Local

మహానడు వేదిక విజయనగరం !!
Local· 9 Apr 2026

మహానడు వేదిక విజయనగరం !!

టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు 2026 ఈసారి విజయ నగరం జిల్లాలో జరుగుతోంది. అందుకు తగ్గ స్థల పరిశీలన ఏర్పాట్లు చేయాలని టీడీపీ అధిష్టానం పార్టీ వర్గాలను ఆదేశించింది.మే 28న ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. నెల్లిమర్లలో ఈ సారి ఈ వేడుకలు జరుగుతాయి.మే 27,28,9తేదీల్లో జరిగే ఈ వేడుకలకు నెల్లిమర్ల ముస్తాబవుతోంది.నెల్లిమర్ల విజయనగరానికి ఆనుకుని ఉండటం, జాతీయ రహదారికి దగ్గరలో ఉండటం వల్ల ఎక్కువమంది హాజరవడానికి ఆస్కారం ఉంది. సభాప్రాంగణం, పార్కింగ్,విడిది వసతులు చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ క్లీస్ స్వీప్ చేసింది.

 మళ్ళీ తండ్రి గూటికి కవిత ?
Local· 7 Apr 2026

మళ్ళీ తండ్రి గూటికి కవిత ?

కేసీఆర్ కుటుంబంలో కలతలు ఒక కొలిక్కి వచ్చాయా? కుమార్తె కవితతో ఆయన సయోధ్య కోరుకుంటున్నారా? ఏదేమైనా కుటుంబ తగాదాలపై కేసీఆర్ భార్య శోభ మాత్రం వర్రీ అవుతున్నారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో కవిత తన టీమ్ ను రంగంలోకి దించితే పార్టీకి మరింత నష్టమని కేసీఆర్ టెన్షన్ పడుతున్నట్లుగా తెలుస్తోంది.అలాగని కుమార్తెతో సయోధ్యకు ఆయన పూర్తి సిద్ధంగా లేరు. అందుకే మధ్యే మార్గంగా శోభ రంగ ప్రవేశం చేశారా? కవిత దగ్గరకు ఆమె తల్లి శోభ తరచుగా వెళ్లి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.కవితను కంట్రోల్ చేయకపోతే పార్టీకి మరింత నష్టమని కేసీఆర్, కేటీఆర్, హరీష్ కూడా భావిస్తున్నారు.

అర్చకులు విదేశాలకు వెళ్లొస్తే ఏమవుతుందో తెలుసా ?
Local· 7 Apr 2026

అర్చకులు విదేశాలకు వెళ్లొస్తే ఏమవుతుందో తెలుసా ?

విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు ఇక గర్భాలయంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏపీ హైకోర్టు దీనికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భాలయంలోకి వెళ్లి పూజలు చేయడానికి వీల్లేదని 2010లోనే దేవాదాయ శాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. శృంగేరి శారదా పీఠం జగద్గురువు శ్రీభారతి తీర్థ మహాస్వామి కూడా దీనినే సమర్థించారు. విదేశీ ప్రయాణాలు చేసివచ్చినా గర్భాలయంలోకి ప్రవేశిస్తున్న పూజారులను అడ్డుకోవాలంటూ దేవాదాయ శాఖ దాఖలు చేసిన పిటిషన్న్ ను న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వరులు విచారించారు. విదేశాలకు వెళ్లొస్తే అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించకూడదని స్పష్టం చేశారు.

పిల్లలకి సమ్మర్ హాలిడేస్: పేరెంట్స్ అలర్ట్ అవ్వండి ఇలా!
Local· 6 Apr 2026

పిల్లలకి సమ్మర్ హాలిడేస్: పేరెంట్స్ అలర్ట్ అవ్వండి ఇలా!

ఒకప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే అమ్మమ్మ ఊరు, ఆటపాటలు. కానీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే పిల్లలు స్మార్ట్‌ఫోన్లకే పరిమితమై, సోషల్ మీడియా మరియు రీల్స్ వంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, చిన్నపాటి మందలింపులకే మనస్తాపం చెంది ఇల్లు వదిలి వెళ్తున్నరు. అందుకే, పేరెంట్స్ మీ టైమ్ని పిల్లలకి కేటాయించండి. వారు ఇంటర్నెట్‌లో ఏం చూస్తున్నారో గమనిస్తూ, ఎక్షామ్ రిసల్ట్ విషయంలో వారికి భరోసానివ్వండి. మీ అప్రమత్తతే వారి భవిష్యత్తుకు రక్షణ అని. V.C.sajjanar పేరెంట్స్ కి సూచనలు చేసారు.