AP· 27 Aug 2026
ఘోర ప్రమాదం.. ఆరుగురు Spot Dead
AP: విజయవాడ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, చిలకలూరిపేట దగ్గర్లో ఓ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఆటో డ్రైవర్ సడెన్గా టర్న్ తీసుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జవడంతో అందులో ఉన్న ఆటో డ్రైవర్ బాబు, మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మీ గంగమ్మ, మరియమ్మ, సువార్తమ్మ మరణించారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్లని హాస్పిటల్కి తరలించారు.