AP

భారతీయురాలిగానే చనిపోవాలని ఉంది
AP· 25 Jun 2026

భారతీయురాలిగానే చనిపోవాలని ఉంది

AP: బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపలకు చెందిన కొండ్రుగుంట మహాలక్ష్మమ్మ, నాగభూషణం దంపతుల కుమారుడు బుచ్చయ్యచౌదరి అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడ్డారు. మహాలక్ష్మమ్మకు 2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వం లభించింది. ఆమె తన సొంతూరులోనే భారత పౌరురాలిగా తుదిశ్వాస విడవాలని కోరిక ఉంది. అమెరికా పౌరసత్వం వదులుకున్న ఆమె, భారత పౌరసత్వం కోసం ఆన్‌లైన్‌ ద్వారా గవర్నమెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె దరఖాస్తు బాపట్ల జిల్లా కలెక్టర్‌ దగ్గరకు చేరింది. అమెరికా నుంచి క్లియరెన్స్ రాగానే భారత పౌరురాలిగా హోదా దక్కుతుందని కలెక్టర్ తెలిపారు.

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో CC ఫుటేజ్ మాయం
AP· 23 Jun 2026

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో CC ఫుటేజ్ మాయం

AP: సంచలనం సృష్టించిన విజయవాడ గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ అధికారులు కీలకమైన విషయాన్ని గుర్తించారు. కేసులో CCTV ఫుటేజ్‌ మాయమైనట్లు అధికారులు నిర్ధారించారు. సాయికృష్ణ మిస్సింగ్ ఉదంతంలో నిజానిజాలు రాబట్టేందుకు CCTV విజువల్స్ ఎంతో కీలకంగా మారాయి. మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు (నెల రోజుల పాటు) ఉన్న పూర్తి సీసీ ఫుటేజ్ సిస్టమ్ నుంచి మాయమైనట్లు అధికారుల విచారణలో తేలింది. నెలరోజులకు సంబంధించిన రికార్డింగ్స్ ఉండాల్సిన చోట, కేవలం రెండురోజుల ఫుటేజ్‌ మాత్రమే ఉంచి, మిగతాదంతా డిలీట్ చేసినట్లు అధికారులు గుర్తించారు.

ఇన్వెస్టర్లు రాడానికి మూడు S లే కారణం - నారా లోకేష్
AP· 23 Jun 2026

ఇన్వెస్టర్లు రాడానికి మూడు S లే కారణం - నారా లోకేష్

పారిశ్రామికవేత్తలు ఏపీవైపు మొగ్గు చూపడానికి మూడు “ఎస్” లు ప్రధాన కారణం. స్పీడ్ (వేగం), స్టెబిలిటీ (స్థిరత్వం), సర్వీస్ (సేవ)...ఈ మూడే మా విజయ రహస్యాలు అంటున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. అమరావతి, ఏఐ, క్వాంటమ్ వాలీ ఈ ఆలోచనలన్నీ చంద్రబాబువేనని తాను కేవలం ఎగ్జిక్యూషన్ మాత్రమే చేస్తున్నానని అన్నారు. తమది ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ భావంతోనే పనిచేస్తున్నామని లోకేష్ అన్నారు. దేశచరిత్రలోనే అతిపెద్ద ఎఫ్ డీఐ గూగుల్ డేటా సెంటర్ కేవలం 13నెలల్లో పనులు ప్రారంభించగలగడం తమ గొప్పతనమేనన్నారు, రిపబ్లిక్ టీవీకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడిం

విజయవాడకు బుడమేరు తరహా ముప్పు.. స్థానికుల్లో ఆందోళన
AP· 23 Jun 2026

విజయవాడకు బుడమేరు తరహా ముప్పు.. స్థానికుల్లో ఆందోళన

విజయవాడ రూరల్ మండలంలోని కొత్తూరు, తాడేపల్లి పరిసరాల్లో అక్రమ మట్టితవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కాల్వగట్లు బలహీనపడి వరదముప్పు పొంచి ఉందనే టెన్షన్ మొదలైంది. బెజవాడను బుడమేరు ముంచెత్తిన రీతిలో కాల్వగట్లు తెగితే విజయవాడ రూరల్, జి.కొండూరు, ఇబ్రహీంపట్నంలో లోతట్టు ప్రాంతాలు ముంపు బారినపడే ప్రమాదముంది. APIIC అవసరాల కోసం పోలవరం కాల్వ 167.040 KM వద్ద 4,908 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వేందుకు అనుమతులు పొందారు. నిబంధనల ప్రకారం తవ్వకాలు పరిమితంగా పగటిపూట చేపట్టాలి. రేయింబవళ్లు వేలాది లారీల్లో మట్టిని తరలిస్తున్నారు.

సాయికృష్ణ కేసు.. CI నాగరాజు అరెస్ట్‌కు రంగం సిద్దం ?
AP· 21 Jun 2026

సాయికృష్ణ కేసు.. CI నాగరాజు అరెస్ట్‌కు రంగం సిద్దం ?

AP: విజయవాడ సాయికృష్ణ కేసు విచారణ కొనసాగుతున్న వేళ నిందితుడిగా ఉన్న CI నాగరాజు గత మూడురోజులుగా ఓ కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఉంటున్నట్లు సమాచారం. నాగరాజును ఈరోజు పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆయన అనుచరులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కేసులో నిందితుడిగా ఉన్న ఓ పోలీస్ అధికారి కోర్టు సిబ్బంది ఇంట్లో ఆశ్రయం పొందడం పలు అనుమానాలకు తావిస్తుంది. నాగరాజు అక్కడ ఎందుకు ఉంటున్నారు? , ఆయనకు ఎలాంటి సహకారం అందుతోంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ ఏర్పాటు
AP· 21 Jun 2026

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ ఏర్పాటు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తుపై AP ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును త్వరగా ఛేదించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో ఉన్న ప్రాధాన్యత, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యున్నత పోలీస్ అధికారులతో 'సిట్' బృందాన్ని ఏర్పాటు చేశారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసును అన్ని కోణాల్లోనూ సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు ఏర్పాటుచేసిన ఈ ప్రత్యేక బృందానికి (SIT) చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఐజీ రవిప్రకాశ్‌ను నియమించారు.