షార్ట్ ఫిల్మ్ సరదా ముగ్గురు యువకుల ప్రాణాలు తీసింది!
కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి వద్ద పెన్నా నదిలో షార్ట్ ఫిల్మ్ తీయడానికి వెళ్లిన ఎనిమిది మంది యువకుల్లో ముగ్గురు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. కనీస భద్రత లేకుండా నదిలోకి దిగడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. షార్ట్ ఫిల్మ్ కోసం చేసిన ప్రయత్నం ప్రాణాల మీదకు రావడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది. నదులు, జలాశయాల వద్ద యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.



