Crime

ఎక్స్‌ప్రెస్‌ రైలులో చోరీ.. పోలీసులు కాల్పులు
Crime· 15 Jun 2026

ఎక్స్‌ప్రెస్‌ రైలులో చోరీ.. పోలీసులు కాల్పులు

AP: బాపట్ల శివారులోని నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తమిళనాడు రాష్ట్రం చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్ట్‌కు వెళుతున్న సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌‌లో ఆదివారం అర్ధరాత్రి దాటాక 1.15 గంటల సమయంలో S-3, S-6 బోగీల్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళల నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. చైన్‌ లాగడంతో రైలు నిలిచిపోయింది. దొంగలు రైలు దిగి పారిపోతుండగా ఎస్కార్ట్‌ విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు 9 రౌండ్లు కాల్పులు జరిపారు. దుండగుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

పెట్టుబడుల పేరుతో భారీ సైబర్ మోసం
Crime· 15 Jun 2026

పెట్టుబడుల పేరుతో భారీ సైబర్ మోసం

TG: హైదరాబాద్‌‌లోని సనత్‌నగర్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫేస్‌బుక్‌లో అధిక లాభాలు వస్తాయని ఇన్వెస్ట్‌మెంట్ యాడ్ చూశాడు. యాడ్‌పై క్లిక్ చేయడంతో సైబర్‌నేరగాళ్లు అతడిని సంప్రదించారు. ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని నమ్మించి వాట్సాప్ గ్రూపుల్లో చేర్చారు. మోసగాళ్లు సూచించిన బ్యాంక్ అకౌంట్లకు మొత్తం రూ.2.22 కోట్లను ట్రాన్స్‌ఫర్ చేశాడు. నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్ డ్యాష్‌బోర్డ్‌లో అతని అకౌంట్‌లో రూ.3.1 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించారు. ఆ డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ఉద్యోగి పయత్నించగా రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.

డిప్రెషన్ తో మహిళా టెకీ సూసైడ్ః ఆరు నెలల బేబీ సేఫ్
Crime· 13 Jun 2026

డిప్రెషన్ తో మహిళా టెకీ సూసైడ్ః ఆరు నెలల బేబీ సేఫ్

నిద్రలేమి, ఎంగ్జైటీ, డెలివరీ తర్వాత డిప్రెషన్ లాంటి సమస్యలతో ఓ మహిళా టెకీ హైదరాబాద్ లోని మియాపూర్ లో తన ఆరు నెలల బేబీతో ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తీవ్రమైన కుంగుబాటే ఆమె సూసైడ్ కి కారణమని తెలుస్తోంది. ఆరు నెలల పసిపాప మాత్రం తల్లి దూకినప్పుడు నేరుగా కింద పడకుండా పక్కన ఉన్న ప్రొటెక్టివ్ కంచె పై పడటంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు ఆమె మెడికల్ రికార్డులను స్టడీ చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరు నెలల పసిపాప వాణి మాత్రం సేఫ్ గా, ఆరొగ్యంగానే ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

కరెంట్ షాక్‌తో తండ్రీకూతురు స్పాట్‌డెడ్
Crime· 13 Jun 2026

కరెంట్ షాక్‌తో తండ్రీకూతురు స్పాట్‌డెడ్

TG: హైదరాబాద్‌లోని అల్వాల్‌ పరిధిలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి టెలికాంకాలనీలో సందీప్‌‌ కారుపై ఓ పెద్ద చెట్టుకొమ్మ విరిగి పడింది. శనివారం ఉదయం కారుపై పడ్డ చెట్టుకొమ్మలను తొలగించేందుకు సందీప్‌ తన కుమార్తె రితికతో కలిసి ప్రయత్నించారు. కొమ్మలను లాగుతుండగా పచ్చికొమ్మలు పక్కనే ఉన్న హైవోల్టేజ్ కరెంట్ వైర్లు తగిలాయి. చెట్టుకొమ్మల ద్వారా విద్యుత్ ప్రసారమవ్వడంతో తండ్రీకూతురు కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిని కాపాడేందుకు సందీప్‌ భార్య శ్వేత ప్రయత్నించగా, ఆమె కూడా షాక్‌కు గురై స్వల్ప గాయాలతో బయటపడ్డారు.