Crime

మతం అడిగి మరీ దాడి!
Crime· 28 Apr 2026

మతం అడిగి మరీ దాడి!

నిన్న ఎర్లీ మార్నింగ్ ముంబై దగ్గర మీరా రోడ్ లో ఒక భయంకరమైన ఇన్సిడెంట్ జరిగింది. జైబ్ జుబైర్ అన్సారీ (31) అనే పర్సన్ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ని (రాజ్కుమార్ మిశ్రా, సుబ్రతో సేన్) కత్తితో పొడిచాడు. ముందుగా వాళ్ళ మతం ఏంటో అడిగి, "కల్మా" చదవమని ఫోర్స్ చేసాడు. వాళ్ళు చదవలేదని కోపంతో వారి మీద అటాక్ చేసాడు. వెంటనే అన్సారీ ని పోలీసులు అరెస్ట్ చేసారు. మిశ్రా కండిషన్ ఇప్పుడు సీరియస్ గా ఉంది. పోలీస్ సోదా లో అన్సారీ ఇంట్లో ISIS అనే ఒక అరబిక్ టెర్రరిస్టు గ్రూప్ వి కొన్ని పేపర్స్ దొరికాయి. అంటే అతను ఒక టెర్రరిస్టు అని అనుమాణిస్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్ర ATS ఈ కేసు ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

సహజీవనంతో బిడ్డను కన్నాక అత్యాచారం అనడం తప్సు ః సుప్రీం
Crime· 27 Apr 2026

సహజీవనంతో బిడ్డను కన్నాక అత్యాచారం అనడం తప్సు ః సుప్రీం

లివిన్ రిలేషన్ షిప్స్ పై సుప్రీం కోర్టు కీలక కామెంట్స్ చేసింది. ఆడ, మగ ఇద్దరూ సహజీవనం చేసిఒక బిడ్డను కూడా కన్నాక బంధం వీగిపోతే దానిని లైంగిక దాడి, అత్యాచారం గా ఎలా లెక్కిస్తారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ తన పార్ట్ నర్ పై కేసు పెట్టింది. ఆకేసు విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న ఈ కామెంట్స్ చేశారు. పెళ్లి కాకుండా బిడ్డను కని ఇప్పుడు దానిని లైంగిక దాడి అనడం చెల్లదని ఆమె అన్నారు.పెళ్లి చేసుకోకుండా బంధాలను కొనసాగిస్తే వచ్చే సమస్యలిలాగే ఉంటాయని అన్నారు.

పెళ్లి పేరుతో  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు నటి ఆశూ రెడ్డి  మస్కా!
Crime· 26 Apr 2026

పెళ్లి పేరుతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు నటి ఆశూ రెడ్డి మస్కా!

పెళ్లి పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ధర్మేంద్రను మోసం చేసి, ₹9.83 కోట్లు, 5KG గోల్డ్, విల్లా అడ్వాన్స్ వసూలు చేసినట్లు నటి Ashu Reddy ఫ్యామిలీపై CCS పోలీసులు కేసు నమోదు చేశారు. వేణుస్వామి దగ్గర జాతకాలు చూపించి మరీ నమ్మించి, తీరా పెళ్లికి నో చెప్పి హనీ ట్రాప్ చేశారని బాధితుడి తండ్రి ఫిర్యాదు చేశారు. ఆషురెడ్దీ చెల్లెలు దివ్యారెడ్డి కి కూడా ధర్మేంద్ర 50 లక్షలు ఇచ్చినట్లు చెప్పారు. అక్కా, చెల్లి ఇద్దరూ హానీ ట్రాప్ తో తమ కుమారుని భారీగా దోచేశారంటూ కంప్లయింట్ చేయడంతో అశురెడ్డిపై వేర్వేరు సెక్షన్ల కింద సీరియస్ యాక్షన్ మొదలైంది!

ట్రంప్ మీటింగ్ లో కాల్పుల కలకలం.. ప్రెసిడెంట్ సేఫ్
Crime· 26 Apr 2026

ట్రంప్ మీటింగ్ లో కాల్పుల కలకలం.. ప్రెసిడెంట్ సేఫ్

అమెరికా వైట్ హౌస్ సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కరస్పాండెట్స్ కు ఇచ్చిన డిన్నర్ లో ఒక దుండగుడు కాల్పులు తెగపడ్డాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే అలెర్ట్ అయి డొనాల్డ్ ట్రంప్‌, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను వేదిక నుండి సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో షూటర్ గాయపడి పట్టుబడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ షాకింగ్ ఇన్సిడెంట్ తర్వాత అంతా క్షేమమేనని ట్రంప్ ప్రకటించారు.డిన్నర్ టైమ్‌లో ఈ 'షాకింగ్' ఇన్సిడెంట్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతోంది

నా డెడ్ బాడీని తండ్రి తాకద్దుః కాన్పూర్ లాయర్ సంచలన పోస్ట్ !!
Crime· 25 Apr 2026

నా డెడ్ బాడీని తండ్రి తాకద్దుః కాన్పూర్ లాయర్ సంచలన పోస్ట్ !!

కాన్పూర్ కోర్టు భవనంపై నుంచి దూకి పాతికేళ్ల లాయర్ ప్రియాన్షు శ్రీవాస్తవ చనిపోయాడు. ఆత్మ హత్యకు ముందు వాట్సప్ లో సూసైడ్ నోట్ వైరల్ గా మారింది. బాల్యంలో తండ్రి అకృత్యాలే సూసైడ్ కి కారణమని నోట్‌లో ఆరోపించాడు ప్రియాన్షు. తండ్రి కఠినంగా వ్యవహరించడంవల్ల మెంటల్ టెన్షన్ పెరిగిందని, ఇష్టం లేని చదువువల్ల ఎగ్జామ్స్ ఫెయిల్ అయినట్లు అందులో రాశాడు.ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలతో ఒత్తిడి పెరిగి, ఆత్మన్యూనత భావంతో బాధపడ్డానని పేర్కొన్నాడు.“నా డెడ్ బాడీని నా తండ్రి తాకకూడదు” అని రాయడం సంచలనం. తన తల్లిని నిందించొద్దని అతడు కోరాడు.

 భార్య టార్చర్ ను సీక్రెట్ గా రికార్డ్ చేసిన బాధితుడు!
Crime· 24 Apr 2026

భార్య టార్చర్ ను సీక్రెట్ గా రికార్డ్ చేసిన బాధితుడు!

భార్యలని హింసించే భర్తలని చూశాం. కానీ ఓ భార్య తన భర్తను రెండేళ్లుగా హింసిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ భార్యా బాధితుడు తాను అనుభవిస్తున్న టార్చర్ ను తన లాప్ టాప్ లో సీక్రెట్ గా రికార్డు చేయడంతో ఇది బయటపడింది. అందులో భార్య అతడిని కొట్టడం, తిట్టడం, కాలితో తన్నడం లాంటి విజువల్స్ ఉన్నాయి. కానీ ఈ వీడియో ఎక్కడది? ఇందులో ఉన్న వారెవరు అన్న డిటైల్స్ మాత్రం లేవు. విశాల్ మాల్వి అనే వ్యక్తి షేర్ చేసినట్లుగా ఉంది. అందుకే పెళ్లికి ముందు రెండుసార్లు ఆలోచించుకోండి బ్రో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.