యువకుడి ప్రాణం తీసిన క్రికెట్

విశాఖపట్నం ఆరిలోవ పెద్దగదిలిలో క్రికెట్ ఆట ఒక యువకుడు ప్రాణాలు బలితీసుకుంది. .క్రికెట్ ఆడుతున్న సమయంలో అజిత్(23), కిశోర్(26) మధ్య వివాదం తలెత్తింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కిశోర్ అందరూ చూస్తుండగానే అజిత్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన అజిత్ అక్కడికక్కడే మృతి చెందాడు.సిఐ మల్లేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


