← Back to news

తమిళనాడులో జార్ఖండ్ గిరిజనులపై దాడులు !!

By DS· 26 Apr 2026· tamilanadu
తమిళనాడులో జార్ఖండ్ గిరిజనులపై దాడులు !!

తమిళనాడులోని నామక్కల్‌లో గల ఒక టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో వేధింపులు తాళలేక జార్ఖండ్‌కు చెందిన సుమారు 100 మంది ఆదివాసీ కార్మికులు సొంతూళ్లకు తిరిగి వెళ్లిపోయారు. తమకు వేతనాలు చెల్లించలేదని, సరైన ఫుడ్ కూడా ఇవ్వకపోగా, తీవ్రంగా కొడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ వదిలి వెళ్తామంటే తమను బెదిరించారని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్పందించి విచారణకు ఆదేశించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.