AP· 10 Oct 2026
కూటమికి 98% స్ట్రైక్ రేట్!
ఏపీలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి 98% స్ట్రైక్ రేట్ సాధిస్తుందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే సంస్థ MD చాణక్య ముఖేశ్ తెలిపారు. 52,500 మందితో నిర్వహించిన సర్వేలో TDPకి 46.9%, YCPకి 35%, జనసేనకు 9%, BJPకి 3.5% మద్దతు ఉన్నట్లు వెల్లడించారు. మంత్రుల్లో లోకేశ్, నిమ్మల రామానాయుడు, నారాయణ టాప్-3లో నిలిచారు. MLAల్లో లోకేశ్, కోటంరెడ్డి, పవన్ కల్యాణ్ ముందున్నారు. MPల్లో పెమ్మసాని, రామ్మోహన్ నాయుడు, వేమిరెడ్డి టాప్లో ఉన్నారు. ఈ సర్వేపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.