వనస్థలిపురంలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ భగ్నం

TG: హైదరాబాద్ వనస్థలిపురం పరిధిలోని హయగ్రీవ హాస్పిటల్‌లో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు డికాయ్ ఆపరేషన్ నిర్వహించారు. హాస్పిటల్ డైరెక్టర్ కొర్ర రాజు, రిసెప్షనిస్ట్ లోకేష్‌తో పాటు తుక్కుగూడ శ్రీసాయి ధనుష్ క్లినిక్ ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. వనస్థలిపురం పోలీసులకు అందిన సమాచారం మేరకు మహిళా పోలీసును డికాయ్‌గా హయగ్రీవ హాస్పిటల్‌కు పంపారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. PCPNDT చట్టం ప్రకారం గర్భంలోని శిశువు లింగాన్ని తెలియజేయడం నేరం.



