AP

ఉద్యోగాల పేరుతో టోకరా
AP· 5 Jun 2026

ఉద్యోగాల పేరుతో టోకరా

AP: ఉద్యోగాల పేరుతో కోట్లు కొల్లగొట్టి ప్లేట్ ఫిరాయించారు. నంద్యాలలో మెడికల్ కోడింగ్ కంపెనీలో ఉద్యోగాల పేరుతో యువతీ, యువకుల వద్ద కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ తర్వాత బోర్డు తిప్పేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 700మంది నుంచి డబ్బులు తీసుకుని జాబ్స్ ఇస్తామని చెప్పారు. 3నెలలు వర్క్‌ఫ్రమ్ హోమ్‌గా ఉద్యోగం చేయించుకుని సాలరీస్ ఇచ్చారు. ఆ తర్వాత ఏడునెలలు జీతాలు ఇవ్వకుండా కంపెనీనే ఎత్తేయడంతో వారు షాక్ అయ్యారు. ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి రెండు లక్షలు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. ఘటనపై బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

బయటపడుతున్న యూట్యూబర్ మోసాల చిట్టా
AP· 4 Jun 2026

బయటపడుతున్న యూట్యూబర్ మోసాల చిట్టా

AP: ఉద్యోగాలు, వీసా రెన్యువల్‌ పేరుతో యూట్యూబర్, ‘నందూస్‌ వరల్డ్‌’ ఛానల్‌ నిర్వాహకురాలు రమానందన దంపతులు చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గుంటూరుకు చెందిన జాగర్లమూడి మధుకర్, రమానందన దంపతులు యూకేలో స్థిరపడ్డారు. 'నందూస్ వరల్డ్ పేరుతో నందన యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. వీరికి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, తదితర ఏరియాల్లో డెస్టినీ కన్సల్టెన్సీ ఆఫీస్‌లు ఉన్నాయి. ఒక్కొక్కరి నుంచి రూ.20లక్షల వరకు తీసుకుని స్పాన్సర్షిప్ వీసా సర్టిఫికెట్ ఇప్పిస్తామంటూ మోసం చేశారని, 50మందికిపైగా బాధితులు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని రమానందన పేర్కొన్నారు.

ఏపీలో ఇన్వెస్ట్ చేయండి- ఎలిమెంట్ గ్రూప్ కు లోకేష్ ఇన్విటేషన్
AP· 4 Jun 2026

ఏపీలో ఇన్వెస్ట్ చేయండి- ఎలిమెంట్ గ్రూప్ కు లోకేష్ ఇన్విటేషన్

రష్యా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి లోకేష్ రాష్ట్రంలోకి కొత్త ఇన్వెస్ట్ మెంట్స్ ను ఆహ్వానించడానికి ట్రై చేస్తున్నారు. ఎలిమెంట్ గ్రూప్ రిప్రజెంటేటివ్స్ తో భేటి అయిన లోకేష్ విశాఖలో ఎలక్ట్రానిక్ కాంపొనెంట్ అసెంబ్లీ యూనిట్, నెల్లూరులో సెమీ కండక్టర్ల తయారీ కేంద్రం,శ్రీ సిటీలో రోబోటిక్స్ అండ్ ఆటో మేషన్ సేవల విస్తరణకు ఆహ్వానించారు. అమరావతి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో ఇన్ వాల్వ్ అవ్వాలని కోరారు. ఏపి ప్రభుత్వం ప్రపోజల్స్ పరిశీలించి పాజిటివ్ గా రియాక్ట్ అవుతామని ఎలిమెంట్ గ్రూప్ రిప్రజెంటేటివ్స్ చెప్పారు.

 AP రోడ్లపైకి 5,500 ఎలక్ట్రిక్ బస్సులు!..మరో 500 సిఎన్జి బస్సులు
AP· 3 Jun 2026

AP రోడ్లపైకి 5,500 ఎలక్ట్రిక్ బస్సులు!..మరో 500 సిఎన్జి బస్సులు

ఆర్టీసీలో కాలం చెల్లిన, ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. దశలవారీగా మొత్తం 6వేల బస్సులు తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా, ఇందులో విద్యుత్ బస్సులు 5,500, సీఎన్జీ బస్సులు 500 ఉంటాయి. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, సిటీ బస్సుల్లో కాలం చెల్లినవి ఏవేవి ఉన్నాయో, వాటి స్థానంలో విద్యుత్ బస్సులను అవే సర్వీసులుగా నడపనున్నారు. ప్రధానమంత్రి ఈ-బస్ సేవ పథకం కింద 750 విద్యుత్ బస్సులు రాష్ట్రానికి కేటాయించారు. వీటిని 11 నగరాల్లోని 12 డిపోల పరిధిలో అద్దె ప్రాతిపదికన నడుపుతారు. వీటిలో 300 బస్సులు జులైలో రోడ్డెక్కనున్నాయి.

రోడ్ యాక్సిడెంట్‌లో పండు మాస్టర్‌కు తీవ్ర గాయాలు
AP· 3 Jun 2026

రోడ్ యాక్సిడెంట్‌లో పండు మాస్టర్‌కు తీవ్ర గాయాలు

TG: విశాఖపట్నం జిల్లా లొడగలవానిపాలెం హైవైపై జరిగిన రోడ్ యాక్సిడెంట్‌లో డాన్స్ మాస్టర్ పండుకు తీవ్ర గాయాలయ్యాయి. రియాలిటీ షో ఢీ జోడి ఫేం డాన్స్ మాస్టర్ పండు తగరవలసలో పదహారేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఊరిపండుగ ఉత్సవాలకు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో హైవేపై కారు దిగి రోడ్డు పక్కన నిల్చున్నారు. అదే టైమ్‌లో వేగంగా వచ్చిన బొలెరో వాహనం పండు మాస్టర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో మాస్టర్ రెండుకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.