← Back to news

రాష్ట్రంలోనే బెస్ట్.. కురుపాం పంచాయతీకి ISO అవార్డ్

By DK· 16 Jul 2026
రాష్ట్రంలోనే బెస్ట్.. కురుపాం పంచాయతీకి ISO అవార్డ్

AP: విజయనగరం జిల్లా కురుపాం మేజర్ గ్రామ పంచాయతీలో ప్రజలకు నాణ్యమైన సేవలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గ్రామ పంచాయతీకి ప్రతిష్ఠాత్మక ISO అవార్డ్ లభించింది. తాడేపల్లిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ చేతులమీదుగా కురుపాం EO వెంకటనాయుడు ISO ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. రాష్ట్రంలోని ఎంపికైన 23 పంచాయతీలలో కురుపాం చోటు దక్కించుకోగా, పార్వతీపురం జిల్లా నుంచి ఏకైక గ్రామంగా నిలిచింది.

More in AP