← Back to news

మామిడి పళ్లు కల్తీయా ? ఇలా చేయండి‌

By AR· 3 Apr 2026· Telugu Report· Hyderabad
మామిడి పళ్లు కల్తీయా ? ఇలా చేయండి‌

మామిడిపళ్లు బంగారం రంగులో నిగనిగలాడుతూ కనిపించడానికి కొందరు వ్యాపారులు విచ్చలవిడిగా‌ కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలతో పండించి అమ్మేస్తున్నారు.‌ మార్కెట్ లో ఎక్కడ చూసినా ఇలాంటి‌పళ్లే కనిపిస్తు‌న్నాయి. ఇవి బయటకు ఆకర్షణీయంగా కనిపించినా లోపల విషపూరితంగా ఉండే ప్రమాదం ఉంది. ఇలాంటి పండ్లు తినడం వల్ల వాంతులు, విరేచనాలు, శ్వాస కోశ సంబంధ సమస్యలు రావొచ్చు. అందుకే పండ్లపై అనుమానం ఉంటే డయల్ ,100 లేదంటే 8712661212 సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు.

More in Local