AP ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్!

స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించాలనుకున్న AP ప్రభుత్వ ప్లాన్ ఫెయిలైంది. ఇందుకోసం ప్రభుత్వం పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదంటూ.. ప్రభుత్వ G.Oను కొట్టివేస్తూ, ఇటీవల AP హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అందువల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వం BCలకు 24 శాతం రిజర్వేషన్లే ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ తీర్పు రావడంతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగింది. EC ఏర్పాట్లు చెయ్యనుంది.



