Local

 మళ్ళీ తండ్రి గూటికి కవిత ?
Local· 7 Apr 2026

మళ్ళీ తండ్రి గూటికి కవిత ?

కేసీఆర్ కుటుంబంలో కలతలు ఒక కొలిక్కి వచ్చాయా? కుమార్తె కవితతో ఆయన సయోధ్య కోరుకుంటున్నారా? ఏదేమైనా కుటుంబ తగాదాలపై కేసీఆర్ భార్య శోభ మాత్రం వర్రీ అవుతున్నారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో కవిత తన టీమ్ ను రంగంలోకి దించితే పార్టీకి మరింత నష్టమని కేసీఆర్ టెన్షన్ పడుతున్నట్లుగా తెలుస్తోంది.అలాగని కుమార్తెతో సయోధ్యకు ఆయన పూర్తి సిద్ధంగా లేరు. అందుకే మధ్యే మార్గంగా శోభ రంగ ప్రవేశం చేశారా? కవిత దగ్గరకు ఆమె తల్లి శోభ తరచుగా వెళ్లి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.కవితను కంట్రోల్ చేయకపోతే పార్టీకి మరింత నష్టమని కేసీఆర్, కేటీఆర్, హరీష్ కూడా భావిస్తున్నారు.

అర్చకులు విదేశాలకు వెళ్లొస్తే ఏమవుతుందో తెలుసా ?
Local· 7 Apr 2026

అర్చకులు విదేశాలకు వెళ్లొస్తే ఏమవుతుందో తెలుసా ?

విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు ఇక గర్భాలయంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏపీ హైకోర్టు దీనికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భాలయంలోకి వెళ్లి పూజలు చేయడానికి వీల్లేదని 2010లోనే దేవాదాయ శాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. శృంగేరి శారదా పీఠం జగద్గురువు శ్రీభారతి తీర్థ మహాస్వామి కూడా దీనినే సమర్థించారు. విదేశీ ప్రయాణాలు చేసివచ్చినా గర్భాలయంలోకి ప్రవేశిస్తున్న పూజారులను అడ్డుకోవాలంటూ దేవాదాయ శాఖ దాఖలు చేసిన పిటిషన్న్ ను న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వరులు విచారించారు. విదేశాలకు వెళ్లొస్తే అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించకూడదని స్పష్టం చేశారు.

పిల్లలకి సమ్మర్ హాలిడేస్: పేరెంట్స్ అలర్ట్ అవ్వండి ఇలా!
Local· 6 Apr 2026

పిల్లలకి సమ్మర్ హాలిడేస్: పేరెంట్స్ అలర్ట్ అవ్వండి ఇలా!

ఒకప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే అమ్మమ్మ ఊరు, ఆటపాటలు. కానీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే పిల్లలు స్మార్ట్‌ఫోన్లకే పరిమితమై, సోషల్ మీడియా మరియు రీల్స్ వంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, చిన్నపాటి మందలింపులకే మనస్తాపం చెంది ఇల్లు వదిలి వెళ్తున్నరు. అందుకే, పేరెంట్స్ మీ టైమ్ని పిల్లలకి కేటాయించండి. వారు ఇంటర్నెట్‌లో ఏం చూస్తున్నారో గమనిస్తూ, ఎక్షామ్ రిసల్ట్ విషయంలో వారికి భరోసానివ్వండి. మీ అప్రమత్తతే వారి భవిష్యత్తుకు రక్షణ అని. V.C.sajjanar పేరెంట్స్ కి సూచనలు చేసారు.

అబార్షన్‌కు భార్య అంగీకరించలేదని హతమార్చిన భర్త
Local· 3 Apr 2026

అబార్షన్‌కు భార్య అంగీకరించలేదని హతమార్చిన భర్త

పున్నేలుకు చెందిన అజారుద్దీన్, ఫర్హాత్(26) దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉమేరా(8), ఆయేషా(6) ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఫర్హాత్ రెండుసార్లు ప్రెగ్నెంట్ అయింది. మళ్లీ ఆడపిల్లలు పుడతారనే అనుమానంతో అబార్షన్ చేయించాడు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ప్రెగ్నెంట్ అయింది. ఈ సారి కూడా ఆడబిడ్డ పుడుతుందనే అనుమానించిన అజారుద్దీన్. అబార్షన్ చేయించుకోవాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో చాలాసార్లు గొడవపడ్డాడు. అలా కోపం పెంచుకున్న అతను పథకం ప్రకారం బుధవారం రాత్రి భార్య, పిల్లలను స్విమ్మింగ్ పూల్లో ముగ్గురినీ తోసేసి హతమార్చాడు.