Crime· 11 Jun 2026
అనుమానం తో స్తంభానికి కట్టేసి గుండు కొట్టించారు!
పంజాబ్లోని లుధియానాలో ఒక వ్యక్తి దొంగతనం చేశాడనే అనుమానంతో జనాలు అతనిపై దారుణంగా అటాక్ చేశారు. కాళ్లు, చేతులు కట్టేసి, గుండు కొట్టించి, కనుబొమ్మలు కూడా తీసేశారు. అంతటితో ఆగకుండా ‘నేను దొంగను’ అని రాసి ఉన్న బోర్డును అతని చేతిలో పెట్టి వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో, వాళ్లు జూన్ 10న కేసు ఫైల్ చేశారు, దాడి చేసిన వాళ్లను పట్టుకునేందుకు పోలీసులు ట్రై చేస్తున్నారు.