AP· 18 Jul 2026
ఎల్‌నినో ఎఫెక్ట్.. ఎండిపోతున్న పంటలు
AP: ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ సాగు తీవ్ర సంక్షోభంలో పడింది. వర్షాభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడిగాలులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి. రాష్ట్రంలోని 591 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో రైతులు బోర్లు, బావులు తవ్విస్తున్నారు. గోదావరి డెల్టాలో సాగు కొనసాగుతున్నా, మిగిలిన ప్రాంతాల్లో వరి నాట్లు ప్రశ్నార్థకంగా మారాయి. ఖరీఫ్‌లో వరి సాగు 10–15 శాతం తగ్గి, ధాన్యం ఉత్పత్తి కూడా 15 శాతం వరకు పడిపోవచ్చని ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేర్కొంది.