఉన్న ఇతర వ్యక్తులు, సరఫరా నెట్‌వర్క్‌పై కూడా ఆరా తీస్తున్నట్లు డి.ఎస్.పి జీవన తెలిపారు.

ఆకట్టుకున్న వృక్ష రక్షాబంధన్
వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ సందర్భంగా వృక్ష రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ హరిత దళ క్లబ్(ఎన్జీసీ), జూనియర్ రెడ్ క్రాస్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలోని మొక్కలకు రాఖీలు కట్టి వాటిని సోదరీమణుల్లా సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్ టి.హేమారావు, ఎస్ఎంసి చైర్మన్ బి.లక్ష్మిపతి, కొయ్యల శ్రీనివాసరావు, ఎన్.మంగరాజు పాల్గొన్నారు.

భార్య చదివిన బడికి..తనవంతు తోడ్పాటు
భార్య తనకు దూరమైనా ఆమె సజీవంగా ఉంచాలన్న సంకల్పం కలిగింది భర్తకు. భార్య చదువుకున్న బడి ప్రాంగణంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం లైబ్రరీ, కంప్యూటర్ గదుల నిర్మాణానికి పూనుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణానికి చెందిన వ్యాపారి గంధం ప్రసాద్(బాలరాజు) భూమిపూజ చేసి అందరికీ స్ఫూర్తి పంచారు.

పారిశుద్ధ్య సమస్యలపై అధికారుల దృష్టి సారించాలి
గుండ్లపల్లి గ్రామంలో పలు ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల సమీపంలోని మురికి కాలువల్లో మురుగునీరు నిలిచిపోవడంతో దోమలు, ఈగలు పెరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల పక్కన పేరుకుపోయిన వ్యర్థాలతో దుర్వాసన వస్తోందని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి చెత్తను తొలగించి, కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచాలని కోరుతున్నారు.

అండర్‌వేర్‌ను మట్టిలో ఎందుకు పాతిపెట్టారు? 😳
వినడానికి వింతగా ఉన్నా.. స్విట్జర్లాండ్‌లో 1,000 మంది తమ కాటన్ అండర్‌వేర్‌ను మట్టిలో పాతిపెట్టారు. నేలలో జీవం ఎంత యాక్టివ్‌గా ఉందో తెలుసుకోవడానికి సైంటిస్టులు ఇలా చేశారు. రెండు నెలల తర్వాత వాటిని బయటకు తీసి ఎంతవరకు కుళ్లిపోయాయో చూశారు. ఎక్కువగా కుళ్లిపోయిన చోట మట్టిలో ఉండే జీవుల యాక్టివిటీ ఎక్కువగా ఉన్నట్టు అర్థం. గార్డెన్లలో అండర్‌వేర్ వేగంగా కుళ్లిపోగా.. లాన్లలో నెమ్మదిగా కుళ్లింది. అంటే మనం ఊహించని విధంగా అండర్‌వేర్‌తో కూడా మట్టి ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చన్నమాట.

ట్రోలర్స్‌కి కౌంటర్ ఇచ్చిన కృతి సనన్
యాడ్‌లో వేసుకున్న డ్రెస్, పెట్ డాగ్‌కి రాఖీ కట్టడంపై ట్రోల్స్ చేసిన వాళ్లకు హీరోయిన్ కృతి సనన్ ఇన్‌స్టాగ్రామ్‌లో క్రేజీ పోస్ట్‌తో కౌంటర్ ఇచ్చింది. తన చెల్లెలు నూపుర్ సనన్ తో ఒకరికొకరు రాఖీ కట్టుకున్న పిక్ షేర్ చేస్తూ, 'రాఖీ ఫ్యాషన్ కమిటీ ఇంకా డిస్కషన్‌లోనే ఉన్నట్టుంది. కానీ మేము మాత్రం రియల్ ఎమోషన్స్‌పైనే ఫోకస్ చేశాం' అంటూ పోస్ట్ చేసింది. వేసుకునే డ్రెస్సులని బట్టి కల్చర్‌ని జడ్జ్ చేయకూడదని, పండుగల్లో ఎమోషన్సే ముఖ్యమని అంటోంది.

కస్తూర్బా విద్యార్థినులకు డ్రెస్‌ల అందజేత
రక్షాబంధన్ సందర్భంగా నందిపేట్ కస్తూర్బా బాలికల కళాశాలలో శుక్రవారం రాఖీ వేడుకలు నిర్వహించారు. సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం విద్యార్థినులతో మాట్లాడారు. 314 మంది విద్యార్థినుల సమస్యలు, వసతులపై ఆరా తీసి, 20 మంది విద్యార్థినులకు ఉచితంగా డ్రెస్సులు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేసి, భోజనం నాణ్యతను పరిశీలించారు.
సంకిలిలో రేపు చెరుకు రైతుల సమావేశం
విజయనగరం జిల్లా రేగడి ఆమదాలవలస మండలం సంకిలి గ్రామంలో ఉన్న చక్కెర కర్మగాన్ని ఎల్ నినో ప్రభావం వల్ల నిలిపేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. దీనిపై చెరుకు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు రేపు(శనివారం) ఉదయం 10 గంటలకు సంకిలి గ్రామం హైస్కూల్ ఎదురుగా ఉన్న స్థలంలో ఆంధ్రప్రదేశ్ చెరకు రైతుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు సంఘం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు.

దుగ్గిరాల మండలంలో బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి
మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం పెదపాలెం, పెదకొండూరు, గొడవర్రు గ్రామాలను కలుపుతూ నిర్మించిన బీటీ రోడ్డు పనులు పూర్తయ్యాయి. రూ.2.88 కోట్ల నాబార్డ్ నిధులతో 5 కిలోమీటర్లకు పైగా ఈ రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డుతో రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలకు ప్రయాణం సులభం కానుంది. త్వరలో రహదారిని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఇంటర్ సెకండియర్(ఎంపీసీ) స్టూడెంట్ వనం అఖిల రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించింది. ఈ నెల 26, 27వ తేదీల్లో హనుమకొండలో జరిగిన 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-20 హైజంప్ విభాగంలో ఫస్ట్ ప్లేస్ పొందింది. ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్‌కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థినిని అభినందించారు.
పండగపూట ఆర్టీసీ బాదుడు
TG: హైదరాబాద్ నుంచి కరీంనగర్ సాధారణ రోజుల్లో రూ.290 ఉంటే రాఖీ రోజు రూ.400కు పెంచడంపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రాఖీ పండుగ పేరుతో ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో చార్జీల బాదుడు ఏంటని ప్రశ్నిస్తున్నారు. పండుగల పేరుతో ఆర్టీసీ ఇష్టానుసారంగా చార్జీలు పెంచడం సరికాదంటున్నారు. ఆర్టీసీని లాభాల బాటలో పెట్టాలంటే ఇలా అదనంగా వసూళ్లు చేయాలా అని ప్రశ్నిస్తున్నారు.

ధర్మారం ఎస్‌ఐగా ఎంబడి శ్రీకాంత్
పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐగా ఎంబడి శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని, ఏవైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించినట్లు సమాచారం.
రోడ్డుపై బస్సు ఆపి..తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
TG: రాఖీ పండగ వేళ ఒక అక్క తన తమ్ముడి కోసం క్రేజీ మూమెంట్ క్రియేట్ చేసింది. గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న RTC డ్రైవర్ రాజు కరీంనగర్ తిమ్మాపూర్ దగ్గర డ్యూటీలో ఉన్నాడు. అతని అక్క స్వప్న, హైవేపై బస్సు ఆపించి మరీ తన తమ్ముడికి రాఖీ కట్టింది. రోడ్డుపైన జరిగిన ఈ క్యూట్ అండ్ ఎమోషనల్ సీన్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

CM రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టిన మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు
TG: రాఖీ పండుగ సందర్భంగా CM రేవంత్‌రెడ్డిని మహిళా ప్రతినిధులు, నేతలు, స్టూడెంట్స్ కలిశారు. రేవంత్‌రెడ్డికి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి, కమిషన్ సభ్యులు రాఖీలు కట్టారు. వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, బ్రహ్మకుమారీలు, మహిళా కాంగ్రెస్ నాయకులు కూడా సీఎంకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్‌రెడ్డి కూడా వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్పారు.

చంద్రబాబుకు మహిళా నేతల రాఖీ
AP: రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. మంత్రి సవిత, మాజీ మంత్రి పీతల సుజాత, ఎన్టీఆర్ జిల్లా TDP అధ్యక్షురాలు గద్దె అనురాధ, టీడీపీ స్టేట్ సెక్రటరీ ఆచంట సునీత సీఎంకు రాఖీ కట్టారు. తరువాత చంద్రబాబు వారికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ అథ్లెటిక్స్‌లో గెలుపు.. నేషనల్స్‌లో ఎంట్రీ
TG: పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌కి చెందిన నల్లవెల్లి ఆనంది హనుమకొండలో జరిగిన తెలంగాణ స్టేట్ మీట్ అథ్లెటిక్స్ కాంపిటీషన్‌లో అదరగొట్టింది. అండర్-18 కేటగిరీలో 200, 400 మీటర్ల రన్నింగ్ రేస్‌లలో రెండు గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది. ఈ గెలుపుతో ఆనంది సెప్టెంబరులో పుదుచ్చేరిలో జరిగే సౌత్ జోన్ నేషనల్ మీట్‌కు సెలెక్ట్ అయింది. ఈ సక్సెస్ సాధించిన ఆనందికి తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ మెంబర్స్, కోచ్ సుబ్బారావు విష్ చేశారు. నేషనల్స్‌లో కూడా పతకాలు గెలవాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు.

విదేశీ రెస్క్యు టీంలకు నేపాల్ నో
భారత్ (NDRF బృందాలు), చైనా, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు తమ సొంత డిజాస్టర్ రెస్క్యూ టీమ్‌లను నేరుగా రంగంలోకి దించుతామని ప్రతిపాదించాయి. కానీ నేపాల్ విదేశాంగ శాఖ ఈ ప్రపోజల్‌ను తిరస్కరించింది. తమ ఆర్మీ, పోలీస్ బలగాలు అన్వేషణ, రెస్క్యూ చర్యలను సమర్థవంతంగా నిర్వహించగలవని తెలిపింది. 2015లో భారీ భూకంపం వచ్చినప్పుడు అనేక దేశాల నుండి వందలాది రెస్క్యూ బృందాలు ఒకేసారి రావడం వల్ల క్షేత్రస్థాయిలో సమన్వయం లోపించి పెద్ద గందరగోళం నెలకొంది. ఈసారి ఆ తప్పు జరగకూడదని నేపాల్ భావిస్తోంది.