AP

గడ్డి మందు నిషేధంపై హైకోర్ట్‌లో పిటిషన్
AP· 20 Jun 2026

గడ్డి మందు నిషేధంపై హైకోర్ట్‌లో పిటిషన్

AP: పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ 24% SL అనే గడ్డి మందు చాలా డేంజర్ అంటూ ఫిర్యాదులు రావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిషేధించిన విషయం తెలిసిందే. ఇటీవల AP రాష్ట్ర వ్యవసాయశాఖ 60రోజులపాటు గడ్డిమందును నిషేధిస్తూ జారీ చేసిన GOను సవాల్‌ చేస్తూ ఫెర్టిలైజర్స్‌, సీడ్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పారాక్వాట్‌ తయారీ, పంపిణీ, విక్రయానికి అనుమతిచ్చేలా ఆదేశించాలని పిటిషన్‌లో నాగిరెడ్డి హైకోర్టును కోరారు. గవర్నమెంట్ ముందుగా తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిషేధం విధించిందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

దయ్యాల పేరుతో కోట్లు నొక్కేసిన ట్రాన్స్ ఉమెన్!
AP· 18 Jun 2026

దయ్యాల పేరుతో కోట్లు నొక్కేసిన ట్రాన్స్ ఉమెన్!

అన్నమయ్య జిల్లాకు చెందిన మోహన్ కృష్ణ అనే అబ్బాయి, కొన్నేళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లి అమ్మాయిగా మారాడు. తిరిగి వచ్చాక తన పేరును మధుశ్రీగా మార్చుకుని. అందంగా రెడీ అవుతూ రాంగ్ రూట్‌లో మనీ సంపాదించడం స్టార్ట్ చేశాడు. భూమిలో పాతకాలపు నిధులు ఉన్నాయని, ఇంట్లో దయ్యాలు ఉన్నాయని నమ్మిస్తూ.. పూజల పేరుతో చాలామందిని మోసం చేసి కోట్ల రూపాయలు నొక్కేసాడు. అంతేకాదు, ఒక గ్యాంగ్‌ని ఫామ్ చేసి మ్యారేజెస్ దగ్గర బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. రీసెంట్‌గా బాధితులు మీడియా ముందుకు రావడంతో, దాదాపు 13 ఫ్యామిలీస్‌ని ముంచేసి కోట్లు నొక్కేసిన ఇతని గుట్టు రట్టయింది.

మెరైన్ పోలీసుల దాడులు.. రెండు బోట్లు సీజ్
AP· 18 Jun 2026

మెరైన్ పోలీసుల దాడులు.. రెండు బోట్లు సీజ్

AP: నెల్లూరు జిల్లాలోని సముద్ర జలాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన మెకనైజ్డ్ పెద్ద బోట్లతో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ చేపల వేట కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారిని గుర్తించి, అరికట్టేందుకు మత్స్యశాఖ, మెరైన్ పోలీస్, అటవీశాఖల ఆధ్వర్యంలో రెండు మెకనైజ్డ్ బోట్లతో నిరంతర సముద్ర గస్తీ నిర్వహిస్తున్నారు. ఇందుకూరుపేట మండల తీరానికి సుమారు 15కిలోమీటర్ల దూరంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన రెండు మెకనైజ్డ్ బోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి చేపలవేట నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఆ రెండు బోట్లను పట్టుకుని సీజ్ చేశారు.

ప్రపంచ బ్యాంకుకు ఉండవల్లి రైతుల ఫిర్యాదు
AP· 18 Jun 2026

ప్రపంచ బ్యాంకుకు ఉండవల్లి రైతుల ఫిర్యాదు

AP: రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లి రైతులు తమ భూముల విలువ నిర్ధారణలో జరుగుతున్న అన్యాయంపై గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ రైతులు ప్రపంచ బ్యాంక్‌కు ఫిర్యాదు చేశారు. భూముల విలువకు సంబంధించి పరిహారం ఇచ్చేటప్పుడు భూముల విలువను తక్కువగా చూపుతూ, అప్పులు తెచ్చుకునేటప్పుడు మాత్రం ఎకరాకు రూ. కోట్లలో చూపిస్తున్నారని రైతులు అందులో పేర్కొన్నారు. దీన్ని పరిశీలించిన వరల్డ్ బ్యాంకు అధికారి ఒలీవర్ CRDAకు లేఖ పంపారు. ఉండవల్లి గ్రామంలో భూముల విలువ నిర్ధారణ, రక్షణ నిబంధనల ఉల్లంఘనలపై కొత్త ఫిర్యాదు వచ్చిందని దీనిపై పరిశీలించాలని లేఖలో పేర్కొన్నారు.

చిన్నారి కుటుంబానికి అండగా ఉంటాం: హోంమంత్రి
AP· 18 Jun 2026

చిన్నారి కుటుంబానికి అండగా ఉంటాం: హోంమంత్రి

AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో మిస్సైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని AP హోంమంత్రి అనిత పరామర్శించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. చిన్నారి అదృశ్యం దర్యాప్తు పురోగతిని జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌తో మాట్లాడి తెలుసుకున్నారు. 11 రోజులుగా చేపట్టిన గాలింపు చర్యలను మంత్రికి SP వివరించారు. అనంతరం బాలిక అదృశ్యమైన ప్రదేశానికి అనిత వెళ్లి పరిశీలించారు. అడవి జంతువులు వచ్చే అవకాశముందా? అని ఆరా తీశారు. అటవీశాఖ అధికారులు కెమెరాలు, డ్రోన్ల ద్వారా పరిశీలిస్తున్నారని పోలీసులు మంత్రికి వివరించారు.

ప్రాణం తీసిన కుర్ కురే ప్యాకెట్‌లోని బొమ్మ
AP· 17 Jun 2026

ప్రాణం తీసిన కుర్ కురే ప్యాకెట్‌లోని బొమ్మ

AP: కుర్ కురే ప్యాకెట్లో వచ్చిన ప్లాస్టిక్ బొమ్మ ఓ చిన్నారి ప్రాణం తీసింది. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని కోట గ్రామానికి చెందిన సాదియా, అల్తాఫ్ దంపతులకు ఫర్హాన్ అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఐదేళ్ల ఫర్హాన్ కుర్ కురే ప్యాకెట్లో వచ్చిన ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకుంటున్నాడు. తెలిసీ తెలియక ఆ బొమ్మను మింగాడు. అది గొంతులో అడ్డంగా పడి ఊపిరాడక ఇబ్బందులు పడ్డాడు. కుటుంబసభ్యులు గుత్తి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఫర్హాన్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.