NIMS లో బాలికపై లైంగికదాడికి యత్నం

TG: హైదరాబాద్‌లోని NIMS ఆస్పత్రి ప్రాంగణంలో ఓ బాలికపై లైంగికదాడి యత్నించిన ఘటన కలకలం రేపింది. పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో నూతన భవనాల నిర్మాణం జరుగుతుంది. అదే సైటులో ఓ కుటుంబం నిర్మాణ పనులు చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు లేని సమయంలో ఓ వ్యక్తి బాలికను వారు ఉంటున్న గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు శంభు బండారిగా పోలీసులు గుర్తించారు. పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.



