Entertainment

రియాక్షన్ వీడియోల రచ్చ.. సోషల్ మీడియా కొత్త డ్రామా!
Entertainment· 9 Jul 2026

రియాక్షన్ వీడియోల రచ్చ.. సోషల్ మీడియా కొత్త డ్రామా!

ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ల్లో Reaction Videos బూమ్‌తో కొత్త "Reaction Economy" క్రేజ్‌లో ఉంది. ఒక వీడియోపై మరో వీడియో చేస్తూ వ్యూస్, ఫాలోవర్లు, ఆదాయం పెంచుకుంటున్నారు. కానీ సరదా కామెంట్లు క్రమంగా విమర్శలు, ట్రోలింగ్, పబ్లిక్ షేమింగ్‌గా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంటెంట్ క్రియేటర్లు అసలు వీడియో కంటే రియాక్షన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆన్‌లైన్ చర్చలు హెల్తీ డిబేట్ నుంచి హేట్ కల్చర్ వైపు వెళ్తున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. సోషల్ మీడియాలో రియాక్ట్ చేసే ముందు ఫ్యాక్ట్స్ చెక్ చేయడం, బాధ్యతగా స్పందించడం ఇప్పుడెంతో అవసరం.

ఫిలిం మేకింగ్ కి యూ ట్యూబర్స్  నయా డెఫినిషన్ !
Entertainment· 5 Jul 2026

ఫిలిం మేకింగ్ కి యూ ట్యూబర్స్ నయా డెఫినిషన్ !

ఫిలిం మేకింగ్ కి కొత్త డెఫినిషన్ ఇస్తున్నారు నేటి యూ ట్యూబర్స్. హాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టూడియోలకి గట్టి షాకిస్తున్నారు ఈ యంగ్ స్టర్స్! 2026లో హర్రర్ సినిమాలు తీస్తూ, బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధిస్తున్నారు. స్టూడియో సిస్టమ్‌ను పక్కనబెట్టి, సొంతంగా కథలు రాస్తూ, డైరెక్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. Talk to Me, Late Night with the Devil లాంటి సినిమాలు వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. డిజిటల్ స్క్రీన్ల నుండి థియేటర్ల వరకు ఈ క్రియేటర్స్ హవా నడుస్తోంది. హాలీవుడ్‌లో ఈ యూట్యూబ్ స్టార్స్ నిజంగా సరికొత్త ట్రెండ్‌కి తెరలేపారు.

BIG BOSSలో ఛాన్స్ ఇవ్వాలని SI రిక్వెస్ట్
Entertainment· 25 Jun 2026

BIG BOSSలో ఛాన్స్ ఇవ్వాలని SI రిక్వెస్ట్

AP: నంద్యాల జిల్లా గడివేముల పోలీస్‌స్టేషన్‌లో SIగా విధులు నిర్వహిస్తున్న నాగార్జునరెడ్డి BIG BOSS సీజన్-10లో తనకు కంటెస్టెంట్‌గా అవకాశం ఇవ్వాలని విడుదల చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విధి నిర్వహణలో కఠినంగా ఉండే SI నాగార్జునరెడ్డి, ఇంట్లో మాత్రం పక్కా ఫ్యామిలీ మెన్. తన ఇద్దరు కుమార్తెల కోరిక మేరకే తాను వీడియో చేస్తున్నట్లుగా స్వయంగా వెల్లడించారు. తన కూతుళ్లు ఇస్తున్న సపోర్టుతోనే BIG BOSSకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నాడు. దీనిపై ప్రభుత్వ నిబంధనలు, ఉన్నతాధికారులు అంగీకరిస్తారా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

మెడల్ తగిలించడానికి ట్రంప్ తిప్పలు? నవ్వు ఆపుకోలేకపోయిన ఆర్మీ ఆఫీసర్!
Entertainment· 19 Jun 2026

మెడల్ తగిలించడానికి ట్రంప్ తిప్పలు? నవ్వు ఆపుకోలేకపోయిన ఆర్మీ ఆఫీసర్!

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ అధికారిక కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. వైట్ హౌస్‌లో జరిగిన ఓ ప్రోగ్రామ్‌లో ఆర్మీ మేజర్ నికోలస్ డోకరీకి ప్రెసిడెంట్ ట్రంప్ అత్యున్నత 'మెడల్ ఆఫ్ ఆనర్' బహుకరించారు. అయితే, ఆ మెడల్‌ను ఆఫీసర్ కోటుకు తగిలించే క్రమంలో ట్రంప్ కాస్త ఇబ్బంది పడటంతో హాల్‌లోని వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. దీనిపై ట్రంప్ కూడా కూల్‌గా స్పందిస్తూ.. "నేను దీన్ని కాస్త డిఫరెంట్‌గా, ఇంకాస్త నీట్‌గా తగిలిస్తాను, ఇది ఇక అస్సలు ఊడిపోదు" అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్‌కు సంబంధించిన ఈ క్రేజీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.