శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
శ్రీకాకుళం జిల్లాలో నెమలి నారాయణపురం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హఠాత్తుగా వాతావరణం మారిపోయి ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో ఇన్నోవా కారు డివైడర్ ని ఢీకొట్టి మరో పక్కకు పల్టీకొట్టింది.అదే సమయంలో అటు నుంచి వస్తున్న లారీని ఢీ కొట్టడంతో బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురికి గాయాలైతే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పూరీ దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.



