50 ఫోన్లు రికవరీ.. షాక్‌లో దొంగలు!

నెల్లూరు రైల్వే సబ్-డివిజన్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, పోయిన ₹10 లక్షల విలువైన 50 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. CEIR పోర్టల్, IMEI ట్రాకింగ్ సహాయంతో స్పెషల్ టీమ్స్ ఈ ఫోన్లను గుర్తించాయి. నెల్లూరు, గూడూరు, కావలి, ఒంగోలు, చీరాల GRPS స్టేషన్ల పరిధిలో వీటిని స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన మొబైల్స్ ను నెల్లూరు రైల్వే DSP G. మురళీధర్ గురువారం బాధితులకు అందజేశారు.



