Infotainment

పేరెంట్స్‌కు గుడ్‌న్యూస్.. ప్రైవేట్ స్కూళ్లపై Complaint ఈజీ
Infotainment· 21 Aug 2026

పేరెంట్స్‌కు గుడ్‌న్యూస్.. ప్రైవేట్ స్కూళ్లపై Complaint ఈజీ

TG: రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించి కంప్లైంట్స్ చేసేందుకు ఆన్‌లైన్ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోని ప్రైవేట్ స్కూళ్లపై పేరెంట్స్, స్టూడెంట్స్ తమ ప్రాబ్లమ్స్‌ను నేరుగా <a href="https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/">ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు</a> పంపవచ్చు. ఇందుకోసం ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌ ఆఫిషియల్ వెబ్‌సైట్‌లో ‘<a href="https://schooledu.telangana.gov.in/PSCMS/userAuthenticateByOTP.do">ప్రైవేట్ స్కూల్ కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్</a>’ను అందుబాటులోకి తెచ్చారు. ఇంటి నుంచే కంప్లైంట్ చేసే అవకాశం ఉందని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్ డాక్టర్ E. నవీన్ నికోలస్ తెలిపారు.

మీ కంప్యూటర్ టేబుల్‌ను రెట్రో స్టైల్‌లోకి మార్చుకోండి ఇలా!
Infotainment· 17 Aug 2026

మీ కంప్యూటర్ టేబుల్‌ను రెట్రో స్టైల్‌లోకి మార్చుకోండి ఇలా!

మీ కంప్యూటర్ టేబుల్‌ని పాతకాలపు (రెట్రో) శైలిలో కూల్‌గా మార్చుకోవడం చాలా ఈజీ. టైప్‌రైటర్ మోడల్‌లో ఉండే మెకానికల్ కీబోర్డ్ వాడితే మీ వర్క్‌స్పేస్‌కి ఒక క్లాసిక్ లుక్ వస్తుంది. పాత గేమ్స్, పిక్సెల్ ఆర్ట్ లేదా పాత ఓఎస్ డిజైన్లలో ఉండే వాల్‌పేపర్లను కంప్యూటర్ స్క్రీన్‌పై పెట్టుకోవచ్చు. డెస్క్ లుక్ పెంచడానికి పాత ఫ్లాపీ డిస్క్‌లు, ఆడియో క్యాసెట్ టేప్‌లు, పాత కెమెరాలు లాంటివి డెకరేషన్‌గా పెట్టుకోవచ్చు. వెలుగునిచ్చే చిన్న డెస్క్ లాంప్ పెట్టుకుంటే మీ వర్క్ ఏరియా చాలా ప్రశాంతంగా, క్లాసీగా మారిపోతుంది.