Education· 30 Jun 2026
గవర్నమెంట్ స్కూళ్లలో AI టెక్నాలజీ
AP విద్యాశాఖ గవర్నమెంట్ స్కూళ్లలో విద్యార్థుల హాజరు నమోదు కోసం కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సరికొత్త ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఉపాధ్యాయుల సమయం ఆదా అవ్వడానికి, హాజరు పారదర్శకతకు, కచ్చితత్వానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. మంగళగిరి, తాడేపల్లి, విజయవాడలో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ విధానం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది. విద్యార్థుల ముఖాలను ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తించి, గ్రూప్ ఫొటో తీయగానే ఆటోమేటిక్‌గా హాజరు నమోదవుతుంది. టైమ్ సేవ్ అవ్వడమే కాకుండా, హాజరు నమోదులో కచ్చితత్వం, పారదర్శకత పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.