← Back to news

APలో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

By Sandeep· 1h ago
APలో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ పడింది. హైకోర్టు చెప్పిన గడువులోగా ఎన్నికల్ని పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి S.I.R ఓటర్ల లిస్ట్ సిద్ధమైతే దాని ప్రకారమే ఎన్నికలు జరపాలనీ, లిస్ట్ రెడీ అవ్వకపోతే, పాత ఓటర్ల లిస్ట్ ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్థానిక పోరుకు మార్గం సుగమమైంది.

More in AP