రూ.20 కోసం గొడవ.. ఒకరు మృతి

AP: అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో శేఖర్ అనే వ్యక్తి కూరగాయ దుకాణం నిర్వహిస్తున్నాడు. మద్యంమత్తులో ఉన్న ఇద్దరు యువకులు శేఖర్ వద్ద కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చారు. బిల్లు రూ.120 కాగా, యువకులు రూ.500 నోటు ఇవ్వడంతో శేఖర్ రూ.380 తిరిగిచ్చాడు. ఇంకా రూ.20 ఇవ్వాలని యువకులు అడగటంతో వ్యాపారి ఇవ్వలేదు. మాటామాటా పెరిగి శేఖర్‌పై యువకులు దాడిచేశారు. గొడవపెద్దిది కావడంతో పక్కనున్న ట్యాక్సీ డ్రైవర్ బెస్త చంద్ర(55) జోక్యం చేసుకుని గొడవ ఆపాలని సర్దిచెప్పాడు. మద్యంమత్తులో ఉన్న యువకులు అతడిపై దాడిచేశారు. చంద్ర కుప్పకూలి మరణించాడు.



